top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 30 - AUGUST - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀 🍀. వరాహ జయంతి, Varaha Ja

🍀 30 - AUGUST - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🍀. వరాహ జయంతి, Varaha Jayanti శుభాకాంక్షలు 🍀

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 30, ఆగస్టు 2022 మంగళవారం, భౌమ వాసరే Tuesday 🌹

🍀. వరాహ జయంతి, Varaha Jayanti శుభాకాంక్షలు 🍀

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 255 / Bhagavad-Gita -255 - 6-22 ధ్యాన యోగము🌹

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 654 / Vishnu Sahasranama Contemplation - 654 🌹

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 333 / DAILY WISDOM - 333 🌹

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 233 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹






*🌹30, AUGUST ఆగస్టు 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*

*🍀. వరాహ జయంతి, Varaha Jayanti శుభాకాంక్షలు 🍀*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వరాహ జయంతి, Varaha Jayanti, Hartalika Teej, Gowri Habba 🌻*


*🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 2 🍀*


*2. భ్రాతుర్భయా- దవసదద్రివరే కపీశః*

*శాపాన్మునే రధువరం ప్రతివీక్షమాణః.*

*ఆనీయ తం త్వమకరోః ప్రభుమార్త్తిహీనం*

*ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం.*


🌻🌻🌻🌻🌻


*🍀. నేటి సూక్తి : బంధరహిత కర్మప్రవృత్తి - సామాన్య మానవ జీవితం గడుపుతూనే బంధ ముకుడై వుండడం కష్టమైన పని. కష్టమైనది కనుకనే దాని కొరకు ప్రయత్నం చేసి సాధించడం అవసరం.🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,

వర్ష ఋతువు, భాద్రపద మాసం

తిథి: శుక్ల తదియ 15:34:46

వరకు తదుపరి శుక్ల చవితి

నక్షత్రం: హస్త 23:50:17

వరకు తదుపరి చిత్ర

యోగం: శుభ 24:04:52

వరకు తదుపరి శుక్ల

కరణం: గార 15:30:46 వరకు

వర్జ్యం: 07:44:45 - 09:23:45

దుర్ముహూర్తం: 08:31:44 - 09:21:43

రాహు కాలం: 15:24:03 - 16:57:45

గుళిక కాలం: 12:16:38 - 13:50:20

యమ గండం: 09:09:13 - 10:42:56

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40

అమృత కాలం: 17:38:45 - 19:17:45

సూర్యోదయం: 06:01:49

సూర్యాస్తమయం: 18:31:28

చంద్రోదయం: 08:22:51

చంద్రాస్తమయం: 20:37:32

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: కన్య

సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం

23:50:17 వరకు తదుపరి ధ్వాo క్ష

యోగం - ధన నాశనం, కార్య హాని


🌻🌻🌻🌻🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీమద్భగవద్గీత - 255 / Bhagavad-Gita - 255 🌹*

*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 22 🌴*


*22. యం లభ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత: |*

*యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ||*


🌷. తాత్పర్యం :

*ఆ విధముగా సమాధి స్థితుడైన అతడు సత్యము నుండి వైదొలగక, దానిని మించిన వేరొక అధిక లాభము లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టము నందైనను చలింపక యుండును.*


🌷. భాష్యము :

అసంప్రజ్ఞాత సమాధి యందు మనుజుడు ఇంద్రియముల ద్వారా లభించెడి సర్వానందములకు దూరుడై యున్నందున ఎట్టి విధమైన లౌకికానందముతోను సంబంధమును కలిగియుండడు. అట్టి దివ్యస్థితి యందు నిలిచిన యోగి దాని నుండి ఏమాత్రమును వైదొలగడు. అటువంటి దివ్యస్థితి పొందలేనిచో యోగి పరాజయమును పొందినవాడే యగును. నేటికాలపు నామమాత్ర యోగపధ్ధతి సర్వవిధములైన ఇంద్రియప్రియ కార్యములను కూడి యుండి నిజమైన పధ్ధతికి విరుద్ధమై యున్నది. మైథునమునందు పాల్గొని, మత్తుపదార్థములను స్వీకరించు యోగి కపటియే కాగలడు.


యోగవిధానమునందు సిద్ధుల యెడ ఆకర్షణము కలిగిన యోగులు సైతము యోగము నందు పూర్ణత్వమును పొందినవారు కారు. అనగా యోగము యొక్క ఇతర లాభముల యెడ ఆకర్షితులైనచో ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు యోగులు పూర్ణత్వస్థితిని ఎన్నడును పొందజాలరు. కనుక యోగమును వ్యాయామ ప్రదర్శనముగా చేయువారు లేదా సిద్ధుల నిమిత్తమై వినియోగించువారు తమ యోగలక్ష్యము తత్కార్యమున నశించునని తెలిసికొనవలెను.

🌹🌹🌹🌹🌹


*🌹 Bhagavad-Gita as It is - 255 🌹*

*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*

*📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 6 - Dhyana Yoga - 22 🌴*


*22. yaṁ labdhvā cāparaṁ lābhaṁ manyate nādhikaṁ tataḥ*

*yasmin sthito na duḥkhena guruṇāpi vicālyate*


🌷 Translation :

*Having gained that state, one does not consider any attainment to be greater. Being thus established, one is not shaken even in the midst of the greatest calamity.*


🌹 Purport :

In the yoga system, as described in this chapter, there are two kinds of samādhi, called samprajñāta-samādhi and asamprajñāta-samādhi. When one becomes situated in the transcendental position by various philosophical researches, he is said to have achieved samprajñāta-samādhi. In the asamprajñāta-samādhi there is no longer any connection with mundane pleasure, for one is then transcendental to all sorts of happiness derived from the senses. When the yogī is once situated in that transcendental position, he is never shaken from it.


Unless the yogī is able to reach this position, he is unsuccessful. Today’s so-called yoga practice, which involves various sense pleasures, is contradictory. A yogī indulging in sex and intoxication is a mockery. Even those yogīs who are attracted by the siddhis (perfections) in the process of yoga are not perfectly situated. If yogīs are attracted by the by-products of yoga, then they cannot attain the stage of perfection, as is stated in this verse. Persons, therefore, indulging in the make-show practice of gymnastic feats or siddhis should know that the aim of yoga is lost in that way.

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 654 / Vishnu Sahasranama Contemplation - 654🌹*


*🌻654. కాన్తః, कान्तः, Kāntaḥ🌻*


*ఓం కాన్తాయ నమః | ॐ कान्ताय नमः | OM Kāntāya namaḥ*


*అభిరూపతమం దేహం వహన్ కాన్త ఇతీర్యతే ।*

*ద్విపరార్థాన్తకాలే దుఃఖాన్తఃకాన్తో హరిః స్మృతః ।*

*విష్ణుర్లోకాన్తకారీతి వా కాన్త ఇతి కథ్యతే ॥*


*మిగుల సుందరమగు దేహము కలిగియుండిన సుందరరూపుడు కాంతుడు. లేదా రెండు పరార్థముల కస్య అంతం కరోతి అను విభాగమున బ్రహ్మకు అంతము కలిగించువాడని కూడ అర్థము చెప్పవచ్చును. బ్రహ్మదేవుని కాలపరిమాణము ననుసరించి బ్రహ్మదేవుని కూడా అంతమందిచువాడుగనుక కాంతః.*


సశేషం...

🌹🌹🌹🌹🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 654🌹*


*🌻654. Kāntaḥ🌻*


*OM Kāntāya namaḥ*


अभिरूपतमं देहं वहन् कान्त इतीर्यते ।

द्विपरार्थान्तकाले दुःखान्तःकान्तो हरिः स्मृतः ।

विष्णुर्लोकान्तकारीति वा कान्त इति कथ्यते ॥


*Abhirūpatamaṃ dehaṃ vahan kānta itīryate,*

*Dviparārthāntakāle duḥkhāntaḥkānto hariḥ smr‌taḥ,*

*Viṣṇurlokāntakārīti vā kānta iti kathyate.*


*Since He bears a very handsome body, He is called Kāntaḥ. Also, the divine name can be interpreted as combination of ka and antaḥ; ka meaning Lord Brahma and antaḥ meaning the end. Hence at the close of the second parārdha, the end of Brahma too arises from Him and hence He is Kāntaḥ.*


🌻🌻🌻🌻🌻

Source Sloka

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹






*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 333 / DAILY WISDOM - 333 🌹*

*🍀📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*

*✍️ .స్వామి కృష్ణానంద 📝. ప్రసాద్ భరద్వాజ*


*🌻 28. అహం లేని స్థితి అందంగా కనిపిస్తుంది 🌻*


*ఆకస్మికంగా వచ్చే ఏ ఇతరమైన ఆలోచన అందంగా ఉండదు. ఇది విచ్ఛిన్నమైన మరియు విరిగిన ఆలోచన అవుతుంది. దేవుడి ఆలోచన మాత్రమే అందమైనది; ఏ ఇతర ఆలోచనను అందమైనదిగా పిలవలేము. ఏదైనా అందంగా ఉండాలంటే పరిపూర్ణమైన నిర్మాణం అవసరం. పూర్ణం కానిది ఏదీ అందంగా ఉండదు. కాబట్టి, ఈ ప్రపంచంలో ఎవరు సంపూర్ణులు? చెప్పండి. ఎవరూ లేరు. అందువల్ల, ఎవరూ అందంగా ఉండలేరు. కొన్నిసార్లు దైవం ఒక వస్తువులో ప్రతిబింబించడం వలన ఆ వస్తువు కూడా అందంగా కనిపిస్తుంది. మీకు అర్ధమైనదా? భగవంతుడు మాత్రమే అంతిమంగా అందంగా ఉన్నప్పటికీ, దేవుడు ప్రతిబింబించేది కూడా అందంగా కనిపిస్తుంది.*


*పిల్లవాడు అందంగా ఉంటాడు మరియు సాధువు అందంగా ఉంటాడు, ఎందుకంటే బిడ్డ మరియు సాధువు ఇద్దరికీ అహం లేదు. అహం లేని ఆ స్థితి అందంగా కనిపిస్తుంది. ఎక్కడైతే అహం ఉందో అది వికృతంగా కనిపిస్తుంది. అహంకారం లేని స్థితి భగవంతుని స్వభావం. దేవుడు పిల్లలలో మరియు సాధువులో ప్రతిబింబిస్తాడు, కాబట్టి ఇద్దరూ అందంగా కనిపిస్తారు; కానీ వారి మధ్యస్థులు అందంగా లేరు ఎందుకంటే వారు సాధువులు లేదా పిల్లలు కాదు. నీకు అర్ధమైనదా? మీరు పిల్లలైతే, మీరు అందంగా ఉంటారు, ఎందుకంటే పిల్లలలో అమాయకత్వం వల్ల, అహంకారం మరియు స్వొత్కర్ష లేకపోవడం వల్ల, భగవంతుడు ఆ స్థితిలో తనను తాను ప్రతిబింబిస్తాడు. దైవం ఈ ప్రాపంచిక విషయాల్లో సైతం ప్రతిబింబించగలడు కానీ వాటిలో ఈ అహం ఉండకూడదు. అప్పుడే ఆయన ప్రతిబింబిస్తాడు.*


*కొనసాగుతుంది...*

🌹🌹🌹🌹🌹


*🌹 DAILY WISDOM - 333 🌹*

*🍀📖 from Your Questions Answered 🍀*

*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*


*🌻 28. Wherever There is No Ego, It Looks Beautiful 🌻*


*So, the other thought, which is spontaneous, naturally will not be beautiful. It will be a fragmentary and broken thought. Only God-thought is beautiful; no other thought can be called finally beautiful. A complete structure is necessary for anything to be beautiful. Nothing that is not complete can be beautiful. So, who is complete in this world? Tell me. Nobody. And, therefore, nobody is beautiful. Sometimes the most beautiful thing, which is God, gets reflected in something; then, that also looks beautiful. Do you understand? Though God alone is ultimately beautiful, that in which God is reflected also looks beautiful.*


*A child is beautiful, and a saint is beautiful, because both child and saint have no ego. Wherever there is no ego, that state looks beautiful. Wherever there is ego, it looks ugly. Egolessness is the nature of God. God gets reflected in a child and also in a saint, so both look beautiful; but the middle people are not beautiful because they are neither saints nor children. Do you understand? If you are a child, then you are beautiful, because in a child there is innocence, absence of egoism and self-affirmation, so God reflects Himself in that condition. God can be reflected in the things of the world also, provided these things are ‘minus ego', and are innocent. Then, God will be reflected there.*


*Continues...*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 233 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. దేవుడికి సంబంధించిన విషయంలో తొందరపాటు పనికిరాదు. కారణం దేవుడు శాశ్వతత్వంలో వుంటాడు. అన్వేషకుడికి సహనమన్నది ప్రాథమిక లక్షణం. అసహనమన్నది అన్వేషణకు అడ్డు కట్ట. 🍀*


*అన్వేషకుడికి సహనమన్నది ప్రాథమిక లక్షణం. అసహనమన్నది అన్వేషణకు అడ్డు కట్ట. దేవుడికి సంబంధించిన విషయంలో తొందరపాటు పనికిరాదు. కారణం దేవుడు శాశ్వతత్వంలో వుంటాడు. తొందరపాటంటే నువ్వు గంటల్నీ క్షణాల్ని లెక్కపెట్టడం. అట్లా చెయ్యకూడదు. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలన్నా, సత్యాన్ని గ్రహించాలన్నా నువ్వు శాశ్వతత్వానికి మార్గాన్ని తెలుసుకోవాలి. అందుకని సహనం అవసరం. కాలానికి సంబంధించిన విషయాన్ని మరచిపో. తొందరవద్దు. అసహనం వద్దు. ఎదురుచూడు.*


*అంచనాలు లేకుండా, ఏదీ ఆశించకుండా ఎదురు చూడు. గొప్ప ఆనందంతో అతిథి కోసం ఎదురు చూస్తున్నట్లు చూడు. ఏ క్షణమయినా రావచ్చన్న ఆతృతలో ఎదురు చూడు. అంతే కానీ అతనింకా రాలేదని చిరాకు పడకు. ప్రతిదీ అతని రాక కోసం సిద్ధంగా వున్నట్లు అమర్చు. అతను రాలేదంటే నువ్వింకా సిద్ధంగా లేవని అర్థం. నీ కాబట్టి దాన్ని గురించి చిరాకు వద్దు. చుట్టు చూడు, సిద్ధం చేయి, సిద్ధం చేయి, సిద్ధం చేయి. నువ్వు అమర్చడం పరిపూర్ణమయ్యాకా, నీ నిశ్శబ్ధం సమగ్రమయ్యాకా, నీ శూన్యత సంపూర్ణమయ్యాకా అతను వస్తాడు, వెంటనే అతను వస్తాడు.*


*సశేషం ...*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు#DailyMessages

Join and Share

www.facebook.com/groups/chaitanyavijnanam/

Comments


Post: Blog2 Post
bottom of page