top of page

కపిల గీత - 49 / Kapila Gita - 49


🌹. కపిల గీత - 49 / Kapila Gita - 49🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు,

📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 5 🌴


05. గుణైర్విచిత్రాః సృజతీం సరూపాః ప్రకృతిం ప్రజాః

విలోక్య ముముహే సద్యః స ఇహ జ్ఞానగూహయా


జీవుడు ప్రకృతిని ఎందుకు ఆమోదిస్తున్నాడు? ఆ ప్రకృతి తన లాంటి వాటినీ, చిత్ర విచిత్రమైన వాటిని ఎన్నింటినో సృష్టిస్తుంది. అవి చూసి జీవుడు చాలా బాగున్నాయి అనుకుంటాడు. వెంటనే జీవుడు మోసపోయాడు. కంటితో చూచి బాగుంది అనుకునే ప్రతీదీ ప్రకృతే. ఆత్మకు ఏ రంగూ రూపం ఉండదు. ప్రకృతి సృష్టించిన రూపాలను చూచి జీవుడు మోహాన్ని పొందుతున్నాడు. ఇలా లేని వాటిని ఉన్నదీ అనుకోవడమే మోహం. ప్రకృతి జ్ఞ్యానముని కప్పిపుచ్చుతుంది. ఆ జ్ఞ్యానం మరుగునపడుతుంది. మోహం పైకి తేవబడుతుంది. జీవుడు అందుకే లేని దానిని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు, తనవి కాని దాన్ని తనవి అన్నట్లు భ్రమకు లోనవుతాడు.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 49 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 5 🌴


05. guṇair vicitrāḥ sṛjatīṁ sa-rūpāḥ prakṛtiṁ prajāḥ

vilokya mumuhe sadyaḥ sa iha jñāna-gūhayā


Divided into varieties by her threefold modes, material nature creates the forms of the living entities, and the living entities, seeing this, are illusioned by the knowledge—covering feature of the illusory energy.


Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Commenti


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page