🌹 . శ్రీ శివ మహా పురాణము - 590 / Sri Siva Maha Purana - 590 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 03 🌴
🌻. కార్తికేయుని లీలలు - 3 🌻
అతడా బాలునికి కుడి పార్శ్వమునందు వజ్రముతో కొట్టెను. అచట నుండి మహాబలశాలియగు శాఖుడనే పురుషుడొకడు పుట్టెను (22). అపుడు మరల ఇంద్రుడు ఆ బాలుని ఎడమ పార్శ్వమునందు వజ్రముతో కోట్టెను. అపుడు విశాఖుడను పేరు గల మరియొక బలశాలియగు పురుషుడు పుట్టెను (23). అపుడు ఇంద్రుడు వజ్రముతో ఆ బాలుని హృదయముపై కొట్టగా, అదే తీరున మహా బలశాలి నైగముడను పేరు గలవాడు అగు మరియొక పురుషుడు జన్మించెను (24).
అపుడు మహావీరులు, మహాబలులు అగు ఆ స్కందాది నల్గురు పురషులు వెంటనే ఇంద్రుని సంహరించుటకు ఉద్యమించగా, ఇంద్రుడు వారిని శరణు పొందెను (25).
ఓ మహర్షీ ! ఇంద్రునకు ఆ నల్గురిలో గల భేదము తెలియలేదు. అతడు భయపడి దేవతాగణములతో గూడి అశ్చర్యముతో తన లోకములోని స్వగృహమునకు వెళ్లెను (26). కుమారా! అనేక లీలలను ప్రదర్శించే సమర్థుడగు ఆ బాలకుడు పూర్వమువలెనే
నిర్భయుడై ఆనందముతో అచటనే నిలబడి యుండెను (27). ఆ సమయములో అచటకు కృత్తికలనే ఆర్గురు స్త్రీలు స్నానము కొరకై వచ్చి కాంతులను వెదజల్లే ఆ బాలకుని గాంచిరి (28). కృత్తికలనే ఆ స్త్రీలు అందరు ఆ బాలుని తీసుకొనగోరిరి. ఓ మునీ! ఆ బాలుని ఎవరు తీసుకొనవలెననే విషయములో వారి మధ్య వాదము చెలరేగెను (29).
ఓ మునీ! వారి వాదమును తొలగించుటకై ఆ బాలుడు ఆరు ముఖములను పొంది వారందరి స్తన్యమును త్రాగగా వారు ఆనందించిరి (30). ఆ బాలుని మనస్సులోని ఆలోచనను ఎరింగి ఆ కృత్తిలందరు అపుడా బాలకుని తీసుకొని ఆనందముతో తమ లోకమునకు వెళ్లిరి (31).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 590 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 03 🌴
🌻 The boyhood sports of Kārttikeya - 3 🌻
22. There was great hue and cry. The Earth, the mountains and the three worlds quaked. Indra the lord of gods came there.
23. With his thunderbolt he hit on his right side. A person named “Śākha”[2] of great strength came out of that side.
24. Śakra struck him again with his thunderbolt on his left side. Another strong person named Viśākha came out of that side.
25. Then Indra struck his heart with his thunderbolt. Another person very powerful like him named Naigama came out.
26. Then the four of great heroic strength including Skanda rushed to attack Indra. I offered my protection to Indra.
27. Afraid of Guha, Indra with all the gods went away to his region agitatedly. O sage, he did not know his secret.
28. That boy remained there itself as fearless as before. O dear, he was highly pleased and continued his divine sports of various sorts.
29. Meanwhile the six ladies named Kṛttikās came there for bath and they saw the lordly boy.
30. All of them desired to take and fondle him O sage, as a result of their simultaneous desire for taking and fondling the boy, a dispute arose.
31. In order to quell their mutual dispute, the boy assumed six faces and drank milk off their breasts. O sage, they were all satisfied.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments