🌹🍀 31 - AUGUST - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀 🌹వినాయక చవితి శుభాకాంక్షలు, Happy Ganesh Chathurthi
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 31, బుధవారం, ఆగస్టు 2022 సౌమ్య వాసరే Wednesday 🌹
🍀. వినాయక చవితి శుభాకాంక్షలు, Happy Ganesh Chathurthi 🍀
2) 🌹 కపిల గీత - 63 / Kapila Gita - 63 🌹 సృష్టి తత్వము - 19
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 102 / Agni Maha Purana - 102 🌹
4) 🌹. శివ మహా పురాణము - 618 / Siva Maha Purana -618 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 237 / Osho Daily Meditations - 237 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 402 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 4 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹31 August 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*🍀. వినాయక చవితి శుభాకాంక్షలు, Happy Ganesh Chathurthi మిత్రులందరికి 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చవితి, Ganesh Chaturthi 🌺*
*🍀. గణపతి ప్రార్ధన 🍀*
*శ్రీమద్గణేశం విధిముఖ్య వంద్యం గౌరీసుతం విఘ్నతమోదినేశం!*
*కళ్యాణ సంవర్థిత భక్తలోకం సర్వార్థ సిద్ధ్యర్థమహం భజామి!!*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : దేవర్షియైన నారదుడంతటి వాడు కూడా జనక చక్రవర్తి బాహ్య ప్రవృత్తులను బట్టి ఆయనను భోగపరాయణునిగా భావించాడు. ఆత్మను దర్శించ గలిగితే తప్ప ఒకడు బద్ధుడో ముక్తుడో నీవు గ్రహించ లేవు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల చవితి 15:24:19 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: చిత్ర 24:13:10 వరకు
తదుపరి స్వాతి
యోగం: శుక్ల 22:47:31 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: విష్టి 15:20:19 వరకు
వర్జ్యం: 07:58:20 - 09:35:48
దుర్ముహూర్తం: 11:51:23 - 12:41:17
రాహు కాలం: 12:16:20 - 13:49:55
గుళిక కాలం: 10:42:45 - 12:16:20
యమ గండం: 07:35:34 - 09:09:09
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40
అమృత కాలం: 17:43:08 - 19:20:36
సూర్యోదయం: 06:01:58
సూర్యాస్తమయం: 18:30:42
చంద్రోదయం: 09:14:45
చంద్రాస్తమయం: 21:14:32
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కన్య
కాలదండ యోగం - మృత్యు భయం
24:13:10 వరకు తదుపరి ధూమ్ర యోగం
- కార్య భంగం, సొమ్ము నష్టం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌺. వినాయక చవితి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Ganesh Chathurthi to All. 🌺*
*ప్రసాద్ భరధ్వాజ*
*🍀. వినాయక పూజలోని ఏకవింశతి పత్రిలోని విశేష గుణాలు 🍀*
*వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్షంలో హస్త నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు శుద్ధ చవితి రోజున వస్తుంది.*
*వర్షాకాలానికి, చలి కాలానికి వారధిగా ఈ పండుగ వస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండి పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో సూక్ష్మజీవులు స్వైరవిహారంచేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు అధికం. ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్లనుంచి త్రుంచి వాటిని దేవునికి సమర్పిస్తాం. ఈ సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ, వాటినుంచి వెలువడే సువాసన మనకు మేలు చేస్తాయి.*
*గణపతి పూజావిధాపంలోనే 'పత్రం సమర్పయామి' అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటుచేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. అదే విధంగా వినాయక చవితి ముందు రోజున 'తదియ గౌరి' వ్రతం గౌరిదేవికి చేస్తారు. ఈ పూజలో గౌరిదేవికి 16 రకాలైన పత్రాలు సమర్పిస్తారు. అందులో ముఖ్యమైనది 'అపామార్గ పత్రం' అంటే ఉత్తరరేణి ఆకు. దానికి ప్రాధాన్యం ఎక్కువ.*
*జ్యోతిర్ వైద్యం ఆధారంగా నక్షత్రాలకు, రాశులకు, గ్రహాలకు ఈ పత్రాలతో అవినాభావ సంబంధముంది. జ్యోతిషంలో ఆకుపచ్చరంగు బుధునిది. ఆకులన్నీ బుధ కారకత్వాన్ని కలిగి ఉంటాయి. అలాగే తత్వాలను పరిశీలిస్తే... అగ్నితత్వానికి రవి, కుజ, గురువు; భూతత్వానికి బుధుడు, వాయుతత్వానికి శని, చంద్ర, శుక్రులు; జలతత్వానికి, పిత్త తత్వానికి రవి, కుజ, గురువు; వాత తత్వానికి శని, కఫానికి చంద్ర శుక్రులుగా శాస్త్రం నిర్వచించినది. అయితే బుధునికి వాత, పిత్త, కఫతత్వం (త్రిగుణం) ఉంది.*
*ఏకవింశతి 21 పత్రాలు, వాటి పేర్లు, వాటివల్ల దూరమయ్యే రోగాలు, గ్రహకారకత్వాలు .*
*1. మాచీ పత్రం (దవనం ఆకు) : ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడంద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి. మనోవైకల్యం, అలసట తగ్గుతాయి. ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. వ్రణాలకు, కుష్టువ్యాధికి మందులా పనిచేస్తుంది. తలనొప్పి, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్లకు చలువ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది. ఉదరానికి మాచీపత్రం చాలా మంచిది.*
*2. బృహతీ పత్రం (నేల మునగ ఆకు) : దీనినే 'వాకుడు ఆకు' అని అంటారు. ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది.*
*3. బిల్వ పత్రం (మారేడు ఆకు) : దీనికే మరో పేరు 'బిలిబిత్తిరి'. 'త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మపాప సంహారం, ఏక బిల్వం శివార్పణం' అని పూజిస్తాం. బిల్వ పత్రమంటే శివునికి ఎంత ప్రీతికరమో ఈ శ్లోకంద్వారా తెలుస్తోంది. ఈ మారేడు ఆకువల్ల నెమ్మదించే రోగగుణాలను పరిశీలిస్తే... బంక విరోచనాలు కట్టడిపోతాయి. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలైనది. నేత్రసంబంధమైన రుగ్మతలను అరికడుతుంది. శ్రీమహాలక్ష్మి తపస్సువల్ల ఈ వృక్షం జన్మించినదట. మారేడు దళంలో మూడు ఆకులు, ఐదు, ఏడు, తొమ్మిది చొప్పున ఆకులుంటాయి. ఎక్కువగా మూడు ఆకుల దళమే వాడుకలో ఉంది.*
*4. దూర్వాయుగ్మం (గరిక) : చర్మరోగాలకు, మానసిక రుగ్మతలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అజీర్తిని నివారించడంలో, అంటువ్యాధులు నిరోధించడంలో, వాంతులు, విరోచనాలు అరికట్టడంలో గరిక చక్కటి గుణాన్నిస్తుంది. గజ్జిని నియంత్రిస్తుంది. గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారిణి (aఅ్‌ఱ పఱశ్‌ీఱష)లా పనిచేసి మాడ్చేస్తుంది.*
*5. దత్తూర పత్రం (ఉమ్మెత్త ఆకు) : దీనిలో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. ఉబ్బసం, కోరింత దగ్గు తగిస్తుంది. ఉదరకోశ వ్యాధులకు, చర్మరోగాలకు, కీళ్ల నొప్పులకు, లైంగిక సంబంధ సమస్యలకు, గడ్డలు, ప్రణాలకు ఉమ్మెత్త ఆకు చాలా బాగా పనిచేస్తుంది.*
*6. బదరీ పత్రం (రేగు ఆకు) : జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది. వీర్యవృద్ధికి దోహదపడుతుంది. రక్త దోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది. శరీరానికి సత్తువను చేకూరుస్తుంది. అరికాళ్ల మంటలు, అరిచేతుల దురదలు తగ్గుతాయి.*
*7. అపామార్గ పత్రం (ఉత్తరేణి) : పంటి జబ్బులకు వాడితే మంచి గుణం లభించగలదు. ఆరోగ్య సంరక్షిణిగా చెప్పవచ్చు. కడుపు శూల, అజీర్తి, మొలలు, వేడిసెగ గడ్డలు, చర్మపుపొంగుకు ఉత్తరేణి చాలా మంచిది. దీనితో పళ్లు తోముకున్నట్టయితే దంతాలు గట్టిపడతాయి. దీనికే పాపసంహారిణి, రాక్షస సంహారిణి అనికూడా పేర్లున్నాయి.*
*8. కశ్యపాయ పత్రం (తులసి ఆకు) : ఇందులో చాలా రకాలున్నాయి. జలుబు, దగ్గు, చర్మరోగాలు, గొంతు సంబంధ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు తగ్గించగలదు. రక్తస్రావాన్ని, అతిసారను అదుపుచేస్తుంది. వాంతులు, కడుపుశూల అరికడుతుంది. విషాన్ని హరించే గుణంకూడా తులసి ఆకులో ఉంది. యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. కలియుగ కల్పతరువుగా కశ్యపాయ పత్రాన్ని చెప్పాలి.*
*9, చూత పత్రం (మామిడి ఆకు) : దీనిని ఏ శుభకార్యమైనా, పర్వదినమైనా గుమ్మానికి తోరణంలా అలంకరించడం పరిపాటి. మామిడాకు తోరణం కడితే ఆ ఇంటికి వింత శోభ చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మామిడి ఆకులతో విస్తరి కుట్టుకుని భోజనం చేస్తే ఆకలిని పెంచుతుంది. శరీరంలో మంటలు, రక్త అతిసార, నోటిపూత, చిగుళ్ల బాధలు, పాదాల పగుళ్లు వంటివి మామిడాకుతో నివారించుకోవచ్చు. చక్కెర వ్యాధికి ఉపశమనమిస్తుంది. దీని పండ్ల రసం డిప్తీరియా నుంచి విముక్తి కలిగిస్తుంది.*
*10. కరవీర పత్రం (ఎర్ర గన్నేరు ఆకు) : పేలను నివారించి శిరోజాలకు రక్షణనిస్తుంది. గుండె జబ్బులు, మూత్రవ్యాధులు, కుష్టు రోగం, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కణుతులను కరిగించే గుణం పుష్కలంగా ఉంది.*
*11. విష్ణుక్రాంత పత్రం (విష్ణు క్రాంతి) : జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను అరికడుతుంది. జ్వరం, పైత్యం, కఫం, వాపులకు ఈ ఆకు చాలా మంచిది. ఉబ్బసపు దగ్గు, రొమ్ము పడిశం, దగ్గు తగ్గించగలదు.*
*12. దాడిరి పత్రం (దానిమ్మ ఆకు) : రక్తవృద్ధి కలుగజేస్తుంది. పిత్తహరిణి, అతిసార, మలేరియా, ఇతర జ్వరాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటిపూత, జీర్ణకోశ, మలాశయ వ్యాధులను నివారిస్తుంది. పిల్లలకు కడుపులో నులిపురుగులను, నలికెల పాములను చేరనివ్వదు.*
*13. దేవదారు పత్రం (దేవదారు ఆకు) : జ్ఞానవృద్ధి, జ్ఞాపక శక్తి పెంపుదలకు దోహదకారి. పుండ్లు, చర్మవ్యాధులు, జ్వరాలు, విరోచనాలు తగ్గించగలదు. దీని తైలం కళ్లకు చలువనిస్తుంది.*
*14. మరువక పత్రం (మరువం) : శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇంద్రియ పుష్టి చేకూరుస్తుంది. దీని నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చి జుట్టు రాలనివ్వదు.*
*15. సిందూర పత్రం (వావిలాకు) : తలనొప్పి, జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, పంటి నొప్పులు, వాతపు నొప్పులు, బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది. కలరాను తగ్గుముఖం పట్టించగలదు. కీళ్ల వాపులు తగ్గించి కీళ్ల నొప్పులను అరికడుతుంది.*
*16. జాజి పత్రం (జాజి ఆకు) : తలనొప్పి, చర్మవ్యాధులు, నోటి పూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యం వంటివాటికి చాలా మంచిది. బుద్ధిబలాన్ని పెంపొందిస్తుంది. కామెర్లు, శరీరంపై మచ్చలు, పక్షవాతం, కాలేయం సమస్యలు నివారిస్తుంది. గవద బిళ్లలకు జాజి ఆకు మంచి మందు. జాజికాయ, జాపత్రికి చెందినదీ ఆకు. సన్నజాజి ఆకు కాదు.*
*17. గండకి లేదా గానకి ఆకు (సీతాఫలం ఆకు) : ఇది రక్తశుద్ధి చేసి వీర్యవృద్ధిని కలుగజేస్తుంది.*
*18. శమీ పత్రం (జమ్మి ఆకు) : చర్మ వ్యాధి, అజీర్ణం, దగ్గు, ఉబ్బసం, ఉష్ణం వంటి రుగ్మతలనుంచి విముక్తి చూపించి ప్రశాంతతను చేకూరుస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు. కుష్టువ్యాధిని నియంత్రిస్తుంది.*
*19. అశ్వత్థ పత్రం (రావి ఆకు) : కంటివ్యాధులు, అతిసార, సంభోగ రోగాలు, ఉన్మాదం వంటివి నిర్మూలిస్తుంది. జీర్ణకారిగా పనిచేస్తుంది. చర్మం పగుళ్లు, చర్మ రోగాలు, పుండ్లు తగ్గిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఉత్తేజాన్ని రగిలించి సంతానలేమిని నివారిస్తుంది. జ్వరాలకు, నోటిపూతకు, ఆస్తమాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది.*
*20. అర్జున పత్రం (తెల్లమద్ది ఆకు) : దీనిలో నల్లమద్ది ఆకుకూడా ఉంది. తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు వినియోగిస్తారు. వ్రణాలకు, శరీరంలో మంటలకు, చెవిపోటుకు పనిచేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను దరిచేరనివ్వదు. వాత పిత్త కఫాలకు మంచిది. పితృకర్మలలో వినియోగిస్తారు. దీని రసం రుమాటిజమ్‌ను అరికడుతుంది. నల్లమద్ది ఆకు కడుపులో నులిపురుగులను నివారిస్తుంది.*
*21. అర్క పత్రం (జిల్లేడు ఆకు) : సూర్యునికి ప్రీతికరమైన ఆకు ఇది. పక్షవాతం, కుష్టు, చర్మవ్యాధులు, ఉబ్బసం, వాతం, కడుపు శూల వంటి దీర్ఘరోగాలను నివారిస్తుంది. అమిత ఉష్ణతత్వంనుంచి విముక్తి కలిగిస్తుంది. రథసప్తమినాడు ఆత్మకారకుడైన సూర్యభగవానుడి ప్రీతికోసం జిల్లేడు ఆకులను తల, భుజాలపై పెట్టుకుని తలారా స్నానంచేయడం ఆనవాయితీ.*
*అరటి ఆకులో భోజనం అనేది జీర్ణప్రక్రియలో ఒక భాగం. అలాగే మృష్టాన్న భోజనం అనంతరం తాంబూలం పేరుతో తమలపాకును తినటం జీర్ణప్రక్రియకు ఎంతగానో ఉపయోగం. ఇంకా చర్మవ్యాధులకు, పొంగు, ఆటలమ్మలకు ఈనాటికీ గ్రామాల్లో వేపాకుతో వైద్యం చేస్తారు. దగ్గు, ఉబ్బసంలాంటివాటికి తమలపాకు, సంతానలేమికి రావిచెట్టు ప్రదక్షిణం, విరోచనానికి సునామికాకు, సౌందర్యపోషణలో కలబంద, మునగాకు, వాపులకు వావిలాకు... ఇలా ప్రతి పత్రంలోనూ ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 63 / Kapila Gita - 63🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 19 🌴*
*19. దైవాత్ క్షుభితధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరః పుమాన్|*
*అధత్త వీర్యం సాసూత మహత్తత్త్వం హిరణ్మయమ్॥*
*ప్రకృతి యొక్క గుణములు కాలముచే క్షోభకు గురియైనప్పుడు ప్రకృతికి అతీతుడగు పరమాత్మ, తన మాయాశక్తి యందు చైతన్య శక్తిని పాదుకొల్పెను. అప్పుడు ఆ ప్రకృతి తేజోమయమగు మహత్తత్త్వమును ఆవిష్కరించెను.*
*ప్రతీ చలనమూ పరమాత్మ సంకల్పముతోనే ఏర్పడుతుంది. ప్రకృతి సూక్ష్మముగా ఉన్నప్పుడు, పరమాత్మ సంకల్పము వలన క్షోభ ఏర్పడితే, అందులోంచి మహత్ తత్వం ఏర్పడింది. అది బంగారు రంగులో ఉంటుంది. ఆయనే హిరణ్యగర్భుడు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 63 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 19 🌴*
*19. daivāt kṣubhita-dharmiṇyāṁ svasyāṁ yonau paraḥ pumān*
*ādhatta vīryaṁ sāsūta mahat-tattvaṁ hiraṇmayam*
*After the Supreme Personality of Godhead impregnates material nature with His internal potency, material nature delivers the sum total of the cosmic intelligence, which is known as Hiraṇmaya. This takes place in material nature when she is agitated by the destinations of the conditioned souls.*
*Material nature's primal factor is the mahat-tattva, or breeding source of all varieties. This part of material nature, which is called pradhāna as well as Brahman, is impregnated by the Supreme Personality of Godhead and delivers varieties of living entities. Material nature in this connection is called Brahman because it is a perverted reflection of the spiritual nature.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 102 / Agni Maha Purana - 102 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 33*
*🌻. పవిత్రారోపణ విధి - శ్రీధర నిత్యపూజా విధానము -3🌻*
పవిత్రమును గోరోచనముతోను, అగురుకర్పూరములు కలిపిన పసుపుతోను, కుంకుమరంగుతోను పూయవలెను. భక్తుడు ఏకాదశీదివసమున స్నానసంధ్యాదులు చేసి, పూజగృహము వ్రవేవించి, భగవంతుడగు శ్రీహరిని పూజింపవలెను. విష్ణువుయొక్క సమస్త పరివారమునకును బలి సమర్పించి విష్ణువును పూజింపవలెను.
ఓం హ్రీం హః ఫట్ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రీం హః ఫట్ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రీం హః ఫట్ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రీం హః ఫట్ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః''.
ద్వారము యొక్క అంతము నందు ''క్షం క్షేత్రపాలాయ నమః'' అని చెప్పి క్షేత్రపాలపూజ చేయవలెను. ద్వారము పై భాగమున ''శ్రియై నమః'' అని చెప్పుచు శ్రీదేవిని పూజించవలెను.
ద్వారదక్షిణ (కుడి) దేశమున ''ధాత్రే నమః'' ''గంగాయై నమః'' అను మంత్రము లుచ్చరించుచు, ధాతను, గంగను పూజింపవలెను. ఎడమ వైపున ''విధాత్రే నమః'' ''యమునాయై నమః'' అని చెప్పుచు విధాతను, యమునను, పూజింపవలెను. ఇదే విధముగ ద్వారముయొక్క కుడి-ఎడమ ప్రదేశములందు క్రమముగ ''శఙ్ఖనిధయే నమః'' పద్మనిధయే నమః''అని చెప్పుచు శంఖపద్మనిధులను పూజింపవలెను. [పిదప మండపములోపల కుడి హిదము మణవను మూడు మార్లు కొట్టి విఘ్నములను పారద్రోలవలెను].
పిమ్మట ''సారఙ్గాయ నమః అని అనుచు విఘ్నకారములగు భూతములను పారద్రోలవలెను. [పిమ్మట ''ఓం హాం వాస్త్వదిపతయే బ్రహ్మణ నమః'' అను మంత్రము నుచ్చరించుచు బ్రహ్మ యొక్క స్థానమున పుష్పము లుంచవలెను]. పిదప ఆసనముపై కూర్చుండి భూతశుద్ధి చేయవలెను.
''ఓం హ్రూం హః ఫట్ హ్రూం గన్దతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రూం హః ఫట్ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రూం హః ఫట్ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రూం హః ఫట్ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రూం హః ఫట్ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.''
అను ఐదు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు గంధతన్మాత్రస్వరూప మగు భూమండలమును, వజ్రచిహ్నితము, సూవర్ణమయము, చతురస్రము (నలుపలకలు గలది) పీఠమును, ఇంద్రాదిదేవతలను తన పాదముల మధ్య నున్నట్లు చూచుచు వాటి భావన చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 102 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 33*
*🌻 Mode of investiture of the sacred thread for the deity and the installation of the deity - 3 🌻*
19. One has to offer food to all the subordinate deities at the altar. Kṣaum, to the guardian deity at the end of the door. And (one should then worship) Śrī on the garland.
20. (Adorations) to Dhātā, Vidhātā (names of Brahmā), (the rivers) Ganges, Yamunā. And after having worshipped the two nidhis[2] śaṅkha and padma at the middle, the vāstu[3] is removed. (Adorations) to śārṅga (the bow of Viṣṇu). Then one has to perform the purificatory rites for the elements remaining standing.
Oṃ, hrūm, haḥ, phaṭ, hrūṃ, I absorb the subtle principle of smell. Salutations.
Oṃ, hrūṃ, haḥ, phaṭ, hrūṃ. I absorb the subtle principle of taste. Salutations.
Oṃ, hrūṃ, haḥ, phaṭ, hrūṃ I absorb the subtle principle of touch. Salutations.
Oṃ, hrūṃ, haḥ, phaṭ, hrūṃ I absorb the subtle principle of sound. Salutations.
21-22. With the five incantations (as above) one has to meditate on the yellow-coloured, hard quadrangle of earth of the form of subtle principle of smell and governed by Indra with the mark of holding the thunder-bolt in between his feet. Then the worshipper has to spread the pure subtle principle of taste and absorb the subtle principles of taste and colour in this way.
Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrūṃ, I absorb the subtle principle of taste. Salutations.
Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrūṃ, I absorb the subtle principle of colour. Salutations.
Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrūṃ, I.absorb the subtle principle of touch. Salutations.
Oṃ, hrīṃ, haḥ, phaṭ, hrīṃ I absorb the subtle principle of sound. Salutations.
23. One has to meditate on the presiding deity Varuṇa placed in between the two thighs, holding a white lotus jar, white-hued and crescent-shaped.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 617 / Sri Siva Maha Purana - 617 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 08 🌴*
*🌻. దేవాసుర యుద్ధము - 5 🌻*
ఓ మునీ! అపుడు అందరు చూచుచుండగా, శరీరమునకు గగుర్పాటును కలిలగించునది, మిక్కిలి భయంకరమైనది అగు మహాయుద్ధము విష్ణుతారకుల మధ్య ప్రవర్తిల్లెను (43). విష్ణువు గదను పైకెత్తి ఆ రాక్షసుని బలముగా కొట్టగా, మహాబలశాలి యగు ఆతడు దానిని త్రిశూలముతో రెండు ముక్కలుగా చేసెను (44).
దేవతలకు అభయమునిచ్చే విష్ణుభగవానుడు అపుడు కోపించి, శార్‌ఙ్గధనస్సు నుండి విడువబడిన వేలాది బాణములతో రాక్షసరాజును కొట్టెను (45). మహావీరుడు, శత్రు వీరులను సంహరించు వాడు అగు ఆ తారకాసురుడు కూడా వెంటనే తనవాడి బాణములతో ఆ బాణమలన్నింటినీ ముక్కలుగా చేసెను (460. అపుడు తారకాసురుడు వెంటనే మురారిని శక్తితో కొట్టెను. విష్ణువు ఆ దెబ్బకు మూర్ఛిల్లి భూమిపై బడెను (47). అచ్యుతుడు క్షణములో లేచి కోపముతో చక్రమును చేతబట్టి పెద్ద సింహనాదమును చేసెను. ఆ చక్రము మండే అగ్ని శిఖిలతో ప్రకాశించెను (48).
అపుడు విష్ణువు రాక్షసేశ్వరుని దానితో కొట్టెను. ఆ పెద్ద దెబ్బచే మిక్కిలి పీడను పొందిన తారకుడు నేలపైబడెను (49). రాక్షస శ్రేష్ఠుడు, రాక్షస నాయకుడు, మహాబలశాలి అగు తారకుడు మరల లేచి వెంటనే తన శక్తితో చక్రమును ముక్కలుగా చేసెను (50). మరియు ఆ మహాశక్తితో దేవతల ప్రభువగు విష్ణువును కొట్టెను. మహావీరుడగు విష్ణువు కూడా నందకఖడ్గముతో వానిని కొట్టెను (51). ఓ మునీ! ఈ తీరున బలవంతులు, తగ్గిపోని బలము గలవారు అగు విష్ణుతారకులిద్దరు రణరంగములో పరస్పరము గొప్ప యుద్ధమును చేసిరి (52).
శ్రీ శివ మహాపురాణములో రుద్రసంహితయుందు కుమారఖండలో దేవాసుర సంగ్రామమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 617🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 08 🌴*
*🌻 The battle between the gods and Asuras - 5 🌻*
43. O sage, a great fight ensued between Viṣṇu and Tāraka. It was very fierce. It caused horripilation to the onlookers.
44. Lifting up his club, Viṣṇu hit the Asura with great force but the powerful Asura split it with his trident.
45. The infuriated lord offering shelter to the gods hit the leader of the Asuras by arrows discharged from his bow.
46. The heroic Asura Tāraka, the slayer of enemies, immediately split the arrows of the gods by his own sharp arrows.
47. The Asura Tāraka then quickly hit Viṣṇu[2] with his spear. On being hit thus, Viṣṇu fell unconscious on the ground.
48. In a trice, Viṣṇu got up and in rage seized his discus that was blazing with flames and he roared like a lion.
49. Viṣṇu hit the king of Asuras with it. Overwhelmed by the forceful hit he fell on the ground.
50. Getting up again, the foremost among Asuras and their leader, Tāraka using all his strength immediately split the discus with his spear.
51. Again he struck Viṣṇu the favourite of the gods with that great spear. The heroic Viṣṇu hit him back with Nandaka.
52. O sage, both Viṣṇu and the Asura, equally powerful, hit each other in the battle with unabated strength.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 237 / Osho Daily Meditations - 237 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 237. ప్రేక్షకులు 🍀*
*🕉. ప్రజలు పూర్తిగా నిష్క్రియంగా మారారు. మీరు సంగీతాన్ని వింటారు, మీరు పుస్తకాన్ని చదువుతారు, మీరు సినిమా చూస్తారు - మీరు ఎక్కడా పాల్గొనరు. కేవలం వీక్షకులు, ప్రేక్షకుడు. మానవాళి మొత్తం ప్రేక్షకులుగా మారిపోయింది. 🕉*
*ఎవరో ప్రేమిస్తున్నట్లు మరియు మీరు చూస్తున్నట్లుగా ఉంది. మానవాళికి అదే జరుగుతోంది. యావత్ మానవాళి నాటకరంగంగా మారింది. వేరొకరు పనులు చేస్తున్నారు మరియు మీరు చూసేవారుగా ఉన్నారు. వాస్తవానికి మీరు దాని వెలుపల ఉన్నారు, కాబట్టి మీ ప్రమేయం ఏమీ లేదు, నిబద్ధత లేదు, ప్రమాదం కూడా లేదు. కానీ మరొకరు ప్రేమించడాన్ని చూడటం ద్వారా మీరు ప్రేమను ఎలా అర్థం చేసుకోగలరు? ప్రేమించినప్పుడు కూడా కేవలం వీక్షకులుగా ఉండే స్థాయికి మనుషులు అంటే ప్రేక్షకులుగా మారారని నా భావన. ప్రజలు లైట్లు వెలిగించి, చుట్టూ అద్దాల వెలుగులో ప్రేమించడం ప్రారంభించారు, కాబట్టి మీ ప్రతిబింబాలని మీరు ప్రేమించుకోవడం చూడవచ్చు. ఫోటోలు ఆటోమేటిక్‌గా తీయగలిగేలా తమ బెడ్‌రూమ్‌లలో ఫిక్స్‌డ్ కెమెరాలను కలిగి ఉన్న వ్యక్తులు, ఆ తర్వాత వారు తమ చిత్రాలను తాము ప్రేమించుకోవడం చూడవచ్చు.*
*కానీ మీరు మీతో నిజంగా వ్యవహరించి నపుడు, అహేతుకం ఏదో పని చేయడం ప్రారంభిస్తుంది. ప్రేమించండి మరియు సహజ అడవి జంతువుల వలె ఉండండి. మీరు సంగీతం వింటుంటే, నృత్యం చేస్తుంటే, -- సంగీతం ఒక నృత్యంగా మారిన తర్వాత, కారణమైన సంగీతాన్ని పక్కన పెడతారు. ఎందుకంటే కారణం ప్రేక్షకుడిగా మాత్రమే ఉంటుంది; అది ఎప్పటికీ పాల్గొనదు. ఇది ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. ప్రమాదం లేని చోట నుండి చూస్తుంది. కాబట్టి ప్రతిరోజూ మీరు కారణం గురించి ఆలోచించకుండా చేయగలిగిన దాన్ని కనుగొనండి. భూమిలో ఒక రంధ్రం త్రవ్వండి; వేడి ఎండలో చెమట పట్టేలా తవ్వండి - కేవలం తవ్వే వాడిలా అవ్వండి. తవ్వడం మాత్రమే మిగిలి పోనివ్వండి. దానిలో మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోతారు. చేస్తున్న పనిలో పూర్తిగా పాల్గొనే వారిగా అవ్వండి . అప్పుడు అకస్మాత్తుగా మీరు మీలో కొత్త శక్తి తలెత్తడాన్ని చూస్తారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 237 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 237. Spectators 🍀*
*🕉. People have become completely passive. You listen to music, you read a book, you see a film--you are never a participant anywhere, just a watcher, a spectator. The whole of humanity has been reduced to being spectators. 🕉*
*It is as if somebody else is making love and you are watching and that is what's happening. The whole of humanity has become peeping toms. Somebody else is doing the things, and you are a watcher. Of course you are outside it, so there is no involvement, no commitment, no danger. But how can you understand love by watching somebody else make love? My feeling is that people have become spectators to such a degree that when they make love they are watchers. People have started making love in the light-all lights on, mirrors all around, so you can watch yourself making love. There are people who have fixed cameras in their bedrooms so that pictures can be taken automatically, so later on they can see themselves making love.*
*When you participate, something irrational starts working. Make love and just be like wild animals. If you listen to music, dance --once the music has become a dance, reason is put aside. And reason can only be a spectator; it can never be a participant. It is always on the safe side, watching from somewhere where there is no danger. So every day find something you can do without thinking about it. Dig a hole in the earth; that will do. Perspire in the hot sun, and dig-- just be the digger. In fact, be not the digger but the digging. Lose yourself completely in it. Become a participant, and suddenly you will see a new energy arising.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 402 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।*
*మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀*
*🌻 402. 'విద్యా అవిద్యా స్వరూపిణి' - 4 🌻*
*"సమత్వం యోగ ఉచ్యతే", "పండితాః సమదర్శినః" అని యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు ఈ పూర్ణతత్త్వమునే బోధించినాడు; ఆచరించి చూపించినాడు కూడ. శ్రీరాముని జీవితమందు కూడ ఇట్టి సమ వర్తనము గోచరించును. శత్రువునైననూ ప్రేమించగల తత్త్వము వారిరువురిది. భేదముగ కనిపించుచున్న ప్రకృతి యందు అభేదముగ నున్న తత్త్వమును కూడ చూడవలెను.*
*అభేదమగు తత్త్వమును చూచుచు భేద జ్ఞానము మరవకుండుట కూడ అవసరము. ఆదిశంకరులు తమ శిష్యులకు భేద అభేద జ్ఞానములను ఆచరణ మార్గమున బోధించిరి. అద్వైతమును బోధించిన శంకరులు శిష్య బృందముతో అడవిలో పయనించు చున్నప్పుడు పులిని చూచి చెట్టు నెక్కుట భేద జ్ఞానమును బోధించుటకే.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini*
*Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻*
*🌻 402. 'Vidya Avidya Swarupini' - 4 🌻*
*'Samatvam Yoga Uchyate', 'Panditah Samadarshinah' is how Yogeshvara Sri Krishna taught the philosophy of equality; He also practiced it and showed us how it's done. Even in the life of Sri Rama, this same behavior is observed. Both of them have the philosophy of being able to love even the enemy. In this nature which appears diversified, one should inculcate the vision to see the underlying philosophy of unity in it.*
*It is also necessary not to forget the knowledge of diversity while looking at the unified Self. Adi Shankara taught his disciples the knowledge of this unity and diversity in a practical way. Shankara, who taught Advaita, while traveling in the forest with a group of disciples saw a tiger and climbed a tree to teach the knowledge applicable to the physical nature.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Comments