top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 605 / Sri Siva Maha Purana - 605


🌹 . శ్రీ శివ మహా పురాణము - 605 / Sri Siva Maha Purana - 605 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 05 🌴


🌻. కుమారాభిషేకము - 7 🌻


విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలందరు అపుడు శివుని అనుమతిని పొంది గుహుని ముందిడుకొనివెంటనే కైలాసము నుండి బయలు దేరిరి(60). శివుని శాసనముచే విశ్వకర్మ కైలాసమునుండి బయటకు వచ్చి ఆ పర్వతమునకు సమీపములో సుందరము, అద్భుతము అగు నగరమును నిర్మించెను (61). దానిలో సుందరము, దివ్యము, అద్భుతము, గొప్ప ప్రకాశము గలది అగు గృహమును గుహుని కొరకు నిర్మించెను. విశ్వకర్మ ఆ గృహములో గొప్ప సింహాసనమును నిర్మించెను (62).


అపుడు బుధ్ధిశాలియగు హరి దేవతలచే సర్వతీర్థముల జలములతో కార్తికునకు భక్తితో మంగళాభిషేకమును చేయించెను (63). కార్తికుని అన్ని విధములగా అలంకరించి ప్రత్యేకముగా సంపాదించిన వస్త్రములను ధరింపజేసి ఆనందముతో ఉత్సవమును యథావిధిగా చుయించెను (64). విష్ణువు అతనికి ఆనందముతో బ్రహ్మాండాధిపత్యము నిచ్చి, తిలకము దిద్ది, దేవతలతో కలిసి పూజించెను (65).


అతడు దేవతలతో, ఋషులతో గూడి, శివస్వరూపుడు, సనాతనుడు అగు కార్తికుని అనేక స్తోత్రములతో ప్రీతి పూర్వకముగా స్తుతించెను (66). గొప్ప సింహాసనము నందున్న వాడు, బ్రహ్మాండమునకంతకు ప్రభువు, రక్షకుడు అగు కార్తికుడు మిక్కిలి ప్రకాశించెను (67).


శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలో కుమారాభిషేకమనే అయుదవ అధ్యాయము ముగిసినది(5).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 605🌹


✍️ J.L. SHASTRI 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 05 🌴


🌻 Kārttikeya is crowned - 7 🌻


60. At the bidding of Śiva, Brahmā, Viṣṇu and other gods jointly started from the mountain keeping Kumāra in front.


61. After coming out of Kailasa, at the behest of Viṣṇu, Tvaṣṭṛ built a wonderfully fine city very near the mountain.


62. There he built a divine, exquisite and wonderfully brilliant house for Kumāra. Tvaṣṭṛ set up an excellent throne there.


63. The intelligent Viṣṇu performed the auspicious ceremony of crowning Kārttikeya in the company of the gods by means of waters from all holy centres.


64. He bedecked Kārttikeya in every manner and dressed him gorgeously. He went through the ceremony in brief and made everyone celebrate the event with pleasure.


65. Viṣṇu joyously gave him the suzerainty of the universe. He applied the Tilaka mark and worshipped him along with the gods.


66. Bowing to Kārttikeya with pleasure along with the gods and sages he eulogised the eternal form of Śiva with various hymns.


67. Karttikeya seated in the excellent throne and assuming the lordship and protectorate of the universe shone extremely well.



Continues....


🌹🌹🌹🌹🌹


0 views0 comments

Comments


Post: Blog2 Post
bottom of page