top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 637/ Vishnu Sahasranama Contemplation - 637


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 637/ Vishnu Sahasranama Contemplation - 637🌹


🌻637. విశోధనః, विशोधनः, Viśodhanaḥ🌻


ఓం విశోధనాయ నమః | ॐ विशोधनाय नमः | OM Viśodhanāya namaḥ


విశోధనః, विशोधनः, Viśodhanaḥ


స్మృతిమాత్రేణ పాపానాం (శోధనాత్‍) క్షపణాత్ స విశోధనః


తన స్మరణ మాత్రము చేతనే పాపములను నశింప జేసి పాపులను విశుద్ధులనుగా చేయువాడు విశోధనః



:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::


సీ.బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని కీలలు హరినామ కీర్తనములుగురుతల్ప కల్మష క్రూర సర్పములకుఁ గేకులు హరినామ కీర్తనములుతపనీయ చౌర్య సంతమసంబుకను సూర్య కిరణముల్ హరినామ కీర్తనములుమధుపాన కిల్బిష మదనాగ సమితికిఁ గేసరుల్ హరినామ కీర్తనములుగీ.మహిత యోగోగ్ర నిత్యసమాధి విధుల, నలరు బ్రహ్మాది సురులకు నందరానిభూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య, ఖేలనంబులు హరినామ కీర్తనములు. (118)


భగవంతుని నామసంకీర్తనలు బ్రహ్మహత్య మొదలైన పాపాములు అనే అడవులకు అగ్నిజ్వాలలు. హరినామ కీర్తనలు గురుద్రోహమనే ఘోర సర్పాలకు నెమళ్ళు. భగవన్నామ కీర్తనలు బంగారమును దోంగిలించడమనే మహా పాపరూపమైన చీకట్లను పోగొట్టే సూర్యకిరణములు. హరినామ కీర్తనములు మధుపాన మహాపాపమనే మదపుటేనుగులను సంహరించే సింహాలు. మహిమతోగూడిన యోగసమాధి విధులతో ఒప్పే బ్రహ్మ మొదలగు దేవతలకు సైతము అందరాని మోక్ష సామ్రాజ్య వైభవ విలాసములు హరినామ కీర్తనములు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 637🌹


🌻637.Viśodhanaḥ🌻


OM Viśodhanāya namaḥ



स्मृतिमात्रेण पापानां (शोधनात्‍) क्षपणात् स विशोधनः /


Smr‌timātreṇa pāpānāṃ (śodhanātˈ) kṣapaṇāt sa Viśodhanaḥ



Since by mere remembrance He erases the sins, he purifies the sinners and hence He is Viśodhanaḥ.



:: श्रीमद्भागवते षष्ठस्कन्धे द्वितीयोऽध्यायः ::


अयम् हि कृतनिर्वेशो जन्मकोट्यंहसामपि ।

यद्व्याजहार विवशो नाम स्वस्त्ययनं हरेः ॥ ७ ॥



Śrīmad Bhāgavata - Canto 6, Chapter 2


Ayam hi kr‌tanirveśo janmakoṭyaṃhasāmapi,

Yadvyājahāra vivaśo nāma svastyayanaṃ hareḥ. 7.


(Ajāmiḷa) has already atoned for all his sinful actions. Indeed, he has atoned not only for sins performed in one life but for those performed in millions of lives, for in a helpless condition he chanted the holy name of Nārāyaṇa. Even though he did not chant purely, he chanted without offense, and therefore he is now pure and eligible for liberation.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥


అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥


Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹



Comments


Post: Blog2 Post
bottom of page