top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 60 / Kapila Gita - 60


🌹. కపిల గీత - 60 / Kapila Gita - 60🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


2వ అధ్యాయము


🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 16 🌴


16. ప్రభావం పౌరుషం ప్రాహుః కాలమేకే యతో భయమ్

అహఙ్కారవిమూఢస్య కర్తుః ప్రకృతిమీయుషః


కొందరు కాలమును ప్రత్యేకతత్త్వముగా భావింపక, అది పరమపురుషుని ప్రభావమనియు, లేక ఈశ్వరుని సంహారకారణీ శక్తి అనియు నుడువుదురు. దాని వలన మాయాకార్యరూపములైన దేహాదులయందు ఆత్మాభిమానము కలిగి, జీవుడు అహంకారముచే మోహితుడై, తనను కర్తగా భావించుకొని, నిరంతరము భయగ్రస్తుడగును.


కాలమంటే పరమాత్మ యొక్క ప్రభావం (ప్రభావం పౌరుషం - పురుషుని యొక్క ప్రభావం). ప్రకృతికి గానీ జీవునికి గానీ భయము కలిగేది కాలము వలనే. తాను స్వయముగా కల్పించుకున్న ప్రకృతి సంబంధముతో అనుభూతి కోసం ఆచరించే కర్మలే పాప పుణ్యాలు. వీటి సమూహాన్ని బట్టే ఫలం నిర్ణయించబడుతుంది. ప్రతీదానికి నియమిత కాలం ఉంటుంది. అహంకారముతో మూఢుడై కర్తృత్వాన్ని ఆపాదించుకున్న జీవునికి భయము ఈ కాలము వలన. ప్రకృతి భావాన్ని పురుషుడు పొందుతున్నాడు. ప్రకృతిని నేనే అనుకుంటున్నాడు, అహంకార విమూఢుడై. అందువలనే కర్త అయ్యాడు. కర్తృత్వాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. అలా కర్తృత్వాన్ని తెచ్చిపెట్టుకునే జీవుడిని భయపెట్టేది ఈ కాలము.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 60 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj 🌴 2. Fundamental Principles of Material Nature - 16 🌴 16. prabhāvaṁ pauruṣaṁ prāhuḥ kālam eke yato bhayam ahaṅkāra-vimūḍhasya kartuḥ prakṛtim īyuṣaḥ The influence of the Supreme Personality of Godhead is felt in the time factor, which causes fear of death due to the false ego of the deluded soul who has contacted material nature. The living entity's fear of death is due to his false ego of identifying with the body. Everyone is afraid of death. Actually there is no death for the spirit soul, but due to our absorption in the identification of body as self, the fear of death develops. Continues... 🌹 🌹 🌹 🌹 🌹

0 views0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page