top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 427 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 427 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।

నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀


🌻 427. 'నిస్సీమ మహిమ’ - 2 🌻


శ్రీమాత మహిమను కొలతలు వేయుటకు పూనుకొనిన త్రిమూర్తులు ఆమె మహిమను తెలియుటలో భయమును చెందిరి. తమ తమ స్థానములకు పరిమితులై కర్తవ్యోన్ముఖులైరి. జీవులు శ్రీమాత స్వరూపులే గనుక వారు కూడ వారి దేహ పరిమాణమునకు లొంగి యుండవలసిన అవసరము లేదు. జీవుని దేహము సృష్టివంటిది. అందు జీవుడు దైవాంశ. అతడు కూడ నిజమునకు దేహపరిమితులను దాటి యుండవచ్చును.


అతడి మహిమ కూడ దూర తీరములకు వ్యాపించ వచ్చును. శ్రీమాత భక్తులగు మహాత్ములట్లే యుందురు. బ్రహ్మర్షులు, మహర్షులు, రాజర్షులు వారి యోగ తపో బలములచే తీరముల నతిక్రమించి మహిమ చూపుచుండుట తెలిసిన విషయమే. ఇట్లు జీవులందరును కూడ నిజమునకు పరిమితులు లేనివారే. ఉన్నదని భావించుటచే అట్లు ఇమిడి యుందురు. వారి యందు జ్ఞానము వికసించు చుండగా వ్యాప్తి చెందుచు నుందురు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita

Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻


🌻 427. 'Nisseema Mahima' - 2 🌻


Trimurthi( The Holy triumvirate) who tried to measure Srimata's glory got scared upon knowing Her glory. They were bound by their duty and limited to their respective positions. As living beings are forms of Sri Mata, there is no need for them to be limited by the bodies. Jiva's body is like creation. In that, the creature is divine. He may also be beyond the physical limits of his body.


Their glory too can spread to distant shores. Devotees of Sri Mata who are Mahatmas are like this. It is a well-known fact that Brahmarshis, Maharshis and Rajarshis have shown their powers and glory well beyond their physical existence. All such living beings are also limitless. They are limited because they think they are. As knowledge blossoms in them, they walk towards omniscience .



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comentários


Post: Blog2 Post
bottom of page