🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 644 / Vishnu Sahasranama Contemplation - 644🌹
🌻644. శౌరిః, शौरिः, Śauriḥ🌻
ఓం శౌరయే నమః | ॐ शौरये नमः | OM Śauraye namaḥ
శౌరిః, शौरिः, Śauriḥ
శూరకులోద్భవత్వాచ్ఛౌరిరుచ్యతే
శూరుడు అను యాదవుని వంశమున పురుష సంతతిగా జనించినందున శౌరిః. (వాసుదేవుడు వసుదేవుని పుత్రుడు. వసుదేవుని తండ్రి శూరసేనుడు)
:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
చ. హరి దన నాభిపంకరుహమందు జనించిన యట్టి భారతీ
శ్వరుఁ డతిభక్తి వేఁడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై
పరఁగ జనించి భూభారముఁ బాపిన భవ్యులు రేవతీందిరా
వరు లట శూరసేనుని నివాసమునన్ సుఖ మున్నవారలే? (49)
తన నాభి కమలము నుండి పుట్టిన బ్రహ్మదేవుడు పరమభక్తితో ప్రార్థింపగా శ్రీహరి - బలరాముడుగా, కృష్ణుడుగా యదువంశములో ఉదయించినాడు. అటుల పుట్టి భూభారమును పోగొట్టిన మహోదయులు, రేవతీరుక్మిణీ హృదయప్రియులు అయిన రామకృష్ణులు తమ తాతగారు అయిన శూరసేనుని గృహములో సుఖముగా ఉన్నారా?
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 644🌹
🌻644. Śauriḥ🌻
OM Śauraye namaḥ
शूरकुलोद्भवत्वाच्छौरिरुच्यते / Śūrakulodbhavatvācchaurirucyate
Since the Lord took birth in Śūra clan, He is called Śauriḥ. (Vasudeva is the father of Lord Vāsudeva; Vasudeva is son of Śūrasena).
:: श्रीमद्भागवते दशमस्कन्धे द्वितीयोऽध्यायः ::
ततो जग्न्मङ्गलमच्युतांशं समाहितं शूरसुतेन देवी ।
दधार सर्वात्मकमात्मभूतं काष्ठा यथानन्दकरं मनस्तः ॥ १८ ॥
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 2
Tato jagnmaṃgalamacyutāṃśaṃ samāhitaṃ śūrasutena devī,
Dadhāra sarvātmakamātmabhūtaṃ kāṣṭhā yathānaṃdakaraṃ manastaḥ. 18.
Thereafter, accompanied by plenary expansions, the fully opulent Lord, who is all-auspicious for the entire universe, was transferred from the mind of Vasudeva to the mind of Devakī. Devakī, having thus been initiated by Vasudeva, became beautiful by carrying Lord Krsna, the original consciousness for everyone, the cause of all causes, within the core of her heart, just as the east becomes beautiful by carrying the rising moon.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥
కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥
Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments