top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 . శ్రీ శివ మహా పురాణము - 572 / Sri Siva Maha Purana - 572 🌹




*🌹 . శ్రీ శివ మహా పురాణము - 572 / Sri Siva Maha Purana - 572 🌹* రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 55 🌴* *🌻. శివ పార్వతుల కైలాసగమనము - 3 🌻* తన నాథుడగు మహేశ్వరుని ఈ మాటను విని, శంకరునకు నిత్యప్రియురాలగు పార్వతి (సతీదేవి) చిరునవ్వుతో నిట్లనెను (20). పార్వతి ఇట్లు పలికెను - ఓ ప్రాణనాథా ! సర్వము నాకు గుర్తున్నది. ఇప్పుడు మీరు మౌనముగా నుండి ఇప్పటి సందర్భమునకు ఉచితమగు కార్యమును వెంటనే చేయుడు. మీకు నమస్కారమగు గాక! (21). బ్రహ్మ ఇట్లు పలికెను- అమృతధారలతో సమమగు ప్రియురాలి ఈ మాటను విని లోకాచారమునందు నిష్ఠగల విశ్వేశ్వరుడు మిక్కిలి సంతసించెను (22). శివుడు సామగ్రిని కూడగట్టి అనేక పదార్థములతో గూడిన మనోహరమగు భోజనము నారాయణుడు మొదలగు దేవతలకు ఏర్పాటు చేసెను (23). మరియు ఆ ప్రభుడు తన వివాహమునకు వచ్చిన వారందరికి రుచ్యమగు బహువిధముల అన్నమును ప్రీతితో భుజింపజేసెను (24). అనేక రత్నాభరణములతో ప్రకాశించు ఆ దేవతలు అందరు భుజించి భార్యలతో గణములతో కలిసి చంద్రశేఖరుని ప్రణమిల్లిరి (25). తరువాత దేవతలు ఇష్టములగు వాక్కులతో చక్కగా స్తుతించి ఆనందముతో ప్రదక్షిణము చేసి వివాహమును కొనియాడుతూ తమ ధామములకు వెళ్లిరి (26). ఓ మునీ! శివుడు లోకాచారముననుసరించి, విష్ణువు కశ్యపుని వలె, నారాయణుని నన్ను స్వయముగా ప్రణమిల్లెను (27). నేను శివుని కౌగిలించుకొని, ఆశీర్వదించి, మరల ఆయన పరబ్రహ్మయని గుర్తించి యెదుట ఉత్తమ మగు స్తోత్రమును చేసితిని (28). విష్ణువు నాతో కలసి శివుని అనుమతిని పొంది పార్వతీ పరమేశ్వరుల వివాహమును ప్రీతితో కొనియాడుతూ తన పరమధామమునకు వెళ్లెను (29). సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 SRI SIVA MAHA PURANA - 572 🌹* *✍️ J.L. SHASTRI* *📚. Prasad Bharadwaj * *🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 55 🌴* *🌻 Śiva returns to Kailāsa - 3 🌻* Brahmā said:— 20. On hearing the words of Śiva, Satī Pārvatī the beloved of Śiva replied smiling. Pārvatī said:— 21. O dear lord, I remember everything as well as the fact that you became a silent ascetic. Obeisance to you. Please do everything necessary now befitting the occasion. Brahmā said:— 22. On hearing her words as pleasing as the steady flow of nectar, Śiva rejoiced much, eagerly devoted to the way of the world. 23. Getting every requisite thing ready, he fed the gods including Viṣṇu and others with various pleasant things. 24. He fed all the others who had attended His marriage with juicy cooked food of various sorts. 25. After taking food the gods and the Gaṇas, with their womenfolk fully bedecked in gems and jewels bowed to the moon-crested lord. 26. After eulogising Him with pleasing words and circumambulating Him with joy they praised the marriage celebration and returned to their abodes. 27. O sage, Śiva Himself bowed to me and to Viṣṇu following the worldly convention as Viṣṇu had bowed to Kaśyapa. 28. Considering Him the supreme Brahman I eulogised him in the excellent manner after embracing him and offering him my benediction. 29. Viṣṇu and I with palms joined in reverence, took leave of them and praising the marriage of Śiva and Pārvatī went back to Viṣṇu’s abode. Continues.... 🌹🌹🌹🌹🌹 #శివమహాపురాణము #SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం https://facebook.com/groups/hindupuranas/ https://facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/

コメント


Post: Blog2 Post
bottom of page