🌹 . శ్రీ శివ మహా పురాణము - 604 / Sri Siva Maha Purana - 604 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 05 🌴
🌻. కుమారాభిషేకము - 6 🌻
లక్ష్మి దివ్యసంపదను, రమణీయమగు గొప్పహారమును, సావిత్రి సంపూర్ణసిద్ధ విద్యను ఆనందముతో నిచ్చిరి(51). ఓ మునీ! అచటకు వచ్చిన ఇతరదేవీ మూర్తులు, అతడు శిశువుగా నుండగా పాలించిన కృత్తికలు తమకు ప్రియమగు వస్తువులను అతనికి ఇచ్చిరి (52). ఓ మహర్షీ! అచట గొప్ప ఉత్సవము జరిగెను. అందరు ప్రసన్నులైరి. పార్వతీ పరమేశ్వరులు విశేషముగా సంతోషంచిరి (53). ఆ సమయములో ప్రతాపశాలి, తేజశ్శాలి అగు రుద్రుడు ఆనందముతో నవ్వి బ్రహ్మ మొదలగు దేవతలతో నిట్లనెను (54).
శివుడిట్లు పలికెను-
ఓ హరీ! బ్రహ్మా! దేవతలారా! మీరందరు నా మాటను వినుడు. నేను అన్ని విధములుగా ప్రసన్నుడనైతిని. మీకు నచ్చిన వరములను కోరుకొనుడు(55).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలందరు ఆ శంభుని వచనమును విని ప్రసన్నమగు ముఖము గలవారై ప్రభువగు పశుపతి దేవునితో నిట్లనిరి (56). ఓ ప్రభూ! ఈ కుమారుని చేతిలో తారకుడు సంహరింబడ గలడు. ఈ ఉత్తమ చరిత్రము అందుకొరకు మాత్రమే ఘటిల్లినది (57). కావున తారకుని సంహరించుటకు సన్నద్ధులమై ఈనాడే బయలుదేరెదము. కుమారునకు అనుమతినిమ్ము. ఆతడు వానిని వధించి మాకు సుఖమును కలుగజేయుగాక! (58)
అటులనే అని అంగీకరించి ఆ విభుడు అపుడు దయతో నిండిన హృదయము గలవాడై, తారకాసుర సంహారము కొరకు కుమారుని దేవతలకు అప్పగించెను (59).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 604🌹
✍️ J.L. SHASTRI 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 05 🌴
🌻 Kārttikeya is crowned - 6 🌻
51. Lakṣmī gave him divine wealth and a great and beautiful necklace. Sāvitrī gave him the entire Siddhavidyā[3] with joy.
52. O sage, the other goddesses too who had come there gave him their respective presents. The Kṛttikās too did the same.
53. O excellent sage, there was great jubilation there. Everyone was delighted, especially Pārvatī and Śiva.
54. In the meantime, O sage, the powerful Śiva, spoke to Brahmā and to other gods laughingly and joyously.
Śiva said:—
55. “O Viṣṇu, O Brahmā, O gods, you listen to my words. I am delighted in all respects. Please choose the boons you wish.”
Brahmā said:—
56. O sage, on hearing those words of Śiva, Viṣṇu and other gods spoke to Śiva with faces beaming with pleasure.
The gods said:—
57. “O lord, Tāraka will certainly be killed by Kumāra. It is for that purpose that he is born.
58. Hence in our effort to kill him we shall start this very day. Please give your directions to Kumāra. Let him slay Tāraka for our happiness.
59. Thinking that it shall be so, lord Śiva entrusted his son to the gods in order to kill Tāraka, urged by his mercy that he was.
Continues....
🌹🌹🌹🌹🌹
Commentaires