top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 66 / Kapila Gita - 66


🌹. కపిల గీత - 66 / Kapila Gita - 66🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 22 🌴


22. స్వచ్ఛత్వమవికారిత్వం శాంతత్వమితి చేతనః|

వృత్తిభిర్లక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతిః పరా॥


జలము తన స్వాభావిక స్థితియందు స్వచ్ఛముగా, వికార శూన్యముగా, శాంతముగా ఉండును. కాని, అదే జలము, మట్టి మొదలగు ఇతర పదార్ధముల కలయికచే మలినముగా, వికారముగా, అల్లకల్లోలముగా మారిపోవును. అట్లే చిత్తము కూడా తన సహజస్థితి యందు జలము వలెనే స్వచ్ఛము, వికారరహితము, శాంతముగా ఉండును. అయితే ఇది కూడా ఇతర వృత్తులతో కూడినప్పుడు ఆ చిత్తము మలినముగా, వికారముగా, అశాంతిగా మారిపోవును. ఇదియే చిత్తము యొక్క ముఖ్యలక్షణముగా చెప్పబడినది.


ఏ వికారమూ లేనిది చిత్తం. వికారం ఏర్పడితే అంతఃకరణం లేదా బుద్ధి. ఇంకొంచెం వికారం ఏర్పడితే మనసు. అది మనసుగా మారితే సంకల్ప వికల్పాలు, అదే బుద్ధిగా మారితే, సంశయ నిశ్చయాలు, అహంకారముగా మారితే క్రోధమూ, అమర్షమూ వస్తాయి. వికారాలకు చిత్తం అతీతము.


సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 66 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 22 🌴


22. svacchatvam avikāritvaṁ śāntatvam iti cetasaḥ

vṛttibhir lakṣaṇaṁ proktaṁ yathāpāṁ prakṛtiḥ parā


After the manifestation of the mahat-tattva, these features appear simultaneously. As water in its natural state, before coming in contact with earth, is clear, sweet and unruffled, so the characteristic traits of pure consciousness are complete serenity, clarity, and freedom from distraction.


The more one becomes materially contaminated, however, the more consciousness becomes obscured. In pure consciousness one can perceive a slight reflection of the Supreme Personality of Godhead. As in clear, unagitated water, free from impurities, one can see everything clearly, so in pure consciousness, one can see things as they are. One can see the reflection of the Supreme Personality of Godhead, and one can see his own existence as well. This state of consciousness is very pleasing, transparent and sober. In the beginning, consciousness is pure.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page