🌹 . శ్రీ శివ మహా పురాణము - 678 / Sri Siva Maha Purana - 678 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 20 🌴
🌻. గణేశుని వివాహము - 2 🌻
గణేశుడు విశ్వరూపప్రజాపతి యొక్క కుమార్తెలగు అతిశయించిన అందముగల ఇద్దరు కన్యలను ఆనందముతో వివాహమాడెను (13). అతనికి సుందరాంగనలగు ఆ ఇద్దరు పత్నులయందు ఇద్దరు పుత్రులు కలిగిరి. సిద్ధి అను నామెకు క్షేముడు, బుద్ధి అను నామెకు సర్వసుఖముల నిచ్చే లాభుడు కలిగిరి (14). ఈ గణేశుడు ఇద్ధరు భార్యమలయందు ఇద్దరు శుభపుత్రులను పొందినాడు. తల్లి దండ్రుల అంగీకారముతో నాతడు ఎడతెరపి లేని సుఖము ననుభవించుచున్నాడు (15). కుమారా! నీవు వారి మోసపూరితమగు ఆజ్ఞకు బద్ధుడవై సముద్రములతో అడవులతో కూడి యున్న భూమిని చుట్టి వచ్చితివి. దానికి లభించిన ఫలము ఇది (16).
కుమారా! నీవు ఆలోచింపుము. వ్యక్తికి ప్రభులగు తల్లిదండ్రులే మోసమును చేసినచో, ఇతరులు కూడ మోసమును ఎట్లు చేయకుందురు? (17) నీ తల్లి దండ్రులు చేసిన పని యోగ్యముగా లేదు. నీవు కూడ ఆలోచించుము. నా మనస్సునకు వారు చేసిన పని శుభకరమని తోచలేదు (18). తల్లి విషము నిచ్చినచో, తండ్రి అమ్మివేసినచో, రాజు సర్వస్వమును అపహరించినచో, ఎవనికి ఏమి చెప్పవలెను? (19) కుమారా! ఎవరైతే ఇట్టి గొప్ప అనర్ధమును కలిగించే కర్మను చేయుదురో, అట్టి వారి ముఖమును శాంతిని గోరు బుద్ధిశాలి చూడకుండుట మేలు (20).
వేదశాస్త్రములు, మరియు స్మృతులు ఇట్టి నీతిని దృఢముగా బోధించు చున్నవి. ఆ నీతిని నేను నీకు విన్నవించితిని. నీకు నచ్చిన రీతిని ఆచరింపుము (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 678🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 20 🌴
🌻 The celebration of Gaṇeśa’s marriage - 2 🌻
13. By this marriage that was celebrated, Gaṇeśa has obtained two wives joyously. They are the excellent daughters of Prajāpati Viśvarūpa.
14. He has begot of his two wives of auspicious body two sons, Kṣema of Siddhi and Lābha of Buddhi. They bestow happiness on every one.
15. Begetting two sons of auspicious features of his wives Gaṇeśa is continuously enjoying happiness as conceived by your parents.
16. The entire earth consisting of oceans and jungles has been traversed by you due to their deceptive behest. O dear, this is the result of that.
17. O dear, consider. If parents begin to deceive or particularly if our masters begin to deceive, won’t others also begin to deceive.
18. Your parents have not done well. Just ponder over it. I don’t think their action has been good.
19. If mother were to poison her son, if father were to sell his son, if the king were to confiscate the assets of his subjects what can be said and to whom?
20. O dear, an intelligent peace-loving person shall never look at the face of the person who has committed this harmful deed.
21. This policy has been mentioned in the Vedas, Smṛtis and sacred texts. It has been intimated to you now. Do as you wish.”
Continues....
🌹🌹🌹🌹🌹
Comments