top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 89 / Kapila Gita - 89


🌹. కపిల గీత - 89 / Kapila Gita - 89🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 45 🌴


45. కరంభపూతిసౌరభ్యశాంతోగ్రామ్లాదిభిఃపృథక్|

ద్రవ్యావయవవైషమ్యాద్గంధ ఏకో విభిద్యతే॥


గంధము ఒకటేయైనను పరస్పరము కలిసియున్న ద్రవ్యభాగముల న్యూనాధిక్యమువలన అది మిశ్రితగంధమై దుర్గంధము, సుగంధము, మృదువు, తీవ్రము,పులుపు మొదలగు పలురీతులుగా రూపొందెను.


పూతి గంధం అంటే దుర్గంధం.


శాంతం - ప్రశాంతముగా ఉండేది.


ఉగ్ర గంధం - ఉదా: ఉల్లి వంటివి తరిగితే వచ్చే గంధము వలన కళ్ళు నీరు కారతాయి.


గ్రాంల - పులిస్తే వచ్చే గంధము. కరంభం - ఇది అన్ని గంధముల కలయిక.


అన్నము రెండు రోజులు ఉంచితే అందులోకి వేరే ద్రవ్యాలు వచ్చి చేరతాయి. నిప్పూ నీరుతోనే అన్నం వండుతాము. ఆ అన్నం సాయంత్రానికి మెత్తబడుతుంది, మర్నాటికి నీరు వస్తుంది, తరువాత వాసన వస్తుంది, ఆ తరువాత సాయంత్రానికి పురుగులు వస్తాయి. ఏ ద్రవ్యం యొక్క పదార్ధములు ఏ ఏ సమయాలలో ఏ మోతాదులలో కలవాలో కలిస్తే పదార్థమవుతుంది. ఉన్న గంధము ఒకటే గానీ, ఆయా ద్రవ్యముల అవయవాల వైషమ్యాలని బట్టి వేరుగా అనిపిస్తుంది. ఆశ్రయాన్ని బట్టి గంధం మారుతుంది గానీ, గంధము అన్నది ఒకటే.



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 89 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 2. Fundamental Principles of Material Nature - 45 🌴


45. karambha-pūti-saurabhya śāntogrāmlādibhiḥ pṛthak

dravyāvayava-vaiṣamyād gandha eko vibhidyate


Odor, although one, becomes many—as mixed, offensive, fragrant, mild, strong, acidic and so on—according to the proportions of associated substances.


Mixed smell is sometimes perceived in foodstuffs prepared from various ingredients, such as vegetables mixed with different kinds of spices and asafoetida. Bad odors are perceived in filthy places, good smells are perceived from camphor, menthol and similar other products, pungent smells are perceived from garlic and onions, and acidic smells are perceived from turmeric and similar sour substances. The original aroma is the odor emanating from the earth, and when it is mixed with different substances, this odor appears in different ways.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2 Post
bottom of page