top of page
Writer's picturePrasad Bharadwaj

🍀 30 - NOVEMBER - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀

🌹🍀 30 - NOVEMBER - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹

1) 🌹 30 - NOVEMBER - 2022 WEDNESDAY, బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹 కపిల గీత - 97 / Kapila Gita - 97 🌹 సృష్టి తత్వము - 53

3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 689 / Vishnu Sahasranama Contemplation - 689 🌹

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 136 / Agni Maha Purana - 136 🌹 🌻. ఆలయ ప్రాసాద నిర్మాణము - 2 🌻

5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 271 / Osho Daily Meditations - 271 🌹 అజ్ఞానం - IGNORANCE

6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 416-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 416-2 🌹 ‘చిచ్ఛక్తి’ - 2 - 'Chichhakti' - 2


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹30, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*

*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*

*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*

*ప్రసాద్ భరద్వాజ*


*🌺. పండుగలు మరియు పర్వదినాలు : మాస దుర్గాష్టమి, Masik Durgashtami 🌺*


*🍀. శ్రీ నారాయణ కవచం - 24 🍀*


*37. న కుతశ్చిద్భయం తస్య విద్యాం ధారయతో భవేత్ |*

*రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాధ్యాదిభ్యశ్చ కర్హిచిత్*

*38. ఇమాం విద్యాం పురా కశ్చిత్కౌశికో ధారయన్ ద్విజః |*

*యోగధారణయా స్వాంగం జహౌ స మరుధన్వని*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఏ గుహలోనో, లేక ఏ పర్వత శిఖరం మీదనో ఏకాంతవాసం చేసే సన్యాసి ఏపనీ చేయనిచ్చగించని వట్టి శిలాప్రాయుడని నీ అభిప్రాయం. కాని, నీకేమి తెలుసును ? మహత్తరమైన తన సంకల్పశక్తి ప్రవాహములచే నతడు ప్రపంచమునెల్ల నింపివేస్తూ కేవలం తన ఆత్మసంస్థితి ప్రాబల్యం చేతనే ప్రపంచంలో పరివర్తనం సాధిస్తూ వుండవచ్చుగదా .🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మార్గశిర మాసం

తిథి: శుక్ల-సప్తమి 08:59:26 వరకు

తదుపరి శుక్ల-అష్టమి

నక్షత్రం: ధనిష్ట 07:12:35 వరకు

తదుపరి శతభిషం

యోగం: వ్యాఘత 12:01:40 వరకు

తదుపరి హర్షణ

కరణం: వణిజ 09:00:27 వరకు

వర్జ్యం: 14:06:18 - 15:38:22

దుర్ముహూర్తం: 11:42:10 - 12:26:53

రాహు కాలం: 12:04:32 - 13:28:23

గుళిక కాలం: 10:40:41 - 12:04:32

యమ గండం: 07:53:00 - 09:16:51

అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26

అమృత కాలం: 23:18:42 - 24:50:46

సూర్యోదయం: 06:29:10

సూర్యాస్తమయం: 17:39:55

చంద్రోదయం: 12:29:30

చంద్రాస్తమయం: 00:18:12

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: కుంభం

యోగాలు : మిత్ర యోగం - మిత్ర లాభం

07:12:35 వరకు తదుపరి మానస యోగం

- కార్య లాభం


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కపిల గీత - 97 / Kapila Gita - 97🌹*

*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*

*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 53 🌴*


*53. హిరణ్మయాదండ కోశాదుత్థాయ సలిలేశయాత్|*

*తమావిశ్య మహాదేవో బహుధా నిర్బిభేద ఖమ్॥*


*కారణమయమైన ఈ జలము నందు ఉన్నట్టి ఆ తేజోమయ అందము నుండి విరాట్ పురుషుడు బహిర్గతుడై, మరల అందు ప్రవేశించెను. ఆ విరాట్ పురుషుడు అందు పెక్కు ఛిద్రములను ఏర్పరచెను.*


*బయటకు వచ్చి అందులో ఉన్న వాటిని భేధించాడు. అంటే సమష్టి సృష్టి నుంచి వ్యష్టి సృష్టి ఏర్పడుతుంది. అందులో ఉన్న ఒక్కొక్క ఇంద్రియాన్ని భేధించి తీసి సకల ప్రాణి కోటికీ అమరుస్తాడు పరమాత్మ. పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మలో ఆవేశించాడు.*


*సశేషం..*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Kapila Gita - 97 🌹*

*🍀 Conversation of Kapila and Devahuti 🍀*

*📚 Prasad Bharadwaj*


*🌴 2. Fundamental Principles of Material Nature - 53 🌴*


*53. hiraṇmayād aṇḍa-kośād utthāya salile śayāt*

*tam āviśya mahā-devo bahudhā nirbibheda kham*


*The Supreme Personality of Godhead, the virāṭ-puruṣa, situated Himself in that golden egg, which was lying on the water, and He divided it into many departments.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 689 / Vishnu Sahasranama Contemplation - 689🌹*


*🌻689. అనామయః, अनामयः, Anāmayaḥ🌻*


*ఓం అనామయాయ నమః | ॐ अनामयाय नमः | OM Anāmayāya namaḥ*


*కర్మజైర్వ్యాధిభిర్ బాహ్యైరాన్తర్నైవపీడ్యతే ।*

*ఇతి విద్వద్భిరీశానః సోనామయ ఇతీర్యతే ॥*


*ఏ వ్యాధులును లేనివాడు అనామయుడు. కోరికల వలన కలుగు ఆంతరములు కాని, బాహ్యములు కాని అగు ఏ వ్యాధుల చేతను పీడింపబడనివాడు కాదు కనుక శ్రీ విష్ణు దేవుడు అనామయః.*


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 689🌹*


*🌻689. Anāmayaḥ🌻*


*OM Anāmayāya namaḥ*


कर्मजैर्व्याधिभिर् बाह्यैरान्तर्नैवपीड्यते ।

इति विद्वद्भिरीशानः सोनामय इतीर्यते ॥


*Karmajairvyādhibhir bāhyairāntarnaivapīḍyate,*

*Iti vidvadbhirīśānaḥ sonāmaya itīryate.*


*Āmaya means disease of the body or mind. Anāmaya means the One without any disease. Since Lord Viṣṇu is with no affliction of mind caused by desires or that of body, He is called Anāmayaḥ*


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 136 / Agni Maha Purana - 136 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 42*


*🌻. ఆలయ ప్రాసాద నిర్మాణము - 2🌻*


ప్రతిమ ఎంత పెద్దది ఉండునో, అంత పెద్ద అందమైన పిండి నిర్మింప వలెను. పిండిలో సగము ప్రమాణము గల గర్భమును నిర్మించి, గర్భమానాను సారముగ గోడలు పెట్టవలెను. గోడల ఎత్తు వాటి వెడల్పును అనుసరించి ఉండవలెను. విద్వాంసుడు శిఖరము ఎత్తు గోడ ఎత్తుకు రెట్టింపు ఉంచవలెను. శిఖరము ఎత్తులో నాల్గవవంతు ఎత్తున ఆలయమునకు పరిక్రమ ఏర్పరుపవలెను. ఆలయము ముందున్న ముఖ మండపము గూడ అదే ఎత్తుతో నిర్మింపవరెను. గర్భము ఎనిమిదవ వంతు ప్రమాణముండు నట్లు రథకములు బైటకు వచ్చు మార్గము నిర్మింపవలెను. లేదా పరిధి మూడభాగమును అనుసరించి రథకములను (చిన్ని రథములను) నిర్మింపలెను. వాటి మూడవ వంతు ప్రమాణమున రథ నిర్గ మద్వార మేర్పరుపవలెను. మూడు రథకములపై సర్వదా మాడు వామములను స్థాపింపవలెను.


శిఖరము కొరకు నాలుగు సూత్ర పాతములు చేయవలెను. శుకనాసపైనుండి సూత్రము అడ్డముగా పడవేయవలెను. శిఖరము సగము భాగమున సింహ ప్రతిమను నిర్మింపవలెను. శుకనాసపై సూత్రము స్థిరముగానుంచి దానిని మధ్యసం ధివరకును తీసికొనివెళ్ళవలెను. రెండవ పార్శ్యమునందు గూడ ఈ విధముగానే సూత్రపాతము చేయవలెను.


శుకనాసపై వేది నిర్మించి, దానిపై అమలసారమను పేరుగల, కంఠముతో కూడిన కలశము నిర్మింపవలెను. అది వికరాలముగ ఉండగూడదు. వేదిమానము ఉన్నంతవరకునే కలశను నిర్మింపవలెను. ఆలయద్వారము వెడల్పు ఎంత ఉండునో దానికి రెట్టింపు ఎత్తు ఉండవలెను. ద్వారము చాల అందముగా శోభాసంపన్నముగా ఉండునట్లు నిర్మింపవలెను. ద్వారముల పై భాగమున సుందరములును, మంగళకరమునులు అగు వస్తువులతోపాటు రెండు ఉదుంబర శాఖలు నిర్మింపవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 136 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 42*

*🌻 Construction of a temple - 2 🌻*


10. The base (of the deity) should be of the same size as the image. The adytum (of the temple) should be half the size of the base and the walls proportionate to the adytum.


11. The height (of the walls) should be equal to the length of the walls. The pinnacle should be made equal to twice the height of the wall.


12. The path around the temple should be a quarter of the extent of the pinnacle. The entrance chamber in the front should be a quarter of the extent of the pinnacle.


13. The projections of the arches should be one-eighth of the extent of the adytum. The arches should be made proportionate to the circumference.


14. The projections of arches should otherwise be made as one-third of it. Always there should be three projections on the left on the three arches.


15-16. Four upward lines should be marked for (the construction of) the pinnacle. A downward line is marked to fall above the key-stone which is located at the middle part of the pinnacle. A lion is built at the middle part of the pinnacle in a line with the key-stone.


17. Two such lines should be marked on the sides. There should be a small platform above that.


18. (The lion) should not be in a dropping posture or fierce-looking. The conical shaped structure is placed above, proportional to the small platform.


19. A beautiful opening should be made twice the length of the platform. Two globes should be placed above that with beautiful (ornamental) branches.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 271 / Osho Daily Meditations - 271 🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀 271. అజ్ఞానం 🍀*


*🕉. ఒకరు అంతరంగాన్ని విస్మరించి అజ్ఞానంగా మిగిలిపోతాడు. అంతరంగాన్ని విస్మరించక పోవడం జ్ఞానానికి నాంది. నాకు ఈ అజ్ఞానం అనే పదం ఇష్టం. దీని అర్థం ఏదో విస్మరించ బడింది, ఏదో దాటవేయ బడింది, మీరు దానిని గమనించలేదు. 🕉*


*ఏదో ఉంది - అది ఎప్పటినుంచో ఉంది - కానీ మీరు దాని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. బహుశా ఇది ఎల్లప్పుడూ ఉన్నందున దానిని సులభంగా విస్మరించవచ్చు. మేము ఎల్లప్పుడూ ఉన్న దానిని ఎల్లప్పుడూ విస్మరిస్తాము; మేము ఎల్లప్పుడూ కొత్త వాటిని గమనిస్తాము, ఎందుకంటే కొత్తది మార్పును తెస్తుంది. మనషి తన చుట్టూ ఏమీ కదలకపోతే కూర్చోవచ్చు - అతను విశ్రాంతి తీసుకోవచ్చు, కలలు కనవచ్చు.*


*ఏదైనా కదలనివ్వండి మరియు అతను వెంటనే అప్రమత్తంగా ఉంటాడు. చచ్చిన ఆకు కదిపినా అరుస్తాడు. అది ఖచ్చితంగా మనస్సు యొక్క స్థితి; ఏదైనా మారినప్పుడు మాత్రమే అది గమనించ బడుతుంది, ఆపై అది మళ్లీ నిద్రపోతుంది. మన అంతర్గత నిధి ఎప్పుడూ మనతోనే ఉంటుంది. దానిని విస్మరించడం చాలా సులభం; మేము దానిని విస్మరించడం నేర్చుకున్నాము. అజ్ఞానం అనే పదానికి అర్థం అదే. మీ అన్వేషణ అంతరంగాన్ని విస్మరించకుండా ఉండటానికి నాందిగా ఉండనివ్వండి. మేల్కొలుపు స్వయంగా వస్తుంది. ప్రేమ మేల్కొన్నప్పుడు, జీవితం పూర్తిగా భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. అది అమృతం యొక్క రుచి, అమరత్వం, మరణం లేనిది.*

*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹



*🌹 Osho Daily Meditations - 271 🌹*

*📚. Prasad Bharadwaj*


*🍀 271. IGNORANCE 🍀*


*🕉. Ignoring the inner, one remains ignorant. Not ignoring the inner is the beginning of wisdom. I like this word ignorance. It means something has been ignored, something has been bypassed, you have not taken note of it. 🕉*


*Something is there-it has always been there--but you have been negligent of it. Maybe because it is always there it can be ignored easily. We always ignore that which is always there; we always take note of the new, because the new brings change. The man can go on sitting if nothing moves around him--he can rest, he can dream. Let anything move and he is immediately alert.*


*Even if a dead leaf moves, he will start shouting. That's exactly the state of the mind; it takes note only when something changes, and then it falls asleep again. And our inner treasure has always been with us. It is very easy to ignore it; we learned to ignore it. That is the meaning of the word ignorance. Let your seeking be the beginning of not ignoring the inner, and the awakening comes by itself. And when love is awakened, life has a totally different taste. lt has the taste of nectar, of immortality, of deathlessness.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 416 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 416 -2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*


*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*

*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*


*🌻 416. ‘చిచ్ఛక్తి’ - 2🌻*


*అవిద్య యందున్న జీవులను విద్యయందు ప్రవేశింపచేయుట, విద్యావంతులను చేయుట, ప్రకాశింప చేయుట, ఆనందమున స్థిర పరచుట- ఇట్టి కార్యము లన్నియూ శ్రీమాత తన చైతన్యముతో నిర్వర్తించును. ఉద్ధారణకు ఈ శక్తియే శ్రీమాత వినియోగించును. విద్యను అవిద్యను పరిపాలించు శ్రీమాత విద్య ద్వారా అమృతత్వమును, అవిద్య ద్వారా నశింపును పాలించును. అవిద్యను విద్య ద్వారా తొలగించగల శక్తి చిత్ శక్తి. అన్ని భూతముల యందు కూడ చిచ్ఛక్తి స్వరూపిణియై శ్రీమాత యున్నది. ఆమె సంకల్పించినపుడే విద్యలు ప్రకాశించును. అవిద్యలు తొలగును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 416 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️. Prasad Bharadwaj*


*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*

*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*


*🌻 416. 'Chichhakti' - 2🌻*


*Bringing the ignorant beings into wisdom, making them educated, enlightening them, establishing them in bliss - all this work is performed by Srimata with her consciousness. Srimata uses this energy for upliftment. Sri Mata who governs wisdom and ignorance rules immortality through wisdom and destruction through ignorance. Chit Shakti is the power that can remove ignorance through wisdom. Srimata exists in all beings as Chitshakthi. Wisdom shines only when she wills. Ignorance will be removed.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Comments


Post: Blog2 Post
bottom of page