🌹 . శ్రీ శివ మహా పురాణము - 575 / Sri Siva Maha Purana - 575 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴
🌻. శివ విహారము - 2 🌻
శివుడు పార్వతిని వివాహమాడి కైలాసమునకు వచ్చి మిక్కిలి శోభిల్లెను. ఆయన దేవకార్యమును గురించి, దేవకార్యములో జనులకు కలిగే పీడను గురించి ఆలోచించెను (10). భగవానుడు శివుడు కైలాసమునకు చేరుకోగానే, గణములందరు మిక్కిలి ఆనందముతో వివిధ సౌఖ్యములనను భవించిరి (11). శివుడు కైలాసమునకు రాగానే మహోత్సవము ప్రవర్తిల్లెను. దేవతలు ఆనందముతో నిండిన మనస్సు గలవారై తమ ధామములకు వెళ్లిరి (12).
అపుడు మంగళస్వరూపుడగు మహాదేవుడు పార్వతిని దోడ్కొని మహాదివ్యము, మనోహరము అగు నిర్జనస్థానమునకు వెళ్లెను (13). అచట పుష్పములతో, గంధముతో కూడినది, పరమాద్భుతమైనది, భోగవస్తువులతో కూడినది, శుభకరము, సంభోగమునకు అనుకూలమైనది అగు శయ్యను ఏర్పాటు చేసి (14), భగవాన్ శంభుడు అచట గిరిజతో గూడి దేవమానముచే వేయి సంవత్సరములు రమించెను. ఇతరుల మానమును రక్షించు (15) ఆ శివుడు తన లీలచే దుర్గాదేవి యొక్క శరీరమును స్పృశించినంత మాత్రాన మూర్ఛితుడయ్యెను. ఆమె శివుని స్పర్శచే మూర్ఛితురాలై రాత్రింబగళ్లను ఎరుగకుండెను (16).
ఓ పుణ్యాత్మా! లోకాచార ప్రవర్తకుడగు హరుడు భోగమగ్నుడై యుండగా చాలకాలము గడిచిపోయెను (17). ఓ కుమారా! అపుడు ఇంద్రుడు మొదలుగా గల దేవతలందరు మేరు పర్వతముపై ఒక చోట సమావేశ##మై పరిస్థితని చర్చించిరి (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 575 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴
🌻 The dalliance of Śiva - 2 🌻
10. Returning to Kailāsa after marrying Pārvatī, Śiva attained added lustre. He thought over the task of the gods and the pain of the people involved in the fulfilment of that task.
11. When Śiva returned to Kailāsa, the joyful Gaṇas made all arrangements for His happiness.
12. When Śiva returned to Kailāsa, there was great jubilation there. The gods returned to their realms with their minds full of joy.
13. Then taking Pārvatī, the daughter of the mountain, with Him, Śiva, the great Lord, went to a delightful brilliant isolated place.
14-15. Making a wonderful bed conducive to good sexual pleasure, rendered smooth and fragrant with flowers and sandal paste and auspiciously supplemented with objects of enjoyment, lord ‘Śiva’ the bestower of honour, indulged in dalliance with Pārvatī for a thousand years of god.[3]
16. In that divine sport at the mere contact with Pārvatī, Śiva lapsed in unconsciousness. She too lapsed into unconsciousness due to the contact with Śiva. She neither knew the day nor the night.
17. When Śiva following the worldly way began his enjoyment of pleasures, O sinless one, a great length of time passed by as though it was a mere moment in their awareness.
18. Then, O dear, Indra and the gods gathered together on the mountain Meru and began their mutual discussion.
Continues....
🌹🌹🌹🌹🌹
06 Jun 2022
Comments