top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 83 / Kapila Gita - 83


🌹. కపిల గీత - 83 / Kapila Gita - 83🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 39 🌴


39. ద్రవ్యాకృతిత్వం గుణతా వ్యక్తి సంస్థాత్వమేవ చ|

తేజస్త్వం తేజసః సాధ్వి రూపమాత్రస్య వృత్తయః॥


పూజ్యురాలా! వస్తువులయొక్క ఆకారము, వాటి గుణములను తెలిసికొనునట్లు చేయుట అనగా వస్తువుల ఆకారము, పరిమాణములు మొదలగు వాని యొక్క జ్ఞాపకమును కలిగించుట, తేజోరూపముగా భాసించుట అనునవి రూపతన్మాత్ర యొక్క వృత్తులు.


చక్షురింద్రియం రూపాన్ని గ్రహిస్తుంది. రూపం అంటే ప్రతీ ద్రవ్యానికి ఒక ఆకారం కలిగించేది. ఒక వస్తువు గురించి చెబుతున్న్నామంటే దాని ఆకారం బట్టే చెబుతాము. ద్రవ్యమునకు ఆకారాన్ని ఆపాదించేది రూపం.


గుణతా: అంటే ద్రవ్య ఆశ్రయత్వం. ఆధారము లేకుండా ఆధేయం ఉండదు. ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేది గుణం. గుణము ద్రవ్యము లేకుండా విడిగా ఉండదు. రూపం అంటే గుణం. గుణం అంటే ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేది.


ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తినుండి వేరు చేసేది రూపము. రూపముకు ఈ మూడు గుణాలు ఉన్నాయి.


1. ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటున్నది, 2. ఒక ద్రవ్యానికి ఆకారాన్ని ఏర్పరుస్తున్నది, 3. ఒక ద్రవ్యాన్ని ఇంకో ద్రవ్యము నించి వేరు చేసి చూపుతుంది. దీన్నే తేజత్వం అంటాము. ఇవి రూపము యొక్క వ్యాపారము.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 83 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 39 🌴


39. dravyākṛtitvaṁ guṇatā vyakti-saṁsthātvam eva ca

tejastvaṁ tejasaḥ sādhvi rūpa-mātrasya vṛttayaḥ


My dear mother, the characteristics of form are understood by dimension, quality and individuality. The form of fire is appreciated by its effulgence.


Every form that we appreciate has its particular dimensions and characteristics. The quality of a particular object is appreciated by its utility. But the form of sound is independent. Forms which are invisible can be understood only by touch; that is the independent appreciation of invisible form. Visible forms are understood by analytical study of their constitution. The constitution of a certain object is appreciated by its internal action. For example, the form of salt is appreciated by the interaction of salty tastes, and the form of sugar is appreciated by the interaction of sweet tastes. Tastes and qualitative constitution are the basic principles in understanding the form of an object.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

0 views0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page