top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 84 / Kapila Gita - 84


🌹. కపిల గీత - 84 / Kapila Gita - 84🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 40 🌴


40. ద్యోతనం పచనం పానమదనం హిమమర్ఢనమ్|

తేజసో వృత్తయస్త్వేతాః శోషణం క్షుత్తృదేవచ॥


ప్రకాశించుట, పక్వమొనర్చుట, చల్లదనమును దూరము చేయుట, ఎండింప జేయుట, దప్పిక కలిగించుట, ఆకలిదప్పుల నివారణకై భోజన, పానాదులను చేయించుట అనునవి తేజస్సు యొక్క వృత్తులు.


పరమాత్మే మనము తిన్న దాన్నీ, తాగిన దానినీ, అగ్ని రూపములో ఉండి స్వీకరిస్తున్నాడు (అహం వైశ్వానరో భూతవా...). జఠ్రాగ్ని బాగ పని చేయాలంటే శ్రమపడాలి. అప్పుడు తిన్నది బాగా జీర్ణమవుతుంది. పరిశ్రమ వలన అగ్నిలో వాయువులో శక్తి పెరుగుతుంది. మన పెరుగుదల, మనం తీసుకున్న ఆహారం అరుగుదల వలన. అరగాలంటే జఠరాగ్ని బాగా పని చేయాలి. శరీరములో ఏ ప్రదేశానికి ఎంత కావాలో అంత పంపాలి. అలా పంపేది వాయువూ, అగ్ని. వాటి శక్తి తగ్గితే అవి పంపవు. అగ్ని పని చేయకపోతేనే మనకి ఆయా రోగాలు వస్తాయి. అందుకే పరమాత్మని ఆయా రూపాలలో మనం ఆరాధించాలి.

సశేషం.. 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Kapila Gita - 84 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj 🌴 2. Fundamental Principles of Material Nature - 40 🌴 40. dyotanaṁ pacanaṁ pānam adanaṁ hima-mardanam tejaso vṛttayas tv etāḥ śoṣaṇaṁ kṣut tṛḍ eva ca Fire is appreciated by its light and by its ability to cook, to digest, to destroy cold, to evaporate, and to give rise to hunger, thirst, eating and drinking. The first symptoms of fire are distribution of light and heat, and the existence of fire is also perceived in the stomach. Without fire we cannot digest what we eat. Without digestion there is no hunger and thirst or power to eat and drink. When there is insufficient hunger and thirst, it is understood that there is a shortage of fire within the stomach, and the Āyur-vedic treatment is performed in connection with the fire element, agni-māndyam. Since fire is increased by the secretion of bile, the treatment is to increase bile secretion. The Āyur-vedic treatment thus corroborates the statements in Śrīmad-Bhāgavatam. The characteristic of fire in subduing the influence of cold is known to everyone. Severe cold can always be counteracted by fire.

Continues... 🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Comments


Post: Blog2 Post
bottom of page