top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 426 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 426 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।

నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀


🌻 426. 'పంచకోశాంతర స్థితా' - 3 🌻


కోశ 'శుద్ధి గావించు కొనుచు, సత్త్వ గుణమును ఆశ్రయించి నిత్య జీవితమును దివ్యారాధనగ సాగించు వారికి చిత్ శక్తి స్వరూపము సాన్నిధ్య మిచ్చును. జీవుడు చిత్ శక్తి స్వరూపుడే. అట్టి జీవుడు పరాశక్తిని ధ్యానించుటలో బ్రహ్మా నందము పొందగలడు. శ్రీ చక్ర ఆరాధన గావించువారు జ్ఞానావరణమందు, ఐదుగురు దేవతలను ఐదు కోశములకు సంబంధించి పూజింతురు. ఈ ఐదుగురు దేవతలు వరుసగ శ్రీవిద్య, పరంజ్యోతి, పరా, నిష్కళా, శాంభవి అని పేర్కొనబడిరి. ఇందు శ్రీవిద్య మధ్యబిందువు. మిగిలిన నలుగురు దేవతలు నాలుగు స్థానముల యందు చుట్టునూ యుందురు. నలుగురునూ సృష్ట్యాది కార్యములలో పాల్గొందురు. శ్రీవిద్య బిందువు నందుండును. ఈ బిందువు శభోత్పత్తి స్థానము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita

Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻


🌻 426. 'Panchakoshantarah Stitha' - 3 🌻


For the one who constantly purifies his layers , and who lives his daily life as penance, they shall find life energy( chit Shakthi) filling them. Jiva is the embodiment of Chit Shakti. Such a living being can enjoy the eternal bliss by meditating on Parashakti. Devotees of Sri Chakra worship the five deities in relation to the five bodies( layers) in the Jnanavarana. These five deities are mentioned as Srividya, Paramjyoti, Para, Nishkala and Sambhavi respectively. In this Srividya is the middle point. The remaining four deities surround in four points. All four participate in the activities of creation. There is a point of Srividya Bindu. This point is the place of creation of bliss.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page