top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 81 / Kapila Gita - 81


🌹. కపిల గీత - 81 / Kapila Gita - 81🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 37 🌴


37. చాలనం వ్యూహనం ప్రాప్తిర్నేతృత్వం ద్రవ్యశబ్దయోః|

సర్వేంద్రియాణామాత్మత్వం వాయోః కర్మాభిలక్షణమ్॥


చెట్లకొమ్మలను చలింపజేయుటకు, తృణాదులను ఒకచోట చేర్చుట, సర్వత్ర వ్యాపించుట, వస్తువులయొక్క వాసనలను (గంధమును) ఘ్రాణేంద్రియము (ముక్కు) కడకును. శబ్దముసు శ్రోత్రేంద్రియము (చెవులు) కడకును చేర్చుట అట్లే సమస్త ఇంద్రియములకును కార్యశక్తిని కలిగించుట అనునవి వాయువుయొక్క వృత్తుల (కార్యముల) లక్షణములు.


ప్రతీ దాన్ని కదిలించడం గాలి యొక్క గుణం. దగ్గరగా ఉన్న దాన్ని విడదీసేదీ, దూరముగా ఉన్నవాటిని దగ్గరకు చేసేదీ వాయువు. ఈ రెండిటికీ కదలిక కావాలి. ద్రవ్యమునూ(గంధమును) శబ్దమునూ మన దగ్గరకు తీసుకుని వస్తుంది. అన్ని ఇంద్రియములనూ ధరించేది వాయువు. మన ఇంద్రియాలు అన్నీ ఆకాశములోనే ఉన్నాయి. అవి కింద పడకుండా ఆపేది వాయువు. అలాగే అన్ని గోళాలు ఆకాశములో ఉన్నాయి కానీ కింద పడవు, అలాగే అవయవ రంధ్రాలలో ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలను ధరించేది వాయువు. చక్షురింద్రియం, ఘ్రానేంద్రియం వంటివి ఇంకో గోళం (అవయవము) లోకి వెళ్ళకుండా ఉండటానికి కారణం వాయువు.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 81 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 37 🌴


37. cālanaṁ vyūhanaṁ prāptir netṛtvaṁ dravya-śabdayoḥ

sarvendriyāṇām ātmatvaṁ vāyoḥ karmābhilakṣaṇam


The action of the air is exhibited in movements, mixing, allowing approach to the objects of sound and other sense perceptions, and providing for the proper functioning of all other senses.


We can perceive the action of the air when the branches of a tree move or when dry leaves on the ground collect together. Similarly, it is only by the action of the air that a body moves, and when the air circulation is impeded, many diseases result. Paralysis, nervous breakdowns, madness and many other diseases are actually due to an insufficient circulation of air. In the Āyur-vedic system these diseases are treated on the basis of air circulation. If from the beginning one takes care of the process of air circulation, such diseases cannot take place.


From the Āyur-veda as well as from the Śrīmad-Bhāgavatam it is clear that so many activities are going on internally and externally because of air alone, and as soon as there is some deficiency in the air circulation, these activities cannot take place. Here it is clearly stated, netṛtvaṁ dravya-śabdayoḥ. Our sense of proprietorship over action is also due to the activity of the air. If the air circulation is stifled, we cannot approach a place after hearing. If someone calls us, we hear the sound because of the air circulation, and we approach that sound or the place from which the sound comes. It is clearly said in this verse that these are all movements of the air. The ability to detect odors is also due to the action of the air.


Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

コメント


Post: Blog2 Post
bottom of page