top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 165 / Agni Maha Purana - 165


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 165 / Agni Maha Purana - 165 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 50


🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 5 🌻


క్షమాదేవి చుట్టు ఆడ నక్కలుండును. వృద్ధ స్త్రీరూపములో నున్న ఆమెకు రెండు హస్తములుండును. నోరు తెరచి ఉండును, పండ్లు ఎత్తుగా ఉండును, మోకాళ్లు చేయి ఆనుకొని భూమిపై కూర్చుండును. ఈమె ఉపాసకులకు కల్యాణప్రదాయిని, యక్షిణిలు కండ్లు తెరచికొని (మూయకుండ చూచుచు) ఉందురు. అప్సరసలు సర్వదా సౌందర్యవతులు, వీళ్ళ కండ్లు పచ్చగా ఉండును.


నందీశ్వరునకు ఒక చేతిలో అక్షమాల, రెండవ చేతిలో త్రిశూలము ఉండును. మహాకాలుని చేతిలో కత్తి, రెండవ చేతిలో ఖండితమైన సిరస్సు, మూడవ చేతిలో శూలము, నాల్గవ చేతిలో ఖేడము ఉండవలెను. కృశ##మైన శరీరము గల భృంగి నృత్యముద్రలో నుండును. ఈతని శిరస్సు కూష్మాండమువలె స్థూలమై బట్టతలయై ఉండును. వీరభద్రడు మొదలగు గణములకు ఏనుగులు, గోవుల వంటి చెవులు ముఖములు ఉండును.


ఘంటాకర్ణునకు పదునెనిమిది భుజములుండును. అతడు పాపములను, రోగములను నశింపచేయును. ఎడమ ప్రక్కన నున్న ఎనిమిది చేతులలో వజ్ర-ఖడ్గ-దండ-చక్ర-బాణ-ముసల-అంకుశ-ముద్గరములను, కుడి ప్రక్కనున్న ఎనిమిది చేతులలో తర్జనీ-ఖేట-శక్తి-ముండ-పాశ-ధనుస్‌-ఘంటా-కుఠారములను ధరించును. మిగిలిన రెండు చేతులతో త్రిశూలమును పట్టుకొని యుండును. ఘంటామాలచే అలంకృతుడగు ఘంటా కర్ణుడు విస్ఫోటకమును నివారించును.


అగ్నేయ మహాపురాణమునందు దేవీ ప్రతిమాలక్షణమను ఏబదియవ అధ్యాయము సమాప్తము.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 165 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 50


🌻Characteristics of an image of the Goddess - 5 🌻


37. (The goddess) Kṣamā (Forbearance) (should be) surrounded by jackals, old, having two arms, and widely opened mouth. (The goddess) Kṣemaṅkarī (Benevolent) may have protruding teeth and be resting her knees on the ground.


38. The wives of semi-gods should be made to have long and motionless eyes. The Śākinīs (female attendants on Goddess Durgā) should be made to have oblique vision. The Mahāramyas should have yellow eyes. The (images of) nymphs should always be made beautiful.


39. (The form of) Nandīśa the bull, the door-keeper (of the goddess), should carry a rosary and a trident. (The image of) Mahākāla (a form of Śiva as the destroyer) may have a sword, human skull, trident and club.


40. (The form of) Bhṛṅgin (an attendant of Śiva) should have an emaciated body. Kuṣmāṇḍa (another attendant of Śiva) should have a stout and dwarf form dancing. Vīrabhadra and other attendants (of Śiva) should have ears and faces of elephants, cows, etc.


41. Ghaṇṭākarṇa (an attendant of Śiva) form should have eighteen hands crushing the accrued sin, (holding weapons) thunderbolt, sword, club, disc, arrow, mace, goad and hammer in the right hand and tarjanī (a weapon), club, dart, human skull, noose, bow, bell and axe on the left and a trident in the (remaining) two hands and wearing a garland of bells and crushing the eruptive diseases.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page