top of page
Writer's picturePrasad Bharadwaj

30 - JUNE - 2022 THURSDAY MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 30, గురువారం, జూన్ 2022 బృహస్పతి వాసరే Thursday 🌹

2) 🌹 కపిల గీత - 31 / Kapila Gita - 31 🌹

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 71 / Agni Maha Purana - 71🌹

4) 🌹. శివ మహా పురాణము - 587 / Siva Maha Purana - 587🌹

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 206 / Osho Daily Meditations - 206🌹

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-2 🌹

*🌹. Escaping the chain of Bondage 🌹*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹30, June 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*

*🌻. బోనాలు శుభాకాంక్షలు మిత్రులందరికి 🌻*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, గుప్త నవరాత్రులు, బోనాలు ప్రారంభం, Chandra Darshan, Gupta Navratri, Bonalu Begins🌻*


*🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 11 🍀*


*వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం*

*సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్*

*త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం*

*జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి*


*తాత్పర్యము: సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : సేవ వల్లనే సాధన ఫలిస్తుంది. ఇతరులకు సేవ చేస్తూ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. సాధన, స్వాధ్యాయము, సంయమం, సేవ- ఈ నాల్గింటి ద్వారా మీ లోపాలను సరిచేసుకోండి. - సద్గురు శ్రీరామశర్మ 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, ఆషాఢ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: శుక్ల పాడ్యమి 10:50:11 వరకు

తదుపరి శుక్ల విదియ

నక్షత్రం: పునర్వసు 25:08:32 వరకు

తదుపరి పుష్యమి

యోగం: ధృవ 09:50:59 వరకు

తదుపరి వ్యాఘత

కరణం: బవ 10:49:10 వరకు

వర్జ్యం: 11:38:30 - 13:26:26

దుర్ముహూర్తం: 10:08:07 - 11:00:45

మరియు 15:23:53 - 16:16:30

రాహు కాలం: 13:58:22 - 15:37:02

గుళిక కాలం: 09:02:20 - 10:41:00

యమ గండం: 05:44:59 - 07:23:39

అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:45

అమృత కాలం: 22:26:06 - 24:14:02

సూర్యోదయం: 05:44:59

సూర్యాస్తమయం: 18:54:23

చంద్రోదయం: 06:30:06

చంద్రాస్తమయం: 20:07:12

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: జెమిని

సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

25:08:32 వరకు తదుపరి శుభ

యోగం - కార్య జయం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹

#పంచాగముPanchangam

Join and Share


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. కపిల గీత - 31 / Kapila Gita - 31🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴. 14. భక్తియే అంతిమ విముక్తి - 1 🌴*


*31. మైత్రేయ ఉవాచ*

*విదిత్వార్థం కపిలో మాతురిత్థం జాతస్నేహో యత్ర తన్వాభిజాతః*

*తత్త్వామ్నాయం యత్ప్రవదన్తి సాఙ్ఖ్యం ప్రోవాచ వై భక్తివితానయోగమ్*


*కపిల మహర్షి, తల్లి మనసులో ఉన్న దాన్ని తెలుసుకున్నాడు. ఏ శరీరము నుండి పుట్టాడో, ఆ శరీరం ఉన్న ఆమె యందు ప్రేమ పుట్టింది. ఇప్పటిదాకా భక్తిని చెప్పాడు. ఏ యోగముతో భక్తి వ్యాప్తి (వితానం) చెబుతుందో ఆ యోగమైన సాంఖ్య యోగాన్ని చెప్పాడు. పేరుకు సాంఖ్య (జ్ఞ్యాన) యోగమైనా, పరమాత్మ చివరకు భక్తిలోకే తీసుకు వస్తాడు. దీన్ని పెద్దలు సాంఖ్యం అంటారు. ఇది భక్తిని విస్తరించే యోగం.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 31 🌹*

*✍️ Swami Prabhupada.*

*📚 Prasad Bharadwaj*


*🌴 14. Bhakti as Ultimate Liberation - 1 🌴*


*31. maitreya uvaca*

*viditvartham kapilo matur ittham jata-sneho yatra tanvabhijatah*

*tattvamnayam yat pravadanti sankhyam provaca vai bhakti-vitana-yogam*


*Sri Maitreya said: After hearing His mother's statement, Kapila could understand her purpose, and He became compassionate toward her because of having been born from her body. He then described the Sankhya system of philosophy, which is a combination of devotional service and mystic realization, as received by disciplic succession.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹

#కపిలగీత #KapilaGita

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 71 / Agni Maha Purana - 71 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 25*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*


*🌻. "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' మంత్రముల లక్షణములు - 3 🌻*


కనిష్ఠక మొదలైన కరాగ్రములందు దేహముపై ప్రకృతిని అర్చించవలెను. పరమ పురుషాత్మయే పరుడు. ప్రకృత్మాత్య ద్విరూపము. ''ఓం పరాయాగ్న్యత్మనే నమః" ఇది వ్యాపక మంత్రము. వసు - అర్క - అగ్నులు త్రివ్యూహాత్మక మార్తులు. ఈ మూడింటిపై అగ్ని న్యాసముచేసి కరదేహములపై వ్యాపకమును విన్యసించి, అంగుళల యుందును, సవ్యాపసవ్య హస్తములయందును, హృదయమునందును, మూర్తియందును, తుర్యరూప మగు త్రివ్యూహమైన తనువునందను వాయ్వర్కులను విన్యసించవలెను.


వ్యాపక మైన ఋగ్వేదమును హస్తమునందును, అంగుళలపై యజుర్వేదము, రెండు అరచేతులలో అథర్వమును శిరోహృదయచరణములయందు సామవేదమును పంచవ్యూహమునందు ఆకాశమును విన్యసించి కరములందును, దేహము నందును అంగుళీ - శిరో - హృదయ - గుహ్య - పాదములందును వాయ్వాదికమును పూర్ముము చెప్పనట్లు న్యసించవలెను.


వాయువు, అగ్ని, జలము, భూమి (ఆకాశము) వీటి సముదాయము పంచవ్యూహము నమస్సు, శ్రోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ, ఘ్రణము వీటి సముదాయము షడ్వ్యూహము.


వ్యాపక మైన మానసమును విన్యసించి పిమ్మట క్రమముగా అంగుష్ఠాదులందును, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యప్రదేశము, పాదములు - వీటి యందును న్యాసము చేయవలెను. ఇది "పరమాత్మకవ్యూహన్యాసము". ఆదిమూర్తి అగు జీవుడు సర్వవ్యాపకుడు.


భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అను ఈ ఏడింటిని ముందుగా కరమునందును, దేహము, నందును అంగుష్ఠాది క్రమమున విన్యసించవలెను.


ఏడవది తలములం దుండును. లోకేశు డైన దేవుడు దేహమునందు క్రమముగా శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు - వీటియందు ఉండును.


అగ్నిష్టోమము, ఉక్థము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము అని యజ్ఞాత్మ సప్తరూపములు కలది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 71 🌹*

*✍️ N. Gangadharan*

*📚. Prasad Bharadwaj *


*Chapter 25*

*🌻 Worship regarding Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna and Aniruddha - 3 🌻*


20-21. Om (salutation) to the supreme being, the foremost or the first soul. The air and the sun (are his) two forms. The fire the third form having been assigned to pervade hands and the body, wind and the sun in the fingers of hand, this is embodied in the three parts in the two arms, left and the other arm, in the heart, in the body forming the fourth state.


22. The Ṛgveda (is made) to pervade hand. The Yajus (Yajurveda) is assigned to fingers. The form of Atharva (is assigned) to two palms. Thus (assignments are made) in (different limbs) head, heart, upto the feet.


23. As before having assigned the extensive sky to his arm and body, wind and other (elements), to fingers, head, heart, generative organ and the feet.


24. The wind, fire, water, earth (and sky or ether) are spoken as his five forms. The mind, ear, skin, eye, tongue (and) nose are said to be the six forms.


25-28. The extensive mind is assigned from the thumb onwards to the head, mouth, generative organ and the organ of excretion. The prime form is said to be consisting of compassion. It is known as the jīva (life) (which is) all pervasive. The seven (words), earth, ether, heaven, mahas, jana, tapa and satya[5] are assigned duly to hands and the body beginning with thumb. The Lord of the world, the seventh one and existing in the palm (is taken) gradually to the body, head, forehead, mouth, heart, generative organ and feet. This is said to be the Agniṣṭoma.[6] (Next follows the description of) the Vājapeya[7] (and) the Ṣoḍaśī[8] rites.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

#అగ్నిపురాణం #AgniMahaPuranam


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹 . శ్రీ శివ మహా పురాణము - 587 / Sri Siva Maha Purana - 587 🌹*

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴*


*🌻. కుమారస్వామి జననము - 7 🌻*


ఓ కుమారా! ఆ ఆర్గురు ఋషిపత్నులు తమకు పాతిపత్య లోపము కలిగినదని గమనించి మహా దుఃఖమును పొందిరి. వారి మనస్సులు అల్లకల్లోమయ్యెను (63). ఆ మునిపత్నులు గర్భరూపమున నున్న శివతేజస్సును హిమవత్పర్వతముపై విడిచి పెట్టి తాపశాంతిని పొందిరి (64). హిమవంతుడా శివతేజస్సును సహింప జాలక వణకి పోయెను. ఆయన తాపముచే పీడింపబడిన వాడై సహింప శక్యముకాని ఆ శివతేజస్సును వెంటనే గంగలో పడవైచెను (65). ఓ మహర్షీ! గంగ కూడ సహింప శక్యము కాని ఆ పరమాత్మ తేజస్సును తన తరంగములతో రెల్లుగడ్డి యందు భద్రము చేసెను(66).


అచట నిక్షిప్తమైన ఆ శివతేజస్సు వెంటనే సుందరుడు, సౌభాగ్యవంతుడు,శోభాయుక్తుడు, తేజశ్శాలి, ప్రీతిని వర్ధిల్ల జేయువాడు అగు బాలకునిగా మారిపోయెను(67). ఓ మహార్షీ! మార్గశీర్ష శుక్లపక్షములో షష్ఠినాడు ఆ శివపుత్రుడు భూమండలముపై అవతరించెను (68). అదే సమయములో కైలాసము నందు శివపార్వతులు అకస్మాత్తుగా సుఖభావనను పొందిరి (69). పార్వతి స్తవముల నుండి ఆనందముచే స్తన్యము స్రవించెను. ఓ మహర్షీ! అచటకు వెళ్లిన వారందరికీ ఆనందము కలిగెను(70).


కుమారా!ముల్లోకములు సత్పురుషులకు సుఖములనిచ్చి మంగళ మయములాయెను.దుష్టులకు, విశేషించి రాక్షసులకు విఘ్నము కలిగెను (71).అకస్మాత్తుగా ఆకాశమునందుగొప్ప దుందుభిధ్వని బయల్వెడలెను. ఓ నారదా! ఆ పిల్లవానిపై వెంటనే పుష్పవృష్టి గురిసెను (72). ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలందరకీ అకస్మాత్తుగా పరమానందము, పరమోత్సాహము కలిగెను (73).


శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమార ఖండలో శివపుత్ర జననమనే రెండవ అధ్యాయము ముగిసినది(2).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 587 🌹*

*✍️ J.L. SHASTRI*

*📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴*


*🌻 The birth of Śiva’s son - 7 🌻*


63. O dear, on seeing their own state the six ladies felt very miserable and distressed.


64. The wives of the sages cast off their semen in the form of a foetus at the top of Himavat. They felt then relieved of their burning sensation.


65. Unable to bear that semen of Śiva and trembling much, Himavat became scorched by it and hurled it in the Gaṅgā.


66. O great sage, the intolerable semen of lord Śiva was deposited by Gaṅgā in the forest of Śara grass by means of its waves.


67. The semen that fell was turned in a handsome good-featured boy, full of glory and splendour. He increased everyone’s pleasure.


68. O great sage, on the sixth day of the bright half of the lunar month of Mārgaśīrṣa, the son of Śiva was born in the world.


69. At that time, O Brahmin, on their mountain, Pārvatī the daughter of Himavat and Śiva became very happy.


70. Out of joy, milk exuded from the breasts of Pārvatī. On reaching the spot everyone felt very happy.


71. O dear, there was auspiciousness in the three worlds, pleasing to the good. There occurred obstacles to the wicked and particularly to the demons.


72. O Nārada, there was a mysterious sound of Dundubhi drum in the sky. Showers of flowers fell on the boy.


73. O excellent sage, there was great delight to Viṣṇu and the gods. There was great jubilation everywhere.


Continues....

🌹🌹🌹🌹🌹

#శివమహాపురాణము

#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 206 / Osho Daily Meditations - 206 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ్*


*🍀 206. ఐక్యత 🍀*


*🕉. ఉనికితో సాధ్యమైనంత ఎక్కువ పరిచయాలను ఏర్పరచుకోవడం ప్రారంభించండి. ఒక చెట్టు దగ్గర కూర్చొని, చెట్టును కౌగిలించుకుని, మీరు దానితో కలుస్తున్నట్లు మరియు కలిసిపోతున్నట్లు అనుభూతి చెందండి. జలములో, మీ కళ్ళు మూసుకుని మరియు మీరు నీటిలో కరిగిపోతున్నట్లు భావించండి; ఒక ఐక్యతా భావనను ఉండనివ్వండి. 🕉*

*మీరు విశ్రాంతి తీసుకోవడానికి మరియు దేనితోనైనా ఏకం కావడానికి వీలున్న చోట ఐక్యతా మార్గాలను కనుగొనండి. పిల్లి, కుక్క, పురుషుడు, స్త్రీ, చెట్టు వంటి ఏ రూపంలోనైనా మీరు మీ శక్తిని ఇతర శక్తితో ఎంతగా ఏకం చేస్తే, అంతగా మీరు ఉనికికి దగ్గరగా ఉంటారు. ఇది ఆహ్లాదకరమైన పని; నిజానికి, ఇది పారవశ్యం కలిగించే పని. ఒక్కసారి అనుభూతి చెందితే, ఒక్కసారి దాని నేర్పు తెలుసుకుంటే, మీ జీవితంలో మీరు ఎంత కోల్పోయారో అని ఆశ్చర్యపోతారు. మీరు దాటిన ప్రతి చెట్టు మీకు గొప్ప ఉద్వేగాన్ని అందించగలదు, మరియు ప్రతి అనుభవం-ఒక సూర్యాస్తమయం, సూర్యోదయం, చంద్రుడు, ఆకాశంలోని మేఘాలు, భూమిపై గడ్డి - పారవశ్య అనుభవాలు కావచ్చు.*


*పచ్చికలో పడుకుని, మీరు భూమితో ఒక్కటి అవుతున్నారని అనుభూతి చెందండి. భూమిలోకి కరిగి పోయి దానిలో అదృశ్యం అయిపోండి. భూమిని మీలోకి చొచ్చుకు పోనివ్వండి. ఇదే ధ్యానం: వీలైనన్ని విధాలుగా ఐక్యతను పొందండి. దేవునికి పదివేల తలుపులు ఉన్నాయి, మరియు అతను ప్రతిచోటా అందుబాటులో ఉన్నాడు. కానీ అతను ఐక్య భావన స్థితిలో మాత్రమే అందుబాటులో ఉంటాడు. అందుకే కొన్నిసార్లు ప్రేమికులు లోతైన ప్రేమ భావనలో ఉన్నప్పుడు ధ్యానం గురించి తెలుసుకుంటారు. ఇది ఐక్యతను, ఏకత్వమును సృష్టించే మార్గాలలో ఒకటి, కానీ అది మార్గాలలో ఒకటి మాత్రమే; కోట్ల కొద్ది మార్గములు ఉన్నాయి. వెతుకుతూ వెళితే దానికి అంతు లేదు.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations - 206 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 206. UNION 🍀*


*🕉. Start making as many contacts with existence as possible. Sitting by a tree, hug the tree and feel that you are meeting and merging with it. Swimming, close your eyes and feel you are melting into the water; let there be a union. 🕉*

*Find ways and means wherever you can to relax and unite with something. The more you unite your energy with some other energy, in any form-a cat, a dog, a man, a woman, a tree-the closer home you will be. It is pleasant work; in fact, it is ecstatic work. Once you have come to feel it, once you have come to know the knack of it, you will be surprised at how much you have missed in your life. Each tree that you have passed could have given you a great orgasm, and each experience-a sunset, a sunrise, the moon, the clouds in the sky, the grass on the earth--could have been ecstatic experiences.*


*Lying down on the lawn, feel you are becoming one with the earth. Melt into the earth, disappear into it; let the earth penetrate you. This is a meditation: Attain union in as many ways as possible. God has ten thousand doors, and from everywhere he is available. But he is available only in the state of union. That's why sometimes it happens that lovers come to know of meditation in deep orgasm. That is one of the ways of creating union, but that is only one of the ways; there are millions. If one goes on searching, there is no end to it.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹

#ఓషోరోజువారీధ్యానములు

#ఓషోబోధనలు #OshoDiscourse

#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*మూల మంత్రము :*

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*

*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*


*🌻 382. 'రహస్తర్పణ తర్పితా' - 2🌻*


*శ్రీమాత పరతత్వమున కర్పితయై పరమానంద భరితయై యుండును. జీవులు శ్రీమాత అనుగ్రహమును పొందుటకు గాని, దైవ సాన్నిధ్యము చేరుటకు గాని, దైవానుగ్రహము పొందుటకు గాని, దైవమే తాముగ వైభవోపేతమైన జీవితమును జీవించుటకు గాని, సర్వోత్తమమైన మార్గము సమర్పణ మార్గము. ఈ మార్గ మత్యంత సాహసముతో కూడినది. దైవము నందు పరిపూర్ణ భక్తి విశ్వాసములు గలవారు మాత్రమే నిర్వర్తింపగలరు.*


*అట్టి విశ్వాసము కూర్చువాడు కూడ దైవమే. కలియుగమున అనేకులు ఇట్టి సమర్పణ మార్గము ననుసరించి అనుగ్రహము పొంది, భూమిపై దైవమే తానుగ శాశ్వతముగ నిలచి జీవుల నుద్ధరించు చున్నారు. ఇట్టి మహాత్ములు ఎందరో హిమాలయములను కేంద్రముగ నేర్పరచుకొని జీవుల వృద్ధిని గూర్చి, సంవృద్ధిని గూర్చి కృషి సల్పుచున్నారు. మైత్రేయుడు, ఉద్ధవుడు, విదురుడు, సూర్య వంశపు క్షత్రియుడగు మరువు, చంద్ర వంశపు క్షత్రియుడగు దేవాపి మొదలుగ ఎందరో మహాత్ములు ఈ సమర్పణ మార్గమున దైవప్రతినిధులై భూమిపై దివ్యదేహములు దాల్చి చరించు చున్నారు.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 382 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Acharya Ravi Sarma *

*📚. Prasad Bharadwaj*


*🌻 83. Odyana pita nilaya nindu mandala vasini*

*Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻*


*🌻 382. Rahastarpaṇa-tarpitā रहस्तर्पण-तर्पिता -2 🌻*


*Second is the mantra itself that infuses life to the visualized form. This situation is applicable only in the initial stages and as one progresses, further guidance is received from the concerned deity itself by way of communion. This nāma says that such mantra-s should be recited only mentally.*


*There is another interpretation for this nāma. This nāma could also be interpreted as ‘secretive oblations’ offered into the internal fire (fire generated and persists at the mūlādhāra cakra to keep the body alive).*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹

#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹 Escaping the chain of Bondage 🌹*

*Prasad Bharadwaj*


*There are seven links in the chain of bondage. Misery is the final link in the chain of cause and effect. Every link depends for its existence upon the previous link.*


*The seven links are:*

*(l) Misery, (2) Embodiment, (3) Karma, (4) Raga, (5) Dvesha, (6) Aviveka and (7) Ajnana.*


*If the root cause Ajnana (ignorance of the Selfl is removed by Atma-jnana or knowledge of the Self, the other links will be broken by themselves. From ignorance, non-discrimination is born; from non-discrimination, Abhimana; from Abhimana, Raga-Dvesha; from Raga-Dvesha, Karma; from Karma, this physical body; from the physical body, misery. If you want to annihilate misery, you must get rid of embodiment. [f you want to get rid of embodiment, you must not perform actions.*


*If you wish to cease to act, you must abandon Raga-Dvesha. If you want to free yourself from Abhimana, you must destroy Aviveka and develop Viveka or discrimination between the Self and non-self. If you want to get rid of Aviveka, you must annihilate Ajnana. If you want to get rid of Ajnana, you must get knowledge of the Self. There is no other way of escaping this chain.*

🌹 🌹 🌹 🌹 🌹

Comentarios


Post: Blog2 Post
bottom of page