top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 116 / Kapila Gita - 116


🌹. కపిల గీత - 116 / Kapila Gita - 116🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 72 🌴


72. తమస్మిన్ ప్రత్యగాత్మానం ధియా యోగ ప్రవృత్తయా|

భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్యాత్మని చింతయేత్॥


కనుక, మానవుడు భగవంతుని యందు భక్తిని చేయవలెను. ప్రకృతి పురుషుల వివేకము ద్వారా సంసారము నందు వైరాగ్యము పొందవలెను. పిమ్మట యోగముచే ఏకాగ్రము చెందిన బుద్ధితో, దేహమున కంటె వేరైన వాడుగా ఈ దేహమునందే ప్రత్యగాత్మ రూపములో నున్న పరమేశ్వరుని ధ్యానింపవలెను.


ఇదంతా ప్రత్యగాత్మ అధీనం (జీవాత్మ) , జీవుడు ప్రవర్తిస్తేనే, జీవుడిలో చైతన్యం ఉన్ముఖమైతేనే పని చేస్తాయి. అందుకే "నేను చేస్తున్న్నా" అనే భావన సరికాదు. ఈ సమష్టి పురుషునిలో వున్న వ్యష్టి పురుషుడిగా పేరు గాంచిన ప్రత్యగాత్మను యోగ బుద్ధితో తెలుసుకోవాలి. మనసు బుద్ధి చిత్తమూ అహంకారముతో కలిసి "వాస్తవముగా ఈ సముదాయాన్ని పని చేయిస్తున్నది ప్రత్యగాత్మ. ఆ ప్రత్యగాత్మకు అలాంటి సంకల్పం కలిగించిన వాడు పరమాత్మ".


జీవాత్మ, పరమాత్మ, శరీరం, ఇంద్రియములు, అవయవములూ, అధిష్ఠాన దేవతలూ అంటే ఏమిటో, ఈ సమగ్ర స్వరూపాన్ని యధార్థ జ్ఞానముతో తెలుసుకొంటే, ప్రతీ పనికీ ఆరంభం ఎక్కడో తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు. అలాంటి జ్ఞానం పొంది "ఎవరి సంకల్పముతో ఇవన్నీ పని చేస్తాయో, అలాంటి వాడి సంకల్పము లేకుంటే ఇవన్నీ నిష్క్రియలైనప్పుడు, ఇవన్నీ నాకెందుకూ" అని కలగడం విరక్తి. మొదట జ్ఞానం, తరువాత విరక్తీ, కలిగిన తరువాత పరమాత్మ మీద భక్తి కలుగుతుంది. జ్ఞ్యానముతో స్పష్టముగా విడదీసి వివేకముతో తెలుసుకుని, పరమాత్మ యందు భక్తి, ప్రపంచము యందు విరక్తినీ పెంచుకొని, ఆ స్వామిని భక్తితో ధ్యానం చేయాలి. అలా చేయడం వలన అహంకారం పెరగదు. శరీరమే ఆత్మ అన్న భ్రమ తొలగిపోతుంది.


ప్రతీ చిన్న పని ఎలా జరిగిందో తెలిసిన నాడు, నేనే పనీ చెయటం లేదు అని తెలుస్తుంది. ఇవన్నీ చేయిస్తున్న పరమాత్మను మన చిత్తములో ధ్యానం చేస్తాము. అప్పుడు అర్థమవుతుంది మనకి గుడికి వెళ్ళే బుద్ధి పుట్టింది అంటే పరమాత్మకు ఆ సంకల్పం కలిగింది అని అర్థం. ఇది బాగా అవగాహనమైతే అదే వివేకం. ఇలాంటి వివేకముతో పరమాత్మను ఈ ఆత్మలో బుద్ధితో ధ్యానం చేస్తే, అహంకార మమకారములు తొలగుతాయి. మనసు ఏకాగ్రమవుతుంది, బుద్ధి స్థిరమవుతుంది, చిత్తం నిశ్చలమవుతుంది.


రెండవ అధ్యాయము సమాప్తము.


కొనసాగుతుంది... 3వ అధ్యాయము


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 116 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 72 🌴


72. tam asmin pratyag-ātmānaṁ dhiyā yoga-pravṛttayā

bhaktyā viraktyā jñānena vivicyātmani cintayet


Therefore, through devotion, detachment and advancement in spiritual knowledge acquired through concentrated devotional service, one should contemplate that Supersoul as present in this very body although simultaneously apart from it.


One can realize the Supersoul within oneself. He is within one's body but apart from the body, or transcendental to the body. Although sitting in the same body as the individual soul, the Supersoul has no affection for the body, whereas the individual soul does. One has to detach himself, therefore, from this material body, by discharging devotional service. It is clearly mentioned here (bhaktyā) that one has to execute devotional service to the Supreme. vāsudeve bhagavati bhakti-yogaḥ prayojitaḥ. When Vāsudeva, the all-pervading Viṣṇu, the Supreme Personality of Godhead, is served in completely pure devotion, detachment from the material world immediately begins. The purpose of Sāṅkhya is to detach oneself from material contamination. This can be achieved simply by devotional service to the Supreme Personality of Godhead.


When one is detached from the attraction of material prosperity, one can actually concentrate his mind upon the Supersoul. As long as the mind is distracted towards the material, there is no possibility of concentrating one's mind and intelligence upon the Supreme Personality of Godhead or His partial representation, Supersoul. In other words, one cannot concentrate one's mind and energy upon the Supreme unless one is detached from the material world. Following detachment from the material world, one can actually attain transcendental knowledge of the Absolute Truth. The perfection of this sāṅkhya-yoga culminates in devotional service unto the Absolute Truth.


End of 2nd Chapter


Continues... 3rd chapter


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Komentar


Post: Blog2 Post
bottom of page