🌹. కపిల గీత - 93 / Kapila Gita - 93🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 49 🌴
49. పరస్య దృశ్యతే ధర్మో హ్యపరస్మిన్సమన్వయాత్
అతో విశేషో భావానాం భూమావేవోపలక్ష్యతే
వాయువు మొదలగు కార్యతత్త్వములయందు ఆకాశాది కారణతత్త్వములు గూడ ఉండుట వలన వాటి గుణములను కూడ క్రమమగా గ్రహింపనగును. కనుక పంచ మహాభూతములయొక్క గుణములైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు కేవలము పృథ్వియందు మాత్రమే గోచరించును. ఆకాశమునందు శబ్దగుణము ఒక్కటే ఉండును. వాయువునందు శబ్ద, స్పర్శ గుణములు రెండు ఉండును. తేజస్సునందు (అగ్నియందు) శబ్ద, స్పర్శ, రూప గుణములు మూడు ఉండును. జలమునందు శబ్ద, స్పర్శ, రూప, రస గుణములు నాలుగు ఉండును. పృథ్వియందు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణములు ఐదును ఉండును
కార్యము యందు కారణ ధర్మం ఉంటుంది. అలా ఉంటుంది అని ఒప్పుకోకుంటే భూమిలో అయిదు గుణాలు ఉండటానికి అవకాశము దొరకదు. భూమిలో శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉన్నాయి. అందుకే అన్ని విశేష గుణాలూ భూమి యందు కనపడుతున్నాయి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 93 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 2. Fundamental Principles of Material Nature - 49 🌴
49. parasya dṛśyate dharmo hy aparasmin samanvayāt
ato viśeṣo bhāvānāṁ bhūmāv evopalakṣyate
Since the cause exists in its effect as well, the characteristics of the former are observed in the latter. That is why the peculiarities of all the elements exist in the earth alone.
Sound is the cause of the sky, sky is the cause of the air, air is the cause of fire, fire is the cause of water, and water is the cause of earth. In the sky there is only sound; in the air there are sound and touch; in the fire there are sound, touch and form; in water there are sound, touch, form and taste; and in the earth there are sound, touch, form, taste and smell. Therefore earth is the reservoir of all the qualities of the other elements. Earth is the sum total of all other elements. The earth has all five qualities of the elements, water has four qualities, fire has three, air has two, and the sky has only one quality, sound.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments