🌹. కపిల గీత - 27 / Kapila Gita - 27🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴. 12. శ్రవణం ద్వారా దైవంతో అనుబంధం - 3 🌴
27. అసేవయాయం ప్రకృతేర్గుణానాం జ్ఞానేన వైరాగ్యవిజృమ్భితేన
యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మా నమిహావరున్ధే
పరమాత్మ యందు మనసు లగ్నం చేసిన వారు పొరబాటున కూడా ప్రకృతి గుణాలను సేవించడానికి ప్రయత్నించ కూడదు. ప్రకృతి గుణములని సేవించకుండుట వలన, బాగా పెరిగిన వైరాగ్యం వలన, నాయందు అర్పించిన యోగముతో, నిరంతరమూ నాయందు భక్తితో, అందరికీ (అన్ని ఆత్మలకూ) ఆత్మగా ఉన్న నన్ను తన దగ్గరనుండి బయటకు పోకుండా ఉంచుకుంటాడు. నన్ను ఇక్కడే నిర్భందిస్తాడు.
అలా చేయడానికి 1. ప్రకృతి గుణాలని సేవించకుండా ఉండటం 2. వైరాగ్యము నిండిన జ్ఞ్యానము కలిగి ఉండాలి 3. భక్తి కూడా నాకే అర్పించాలి ( అంటే భక్తి కూడా కృష్ణార్పణం) . భగవంతుడు మాత్రమే ఉపాయము. మనము చేసేవన్నీ భగవంతుడు మాత్రమే ఉపాయం అని తెలుసుకోవడానికి పనికొస్తాయి. ఇవి చేస్తే ఆ జీవాత్మ హృదయములో ఉండి అక్కడే ఉంటాను.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 27 🌹
✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj
🌴 12. Association with the Supreme Lord Through Hearing - 3 🌴
27. asevayayam prakrter gunanam jnanena vairagya-vijrmbhitena
yogena mayy arpitaya ca bhaktya mam pratyag-atmanam ihavarundhe
Thus by not engaging in the service of the modes of material nature but by developing Krsna consciousness, knowledge in renunciation, and by practicing yoga, in which the mind is always fixed in devotional service unto the Supreme Personality of Godhead, one achieves My association in this very life, for I am the Supreme Personality, the Absolute Truth.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments