🌹. కపిల గీత - 82 / Kapila Gita - 82🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 38 🌴
38. వాయోశ్చ స్పర్శతన్మాత్రాద్రూపం దైవేరితాదభూత్|
సముత్థితం తతస్తేజశ్చక్షూరూపోపలంభనమ్॥
అనంతరము దైవప్రేరణచే స్పర్శతన్మాత్రగా గల వాయువు వికారము చెందెను. తత్ఫలితముగా (వాయువు నుండి) రూపతన్మాత్ర ఉత్పన్నమాయెను. దానినుండి తేజస్సు- అగ్నిమహాభూతము పుట్టినది. అట్లే రూపములను ప్రాప్తింప జేయు నేత్రేంద్రియము ఉద్భవించినది.
స్పర్శ తన్మాత్ర నుండి ఆవిర్భవించిన వాయువు నుండి ఆవిర్భవించినది రూప తన్మాత్రం. దాని నుండి అగ్ని పుడుతుంది. చక్షురింద్రియం ఈ రూపాన్ని గ్రహిస్తుంది. చక్షురింద్రియం సూర్యాధిష్టం. సుర్ర్యభగవానునిలో ఉన్నవాడు, అంతర్యామిగా ఉన్నవాడు, చక్షురింద్రియములో ఉన్నవాడూ ఒకడే. అందుకే భగవానుని ఆరాధించడానికి కనులు మూసుకున్నా తెరుచుకుని ఉన్నా కనపడతాడు భగవానుడు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 82 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 2. Fundamental Principles of Material Nature - 38 🌴
38. vāyoś ca sparśa-tanmātrād rūpaṁ daiveritād abhūt
samutthitaṁ tatas tejaś cakṣū rūpopalambhanam
By interactions of the air and the sensations of touch, one receives different forms according to destiny. By evolution of such forms, there is fire, and the eye sees different forms in color.
Because of destiny, the touch sensation, the interactions of air, and the situation of the mind, which is produced of the ethereal element, one receives a body according to his previous activities. Needless to say, a living entity transmigrates from one form to another. His form changes according to destiny and by the arrangement of a superior authority which controls the interaction of air and the mental situation. Form is the combination of different types of sense perception. Predestined activities are the plans of the mental situation and the interaction of air.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments