top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 578 / Sri Siva Maha Purana - 578


🌹 . శ్రీ శివ మహా పురాణము - 578 / Sri Siva Maha Purana - 578 🌹


రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 01 🌴


🌻. శివ విహారము - 5 🌻


ఆయన తేజస్సును భూమి ధరించునట్లు చేయుడు. ఆ తేజస్సు నుండి ఆ ప్రభువు యొక్క కుమారుడగు స్కందుడు జన్మించగలడు (39). ఓ బ్రహ్మా! ఇపుడు నీవు దేవతాగణములతో కూడి నీ గృహమునకు వెళ్లుము. శంభుడు పార్వతితో గూడి ఏకాంతమునందు విహరించును గాక ! (40).


బ్రహ్మ ఇట్లు పలికెను--


లక్ష్మీపతి ఇట్లు పలికి వెంటనే తన అంతఃపురమునకు వెళ్లెను. ఓ మహర్షీ! దేవతలు నాతో గూడి తమ గృహములకు వెళ్లిరి (41). శక్తిశివుల విహారమును భరించజాలని భూమి శేషునితో, మరియు కూర్మముతో సహా ఆ భారమునకు కంపించెను (42). కూర్మము యొక్క భారముచే సర్వమునకు ఆధారమగు వాయువు స్తంభించగా ముల్లోకములు భయముతో కల్లోలితములాయెను (43). అపుడు దేవతలందరు దీనమగు మనస్సు గలవారై నాతో గలిసి వెళ్లి విష్ణువును శరణు జొచ్చి ఆ వృత్తాంతము నంతనూ నివేదించిరి (44).


దేవతలిట్లు పలికిరి --


దేవ దేవా! లక్ష్మీపతీ! అందరినీ రక్షించువాడా! ప్రభూ! భయ కల్లోలితమైన మనస్సు గల మేము శరణు జొచ్చితిమి. మమ్ములను రక్షించుము (45). ముల్లోకములలో ప్రాణవాయువు స్తంభించినది. కారణము తెలియకున్నది. దేవతలు, మునులు, ముల్లోకములలోని చరాచరప్రాణులు భయముతోకంగారు పడుచున్నారు (46).


బ్రహ్మ ఇట్లు పలికెను--


ఓ మహర్షీ! దేవతలందరు నాతో గూడి ఇట్లు పలికి దీనులై మిక్కిలి దుఃఖితులై విష్ణువు యెదుట మౌనముగా నిలబడిరి (47). విష్ణువు ఆ మాటలను విని నన్ను, సమస్త దేవతలను దోడ్కొని, వెంటనే శివునకు ప్రియమగు కైలాస పర్వతమునకు వెళ్లెను (48).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 578 🌹


✍️ J.L. SHASTRI

📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 01 🌴


🌻 The dalliance of Śiva - 5 🌻


39. Everything can be achieved through the discharge of the semen. O Brahmā, the process of discharge is very effective. The discharge that is fruitful none can withhold.


40-41. O gods, Śiva’s act of enjoyment will extend to a thousand years of celestial calculation. After that period is over, you can go there and do such things as will necessitate the fall of the semen on the ground. The son of the lord named Skanda will be born of that.


42. O Brahmā, return to your abode along with the gods. Let Śiva carry on enjoyment in the isolated place m the company of Pārvatī.



Brahmā said:—


43. After saying this, the lord of Lakṣmī immediately returned to his harem. O great sage, the gods too returned to their abodes along with me.


44. On account of the dalliance of Śiva and Pārvatī, the earth quaked with the weight along with Śeṣa (the serpent) and Kacchapa[10] (the tortoise).


45. By the weight of Kacchapa, the cosmic air, the support of everything, was stunned and the three worlds became terrified and agitated.


46. Then the gods along with me sought refuge in Viṣṇu and in our depression intimated to him the news.



The gods said:—


47. O Viṣṇu, the lord of the gods, O lord and protector of all, save us who have sought refuge in you and whose minds are acutely terrified.


48. The vital air of the three worlds is stunned. We do not know wherefore. The three worlds including the mobile and immobile as well as the gods and the sages are excited.



Continues....


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


Post: Blog2 Post
bottom of page