*🌹 . శ్రీ శివ మహా పురాణము - 570 / Sri Siva Maha Purana - 570 🌹* రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 55 🌴* *🌻. శివ పార్వతుల కైలాసగమనము - 1 🌻* బ్రహ్మ ఇట్లు పలికెను- ఆ బ్రాహ్మణ స్త్రీ పార్వతీ దేవికి ఆ వ్రతమును నేర్పి మేనను పిలిచి 'ఈమెను యాత్రకు పంపుము' అని చెప్పెను (1). ఆమె అటులనే అని పలికి ప్రేమకు వశురాలై వియోగదుఃఖముచే పీడితురాలైననూ ధైర్యమును వహించి కాళిని పిలిచెను (2). ఆమె పార్వతిని పలుమార్లు కౌగిలించుకొని ఏడ్చెను. పార్వతి కూడ దయను కలిగించు మాటలను పలుకుతూ బిగ్గరగా ఏడ్చెను (3). హిమవంతుని పత్ని మరియు పార్వతి దుఃఖపీడితులై మూర్ఛను పొందిరి. పార్వతి ఏడ్చుటచే దేవపత్నులు కూడ మూర్ఛను పొందిరి (4). స్త్రీలందరు ఏడ్చుచుండురి. సర్వము జడమాయెనా యున్నట్లుండెను. యోగీశ్వరుడగు శివుడే వెళ్ల బోవుచూ స్వయముగా రోదించెను. ఆ పరప్రభుడు ధుఃఖించగా, ఇతరుల మాట చెప్పునది ఏమి గలదు? (5) ఇంతలో అచటకు హిమవంతుడు కుమారులందరితో, మంత్రులతో మరియు మహాబ్రాహ్మములతో గూడి వెంటనే విచ్చేసెను(6). ఆయన కుమార్తెను గుండెలకు హత్తుకొని, 'నీవు సర్వమును శూన్యముగా చేసి ఎచటకు వెళ్లుచున్నావు?' అని పలికి అనేక పర్యాయములు స్వయముగా మోహముచే రోదించెను (7). అపుడు జ్ఞానిశ్రేష్ఠుడగు పురోహితుడు బ్రాహ్మణులతో గూడి సుఖకరముగా అధ్యాత్య విద్యను దయతో వారందరికి బోధించెను (8). మహామాయ యగు పార్వతి భక్తితో తల్లిని, తండ్రిని, గురువును నమస్కరించి లోకాచారముననుసరిస్తూ పరిపరి విధముల బిగ్గరగా రోదించెను (9). పార్వతి రోదించుట తోడనే స్త్రీలందరు రోదించ మొదలిడిరి. తల్లియగు మేన, చెల్లెళ్లు, సోదరులు మరియు తండ్రి ప్రేమచే రోదించరి (10). సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 SRI SIVA MAHA PURANA - 570 🌹* *✍️ J.L. SHASTRI* *📚. Prasad Bharadwaj * *🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 55 🌴* *🌻 Śiva returns to Kailāsa - 1 🌻* Brahmā said:— 1. Thus instructing the goddess in the rites of a chaste lady, the brahmin lady told Menā while taking leave of her “Make arrangements for her journey”. 2. Saying “So be it” she became exasperated by her affection. Controlling herself a little she called Pārvatī to her when her agitation due to imminent separation became all the more unbearable. 3. Embracing her she cried loudly and frequently. Pārvatī too cried uttering piteous words. 4. The beloved of the mountain as well as her daughter became unconscious due to grief. The wives of the gods too fainted on hearing Pārvatī cry. 5. All the ladies cried. Everything became senseless. Who else, even the great lord, the leader of Yogins, cried at the time of departure. 6. In the meantime, Himavat came hurriedly along with his sons, ministers and brahmins. 7. Holding his dear daughter to his bosom and saying “Where are you going?” with frequent vague vacant glances, he cried due to his fascination. 8. Then the chief priest in the company of other brahmins enlightened everyone. The wise priest by his spiritual discourse was able to convince them easily. 9. With great devotion Pārvatī bowed to her parents and the preceptor. Following the worldly convention she cried aloud frequently. 10. When Pārvatī cried the ladies cried too, particularly the mother Menā, sisters and brothers. Continues.... 🌹🌹🌹🌹🌹 #శివమహాపురాణము #SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం https://facebook.com/groups/hindupuranas/ https://facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/
top of page
bottom of page
Commentaires