🌹. కపిల గీత - 122 / Kapila Gita - 122🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 06 🌴
06. యమాదిభిర్యోగ పథైరభ్యసన్ శ్రద్ధయాన్వితః|
మయి భావేన సత్యేన మత్కథా శ్రవణేన॥
యమనియమాది యోగసాధనలను అభ్యాసము చేయుచు, శ్రద్ధా పూర్వకముగా చిత్తమును క్రమక్రమముగా ఏకాగ్రమొనర్చి చిత్తమును అచ్చముగ నా యందే నిలుపవలెను. భగవంతునియొక్క అద్భుతలీలలకు సంబంధించిన కథలనే ప్రేమతో వినుచుండవలెను.
దీనికి శ్రద్ధ కావాలి. బుద్ధీ, మనసు , అహంకారమునూ, చిత్తమునూ, ఈ నాలిగింటిని ఒకే దారిలో నడుపుట శ్రద్ధ. యమ నియమాదులతో, మెల్లిగా అభ్యాసము చేయాలి. నీ చెవులు నా కథలు వినేట్టు చేయి. అలా వింటూ ఉంటే, మనసు నా యందు తగలుకుంటుంది. ప్రకృతికి కేటాయించే సమయాన్ని పరమాత్మకి కేటాయించ బడుతుంది. ఆ సమయం మెల్లిగా త్రికరణ శుద్ధిగా, కపటము లేకుండా పెంచుకుంటూ వెళ్ళు. అలా చేస్తూ వెళ్ళగా, నా మీద భక్తి కలుగుతుంది.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 122 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 06 🌴
06. yamādibhir yoga-pathair abhyasañ śraddhayānvitaḥ
mayi bhāvena satyena mat-kathā-śravaṇena ca
One has to become faithful by practicing the controlling process of the yoga system and must elevate himself to the platform of unalloyed devotional service by chanting and hearing about Me.
Yoga is practiced in eight different stages: yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna and samādhi. Yama and niyama mean practicing the controlling process by following strict regulations, and āsana refers to the sitting postures. These help raise one to the standard of faithfulness in devotional service. The practice of yoga by physical exercise is not the ultimate goal; the real end is to concentrate and to control the mind and train oneself to be situated in faithful devotional service. Bhāvena, or bhāva, is a very important factor in the practice of yoga or in any spiritual process.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentários