top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 73 / Kapila Gita - 73


🌹. కపిల గీత - 73 / Kapila Gita - 73🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 29 🌴


29. తైజసాత్తు వికుర్వాణాద్బుద్ధితత్త్వమభూత్సతి|

ద్రవ్యస్ఫురణవిజ్ఞానమింద్రియాణామనుగ్రహః॥


పూజ్యురాలా! తైజస (రాజస) అహంకారమున వికారము కలుగుటచే దానినుండి బుద్ధితత్ప్వము ఉత్పన్నమయ్యెను. వస్తువులను స్ఫురింపజేయు విజ్ఞానము ఇంద్రియ వ్యాపారములకు సహాయపడుట అనగా పదార్ధముల విశేషజ్ఞానము కలిగించుట అనునవి ఈ బుద్ధియొక్క కార్యములు.


ఈ తైజసాహంకారం వలన పుట్టేదే బుద్ధి తత్వం. ఈ బుద్ధి తత్వము వలన కలిగేది ద్రవ్య స్పురణ విజ్ఞ్యానం. ఇలాంటి దాని వలననే అన్ని ఇంద్రియములూ ఏర్పడి పని చేస్తాయి. బుద్ధి లేకపోతే ఇంద్రియములు చేసినా తెలియదు. కన్ను చూసినా, బుద్ధికీ మనసుకూ అనుసంధానం లేనప్పుడు ఎదురుగా ఉన్నా గమనించలేము. బుద్ధినీ మనసునూ పరమాత్మ యందు లగ్నం చేస్తే ఏమి చూసినా మనకి అంటదు. అందుకే విద్యాతురానాం నరుచిః నపక్వం అంటారు. రాజసాహంకారం వలన అనుగ్రహించబడి, సాత్వికాహం కారము వలన పుట్టినవి ఇంద్రియాలు.


సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹


🌹 Kapila Gita - 73 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj 🌴 2. Fundamental Principles of Material Nature - 29 🌴 29. taijasāt tu vikurvāṇād buddhi-tattvam abhūt sati dravya-sphuraṇa-vijñānam indriyāṇām anugrahaḥ By transformation of the false ego in passion, intelligence takes birth, O virtuous lady. The functions of intelligence are to help in ascertaining the nature of objects when they come into view, and to help the senses. Intelligence is the discriminating power to understand an object, and it helps the senses make choices. Therefore intelligence is supposed to be the master of the senses. The perfection of intelligence is attained when one becomes fixed in the activities of Divine consciousness. By the proper use of intelligence one's consciousness is expanded into Divine Consciousness. Continues... 🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page