🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 164 / Agni Maha Purana - 164 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 50
🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 4 🌻
రుద్రచర్చిక గజచర్మధరించి ఎడమ చేతిలో కాపాలము, కర్తరి ధరించి, కుడి చేతిలో శూల-పాశములను ధరించి, ముఖమును. ఒక పాదమును ఎత్తి ఉండును. ఈ దేవి అష్ట భూజారూపమున గూడ పూజింపబడును. మండమాలను డమరువును ధరించినపుడు ఆమెయే 'రుద్రచాముండ'అని చెప్పబడును. ఆమె నాట్యము చేయును. అందుచే 'నట్యేశ్వరి' అని కూడ ఈమెకు పేరు.
ఈమె నాలుగు ముఖములతో ఆసనముపై కూర్చున్నప్పుడు ''చతుర్ముఖీ మహాలక్ష్మీ'' (మహాలక్ష్మి యొక్క తామస మూర్తి) అని చెప్పబడును. ఈమె తన చేతులలో నున్న నరులను గుఱ్ఱములను, దున్నలను, ఏనుగులను తినుచుండును. సిద్ధ చాముండకు పది భుజడములు, మూడు నేత్రములు ఉండును. కుడి చేతులలో శస్త్రమును, ఖడ్గమును, మూడు డమరువులను ధరించును, ఎడమ చేతులలో గంట, ఖేటకము, మంచపుకోడు, త్రిశూలము, (డాలు) ధరించి యుండును.
సిద్ధ యోగీశ్వరీ దేవి సంపూర్ణ సిద్ధినిచ్చును. ఈదేవికి స్వరూపమైన మరియొక సక్తి యున్నధి, ఈమె శరీరకాంతి ఎఱ్ఱగా నుండును. పాశాంకుశములను ధరించిన ఈమెకు 'ఖైరవి' అని పేరు. రూప విద్యాదేవికి పండ్రెండు భుజములుండును. ఈ దేవులందరును శ్మశానములో ఆవిర్భవింతురు. భయంకరముగ నుందురు, ఈ ఎనమండుగురు దేవులకును (రుద్ర, చండ, అష్టభుజ లేతా రుద్ర చాముండ, సిద్దయోగీశ్వరి భైరవి, రూపవిద్య) ''అంబాష్టకము'' అని పేరు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 164 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 50
🌻Characteristics of an image of the Goddess - 4 🌻
30-31. (The image of) Rudracarcikā (the manifestation of) the goddess may have a bow adorned by the plume of peacock, club, banner, protective posture, cock, skull, scissors, trident and noose in the right and left hands. (She should also be) clad in the elephant hide, with her leg raised up and the little drum placed on the head.
32. Hence she (is known as) Rudracāmuṇḍā, the goddess of dancing and one who is dancing. This (goddess herself), having four faces and in the sitting posture (is known as) Mahālakṣmī.
33-34. (The goddess) having ten hands and three eyes (holding) (different) weapons, sword and ḍamaru (little drum) in the right hand and the bell, club, staff with a skull at one end and trident in the left (hand) and eating men, horses, buffaloes and elephants held in the hand is called Siddhacāmuṇḍā.
35. That goddess accomplishes everything and is (known (as) Siddhayogeśvarī. She is also represented in another form endowed with the noose and goad and red (in complexion).
36. (The goddess) Bhairavī who has an embodiment of beauty is endowed with twelve arms. These are (all) (spoken as) fierce (forms) arising from the cremation ground. The above are remembered as the eight forms of the goddess.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments