🌹 . శ్రీ శివ మహా పురాణము - 599 / Sri Siva Maha Purana - 599 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 05 🌴
🌻. కుమారాభిషేకము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఇంతలో ఉత్తమమైనది, అద్భుతమైనది, నిత్మశోభ గలది, విశ్వకర్మచే నిర్మించబడినది, వంద చక్రములు గలది, మిక్కిలి విస్తీర్ణమైనది, మనోవేగముతో పయనించునది, మనోహరమైనది, పార్వతిచే పంపబడినది, శ్రేష్ఠగణములచే చుట్టు వారబడి యున్నది అగు రథము అచట కనబడెను (1,2). అనంతుడు, గొప్ప జ్ఞాని, పరమేశ్వర తేజస్సంభూతుడు అగు కార్తికుడు దుఃఖముతో నిండిన హృదయముతో రథము నెక్కెను (3). అదే సమయములో దుఃఖపీడితలైన కృత్తికలు ఉన్నత స్త్రీల వలె జుట్టు విరబోసుకొని అచటకు వచ్చి ఇట్లు పలికిరి (4).
కృత్తికలిట్లు పలికిరి -
ఓ దయాసముద్రా! నీవు నిర్దయుడవై మమ్ములను విడచి వెళ్లుచున్నావు. పెంచిన తల్లులను ఈ తీరున కుమారుడు విడిచి వెళ్లుట ధర్మము కాదు (5). నిన్ను మేము ప్రేమతో పెంచినాము గనుక, ధర్మము ప్రకారంగా నీవు మా కుమారుడవు: మేము ఏమి చేయుదుము? ఎచటకు వెళ్లెదము? (6) ఇట్లు పలికి ఆ కృత్తికలందరు కార్తికుని గుండెలకు హత్తుకొని కుమారుని వియోగము కారణంగా వెంటనే మూర్ఛిల్లిరి (7).
ఓ మునీ! కుమారుడు వారికి అద్యాత్మ వచనములను బోధించి, వారిని దోడ్కొని శివగణములతో బాటు రథము నధిష్ఠించెను (8). కుమారుడు శివగణములతో బాటు అనేక సుఖకరములగు మంగళములను చూస్తూ, వింటూ, తండ్రి యొక్క మందిరమునకు వెళ్లెను (9). కుమారుడు మనో వేగముతో పయనింప సమర్ధమగు రథముపై నందీశ్వరునితో గూడి అక్షయవట వృక్ష మూలము నందు గలకైలాసమును చేరెను (10). అనేక లీలలను ప్రదర్శించుటలో సమర్ధుడగు ఆ శివ పుత్రుడైన కుమారుడు కృత్తికలతో, శివగణములతో కూడి ఆనందముగా అచట ఉండెను (11).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 599 🌹
✍️ J.L. SHASTRI 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 05 🌴
🌻 Kārttikeya is crowned - 1 🌻
Brahmā said:—
1-2. In the meantime he saw an excellent, lustrous and wonderful chariot, made by Viśvakarman. It was a commodious with a hundred wheels. It was beautiful and had the quickness of the mind. It had been sent by Pārvatī and was surrounded by the excellent attendants of Śiva.
3. With an aching heart, Kārttikeya, born of the semen of lord Śiva, the perfectly wise and endless Being, got into it.
4. At the same time, the distressed grief-stricken Kṛttikās approached him with dishevelled hair and began to speak like mad women.
Kṛttikās said'.—
5. O ocean of mercy, how is it that you ruthlessly leave us and go? This is not a virtuous thing for a fostered son to forsake his mothers.
6. You have been brought up by us affectionately. Hence you are our son in virtue of that. What shall we do? Where shall we go? What can we do?
7. After saying this and closely embracing Kārttikeya, the Kṛttikās fell into a swoon due to the imminent separation from their son.
8. Restoring them to consciousness and instructing them with spiritual utterances, O sage, he got into the chariot along with them and the Pārṣadas too.
9. Seeing and hearing various auspicious and pleasing things Kumāra went to the palace of his father along with the Pārṣadas.
10. Kumāra reached the foot of a Nyagrodha tree at Kailāsa in the fast chariot along with Nandin seated to his right.
11. There Kumāra, the son of Śiva, an expert in various divine sports, waited along with the Kṛttikās and the chief of Pārṣadas, in great delight.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments