🌹. కపిల గీత - 50 / Kapila Gita - 50🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు,
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 6 🌴
06. ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతేః పుమాన్
కర్మసు క్రియమాణేషు గుణైరాత్మని మన్యతే
ఎదురుగా ఉన్న దానిని ధ్యానం చేయడం వలన ఉన్న దానిని మరచిపోతున్నాడు. బాగున్న తాను "నేను బాగా లేను" అనుకుంటాడు. అంటే తన స్వరూపాన్ని మరచిపోతాడు. లేని రూపాన్ని ఉనంట్లు ప్రకృతిని ధ్యానం చేయడం వలన, ప్రకృతి యొక్క సత్వ రజ తమో గుణముల వలన ఇంద్రియములు చేసే పనులను "నేను చేస్తున్నాను" అనుకుంటాడు. చేసేది ప్రకృతి యొక్క గుణాలు. కాని, తాను కర్తా అని జీవుడు ఆపాదించు కుంటున్నాడు. కర్తృత్వం ఆపాదించుకోవడం వలన భోక్తృత్వం ఆపాదించబడుతోంది. ఇదే బంధం అంటే. లేని దాన్ని ఉన్నట్లు అనుకోవడమే సంసారం. చేయని దాన్ని చేస్తున్నా అనుకోవడమే బంధం.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 50 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 ✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj 🌴 2. Fundamental Principles of Material Nature - 6 🌴 06. evaṁ parābhidhyānena kartṛtvaṁ prakṛteḥ pumān karmasu kriyamāṇeṣu guṇair ātmani manyate Because of his forgetfulness, the transcendental living entity accepts the influence of material energy as his field of activities, and thus actuated, he wrongly applies the activities to himself. Continues... 🌹 🌹 🌹 🌹 🌹
Comentários