🌹. కపిల గీత - 105 / Kapila Gita - 105🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 61 🌴
61. మనసశ్చంద్రమా జాతో బుద్ధిరబుద్ధేర్గిరాం పతిః|
అహంకారస్తతో రుద్రశ్చితం చైత్యస్తతోఽభవత్॥
మనస్సునుండి దాని అభిమాన దేవతయైన చంద్రుడు, హృదయము నుండి బుద్ధియు, దాని అభిమాన దేవతయైన బ్రహ్మ వ్యక్తమయ్యెను. పిమ్మట అహంకారము, దాని అభిమాన దేవతయైన రుద్రుడు ఉత్పన్నమయ్యెను. అనంతరము చిత్తము, దాని అభిమాన దేవతయైన క్షేత్రజ్ఞుడు రూపొందెను.
మనసు కూడా చంద్రునిలాగ వికారాత్మకం. అదే హృదయం నుంచి బుద్ధి పుట్టింది. ఈ బుద్ధికి అధిపతి బ్రహ్మ. ఈ హృదయం నుండే అహంకారం పుట్టింది. దీనికి అధిపతి రుద్రుడు. అదే హృదయం నుండే చిత్తం పుట్టింది. చైత్యుడు (క్షేత్రజ్ఞుడు లేదా జీవుడు) చిత్తములో ఉంటాడు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 105 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 2. Fundamental Principles of Material Nature - 61 🌴
61. manasaś candramā jāto buddhir buddher girāṁ patiḥ
ahaṅkāras tato rudraś cittaṁ caityas tato 'bhavat
After the mind, the moon appeared. Intelligence appeared next, and after intelligence, Lord Brahmā appeared. Then the false ego appeared and then Lord Śiva, and after the appearance of Lord Śiva came consciousness and the deity presiding over consciousness.
The moon appeared after the appearance of mind, and this indicates that the moon is the presiding deity of mind. Similarly, Lord Brahmā, appearing after intelligence, is the presiding deity of intelligence, and Lord Śiva, who appears after false ego, is the presiding deity of false ego. In other words, it is indicated that the moon-god is in the mode of goodness, whereas Lord Brahmā is in the mode of passion and Lord Śiva is in the mode of ignorance. The appearance of consciousness after the appearance of false ego indicates that, from the beginning, material consciousness is under the mode of ignorance and that one therefore has to purify himself by purifying his consciousness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments