top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 72 / Kapila Gita - 72


🌹. కపిల గీత - 72 / Kapila Gita - 72🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 28 🌴


28. యద్విదుర్హ్యనిరుద్ధాఖ్యం హృషీకాణామధీశ్వరమ్|

శారదేందీవరశ్యామం సంరాధ్యం యోగిభిః శనైః॥


ఈ మనస్తత్వమే ఇంద్రియముల అధిష్ఠాతయైన అనిరుద్ధుడు అనుపేర ఖ్యాతికెక్కెను. యోగులు మనస్సును వశపరచుకొనుటకు శరత్కాలపు నల్లగలువ వలె శ్యామ వర్ణముతో నున్న అనిరుద్ధుని ఆరాధింతురు.


రాజస అహంకారము యొక్క అధిష్టాత అనిరుద్ధుడు. సాత్వికాహంకార అధిష్టాత ప్రద్యుమ్నుడు. అనిరుద్ధుడు హృషీకములకు అధిష్టానము. హృషీకములు అంటే ఇంద్రియములు. ఇంద్రియాలకు "సంతోషాన్ని తగ్గించేవి" అని పేరు. కోరికను నిర్మూలించి పరమాత్మను చేర్చేది బుద్ధి లేదా ఆత్మ. దానికి కూడా హృషీకమనే పేరు. ఈ అనిరుద్ధుడు సకల ఇంద్రియములకూ అధిపతి. అనిరుద్ధుడూ అంటే ఆపశక్యం కాని వాడు. అందుకే మన ఇంద్రియములలో కలిగే ప్రవృత్తిని మనం ఆపలేము. అనిరుద్ధుడు ఇంద్రియాధిష్టాన దేవత. అనిరుద్ధుడు శరదృతువులో ఉండే నల్లని కలువలా ఉంటాడు. శరదృతువులో నలుపు కొంత తెలుపుతో కలిసి ఉంటుంది. అటువంటి రంగులో ఉంటాడు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నులలో సులభముగా మనకు పొందదగిన వాడు అనిరుద్ధుడు. యధాక్రమముగా మెల్లగా యోగాన్ని అవలంబిస్తూ వెళితే ఈయన దొరుకుతాడు.


సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 72 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 28 🌴 28. yad vidur hy aniruddhākhyaṁ hṛṣīkāṇām adhīśvaram śāradendīvara-śyāmaṁ saṁrādhyaṁ yogibhiḥ śanaiḥ The mind of the living entity is known by the name of Lord Aniruddha, the supreme ruler of the senses. He possesses a bluish-black form resembling a lotus flower growing in the autumn. He is found slowly by the yogīs. The system of yoga entails controlling the mind, and the Lord of the mind is Aniruddha. It is stated that Aniruddha is four-handed, with Sudarśana cakra, conchshell, club and lotus flower. There are twenty-four forms of Viṣṇu, each differently named. Among these twenty-four forms, Saṅkarṣaṇa, Aniruddha, Pradyumna and Vāsudeva are depicted very nicely in the Caitanya-caritāmṛta, where it is stated that Aniruddha is worshiped by the yogīs. Meditation upon voidness is a modern invention of the fertile brain of some speculator. Actually the process of yoga meditation, as prescribed in this verse, should be fixed upon the form of Aniruddha. By meditating on Aniruddha one can become free from the agitation of acceptance and rejection. When one's mind is fixed upon Aniruddha, one gradually becomes God-realized; he approaches the pure status of divine consciousness, which is the ultimate goal of yoga. Continues... 🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page