top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 . శ్రీ శివ మహా పురాణము - 573 / Sri Siva Maha Purana - 573 🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 573 / Sri Siva Maha Purana - 573 🌹* రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 55 🌴* *🌻. శివ పార్వతుల కైలాసగమనము - 4 🌻* శివుడు కూడ పార్వతితో ఆనందముగా విహరిస్తూ కైలాస పర్వతము నందుండెను. గణములందరు సుఖమును పొంది పార్వతీ పరమేశ్వరులను చక్కగా సేవించిరి (30). కుమారా! నీకు ఇంతవరకు పరమమంగలము, శోకమును నశింపజేయునది, ఆనందమును కలిగించునది, ఆయుర్దాయము నిచ్చునది, ధనమును వర్ధిల్ల జేయునది అగు పార్వతీకల్యాణమును చెప్పి యుంటిని (31). ఎవడైతే దీనిని నిత్యము శుచియై దాని యందు మనస్సును లగ్నము చేసి వినునో, లేక నియమముతో వినిపించునో వాడు శివలోకమును పొందును (32). అద్భుతము, మంగళములకు నిలయము, విఘ్నముల నన్నిటినీ పోగొట్టునది, వ్యాధులనన్నిటినీ నశింపజేయునది అగు ఈ వృత్తాంతమును చెప్పితిని (33). కీర్తిని కలిగించునది,స్వర్గము నిచ్చునది, ఆయుర్దాయము నిచ్చునది, పుత్ర పౌత్రులనిచ్చునది, గొప్పది, ఇహలోకములో సర్వకామనల నీడేర్చునది, భక్తిని ఇచ్చునది, నిత్యముక్తిని ఇచ్చునది (34), అపమృత్యువును తొలగించునది, గొప్ప శాంతిని కలిగించునది, శుభకరమైనది, దుష్ట స్వప్నములనన్నిటినీ శమింపజేయునది, బుద్ధిని ప్రజ్ఞను ఇచ్చునది (35), శివునకు సంతోషమును కలిగించునది అగు ఈ వృత్తాంతమును శుభమును గోరు జనులు శివోత్సవములన్నిటి యందు శ్రద్ధతో ప్రీతితో పఠించవలెను (36). దేవాదులను, శివుని ప్రతిష్ఠించు సమయములో మరియు సర్వకార్యముల నారంభించు సమయములో దీనిని ప్రత్యేకించి మిక్కలి ప్రీతితో పఠించవలెను (37). లేదా, శుచియై పార్వతీ పరమేశ్వరుల ఈ మంగళ చరితమును వినవలెను. అట్లు చేసినచో సర్వకార్యములు సిద్ధించును. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (38). శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీ ఖండలో శివుడుకైలాసమునకు వెళ్లుట అనే ఏబది అయిదవ అధ్యాయము ముగిసినది (55). పార్వతీ ఖండ సమాప్తమైనది. శ్రీకృష్ణార్పణమస్తు. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 SRI SIVA MAHA PURANA - 573 🌹* *✍️ J.L. SHASTRI* *📚. Prasad Bharadwaj * *🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 55 🌴* *🌻 Śiva returns to Kailāsa - 4 🌻* 30. On the mountain, Śiva stayed with Pārvatī and continued his divine sports with joy. The Gaṇas too were happy and they worshipped the married couple. 31. O dear, I have thus narrated the auspicious story of the marriage of Śiva, that dispels sorrow, generates delight and increases wealth and longevity. 32. He who hears this story with pure mind fixed on them or narrates the same, shall attain Śivaloka. 33. This narrative is said to be wondrous and the cause of everything auspicious. It quells all hindrances and ailments. 34. It is conducive to glory and the attainment of heaven. It bestows longevity, sons and grandsons, all cherished desires, worldly pleasures and salvation too. 35. It wards off premature death. It is auspicious and it causes peace. It makes bad dreams subside. It is an instrument for the acquisition of keen intellect. 36. It shall be read on all occasions of Śiva’s festivals by the people who desire auspicious results. It gives satisfaction to Śiva. 37. At the installation of the idols of the deities this shall be particularly read. At the beginning of all auspicious rites it shall be read with pleasure. 38. With purity in mind and body it shall be heard. All affairs become fruitful thereby. This is true, really true. Continues.... 🌹🌹🌹🌹🌹 #శివమహాపురాణము #SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం https://facebook.com/groups/hindupuranas/ https://facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/

Comments


Post: Blog2 Post
bottom of page