🌹 . శ్రీ శివ మహా పురాణము - 582 / Sri Siva Maha Purana - 582 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴
🌻. కుమారస్వామి జననము - 2 🌻
శివుని రాక ఆలస్యమగుటచే అచటకు వచ్చిన పార్వతి దేవశ్రేష్టులనందరినీ చూచి, ఆ వృత్తాంతము నంతనూ తెలుసుకొని మహాక్రోధమును పొంది (12), అపుడు విష్ణువు మొదలగు దేవతలందరినీ ఉద్దేశించి ఇట్లనెను (13).
దేవ్యువాచ|
రేరే సురగణాస్సర్వే యూయం దుష్టా విశేషతః | స్వార్థసంసాధకా నిత్యం తదర్థం పరదుఃఖదాః 14
స్వార్థహేతోర్మహేశానమారాధ్య పరమం ప్రభుమ్ | నష్టం చక్రుర్మద్విహారం వంధ్యాeôభవమహం సురాః 15
మాం విరోధ్య సుఖం నైవ కేషాంచిదపి నిర్జరాః | తస్మాద్దుఃఖం భ##వేద్వో హి దుష్టానాం త్రిదివౌకసామ్ || 16
దేవి ఇట్లు పలికెను--
ఓరీ! దేవతా గణములారా! మీరందరు పరమ దుర్మార్గులు. మీరు నిత్యము స్వార్థసాధనాపరులు. స్వార్థము కొరకై ఇతరులకు దుఃఖమును కలిగించెదరు (14). మీ స్వార్థము కొరకై పరమప్రభుడగు మహేశ్వరుని ఆరాధించి నా విహారమును భంగపరిచిరి. ఓ దేవతలారా! నేను వంధ్యను అయితిని (15). ఓ దేవతలారా! నాతో విరోధించిన వారికి ఎవరికైననూ సుఖము లభించదు. కావున దుష్టులగు దేవతలకు (మీకు) దుఃఖము కలుగు గాక! (16)
బ్రహ్మ ఇట్లు పలికెను-
శివుని పత్నియగు ఆ పార్వతి ఇట్లు పలికి కోపముతో మండిపడుతూ విష్ణువు మొదలగు దేవతలనందరినీ శపించెను (17).
పార్వతి ఇట్లు పలికెను--
ఈ నాటి నుండియూ దేవతల భార్యలు వంధ్యలు అగుదురు గాక! నన్ను విరోధించిన దేవతలందరు దుఃఖితులగుదురు గాక! (18)
బ్రహ్మ ఇట్లు పలికెను-- సకలేశ్వరి యగు పార్వతి విష్ణువు మొదలగు దేవలనందరినీ ఇట్లు శపించి శివతేజస్సును గ్రహించిన అగ్నితో కోపముగా నిట్లనెను (19). పార్వతి ఇట్లు పలికెను-- ఓయీ అగ్నీ! నీవు నిత్యదుఃఖితమగు హృదయము గలవాడవై సర్వభక్షకుడవు కమ్ము. నీవు శివతత్త్వము నెరుంగని మూర్ఖుడవు గనుక దేవకార్యమును చేసినావు (20). ఓరీ మోసగాడా! నీవు మహా దుష్టుడవు. దుష్టుల దుష్ట బోధనలను విని శివవీర్యమును గ్రహించితివి. నీవు ఉచితమగు కార్యమును చేయలేదు (21). సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 SRI SIVA MAHA PURANA - 582 🌹 ✍️ J.L. SHASTRI 📚. Prasad Bharadwaj 🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 02 🌴 🌻 The birth of Śiva’s son - 2 🌻 12. When Śiva took a long time to return, she hastened there and saw the gods. On coming to know of the incident she became very furious. 13. She told Viṣṇu and the gods as follows. The goddess said:— 14. Hi Hi, O gods, you are wicked and particularly selfish and for that purpose you give pain to others. 15. O gods, for the sake of realising your self-interests you all propitiated the lord and spoilt my dalliance. I have become a barren woman therefore. 16. O gods, after offending me none can be happy. Hence O wicked heaven-dwellers, you will remain unhappy. Brahmā said:— 17. After saying these words Pārvatī, the daughter of the king of mountains, blazing with fury cursed Viṣṇu and all other gods.
Pārvatī said:— 18. From now onwards let the wives of the gods be utterly barren and let the gods who offended me be unhappy.
Brahmā said:—
19. Cursing Viṣṇu and other gods, Pārvatī furiously told Agni who had swallowed Śiva’s semen.
Pārvatī said:—
20. O Agni, be the devourer of everything and let your soul be afflicted. You are a fool. You do not know Śiva’s fundamental principles. You have come forward to carry out the task of the gods.
21. It is neither proper nor beneficent to you to have eaten up Śiva’s semen. You are a rogue, a wretched vile, paying heed to the wicked counsel of the wicked.
Continues....
🌹🌹🌹🌹🌹
Commentaires