top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 606 / Sri Siva Maha Purana - 606


🌹 . శ్రీ శివ మహా పురాణము - 606 / Sri Siva Maha Purana - 606 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 06 🌴


🌻. కుమారుని లీల - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -


అపుడచట ఆ గంగా పుత్రుడు తన యందు భక్తిని కలిగించే ఒక చక్కని లీలను ప్రదర్శించెను. ఓ నారదా! ఆ లీలను ప్రీతితో వినుము(1). అదే సమయములో అచటకు యజ్ఞమును చేసిన శోభాయుక్తుడగు నారదుడనే ఒక బ్రాహ్మణుడు గుహుని శరణు పొందుటకు వచ్చెను (2). ప్రసన్నమగు మనస్సు గల ఆ బ్రాహ్మణుడు కార్తికుని సమీపమునకు వచ్చి శుభస్తోత్రములతో ప్రణమిల్లి తన అభిప్రాయమును చెప్పెను (3).


బ్రాహ్మణుడిట్లు పలికెను -


ఓ స్వామీ! నా మాటను వినుము. నాకిపుడు కలిగిన కష్టమును తొలగించుము. బ్రహ్మాండములన్నింటికీ ప్రభువు నీవే. అందువలననే నిన్ను శరణు జొచ్చితిని (4). నేను వైదిక కర్మను చేయ నారంభించితిని. నా ఇంటి వద్ద నున్న మేక త్రాటిని తెంపుకొని పారిపోయినది(5).


అది ఎచటకు పోయినదో తెలియకున్నది. నేను చాలా వెదికితిని. కాని దొరకలేదు. దీనివలన నా క్రతువునకు పెద్ద ఆటంకము వాటిల్లినది(6). విభూ! నీవు ప్రభువై యుండగా యజ్ఞము భగ్నమగుట ఎట్లు సంభవము? ఓ అఖిలేశ్వరా! నీవు ఆలోచించి నా కోర్కెను పరిపూర్ణము చేయుము (7). ఓ శివపుత్రా! ప్రభూ! బ్రహ్మాండములన్నింటికీ ప్రభుడు, దేవతలందరిచే సేవింపబడువాడు అగు నిన్ను విడిచి నేను ఎవరిని శరణు పొందగలను?(8)


నీవు దీనబంధుడవు. దయాసముద్రుడవు. సేవింపదగిన వాడవు. భక్తుల యందు ప్రేమ గలవాడవు. విష్ణుబ్రహ్మాది దేవతలచే స్తుతింపబడే పరమేశ్వరుడవు (9). పార్వతీ తనయుడవగు స్కందుడవు. అద్వయుడవు. శత్రువులను తపింప జేయువాడవు. పరమాత్మవు. శరణు గోరు సత్పురుషుల ఆత్మను రక్షించు స్వామివి(10). దీనుల ప్రభువగు మహేశ్వరా! శవపుత్రా! ముల్లోకములకు తండ్రియగు ప్రభూ! మాయను వశము చేసుకున్న వాడా! నిన్ను శరణు పొందితిని .


విప్రులు నీకు ప్రియమైన వారు. నన్ను రక్షించుము. నీవు అందరికీ ప్రియుడగు ప్రభుడవు. నీవు సర్వజ్ఞుడవు. బ్రహ్మాది దేవతలు నిన్ను స్తుతించెదరు. మాయకు అధీశ్వరుడవగు నీవు మాయచే ఆకారమును దాల్చి, నీ భక్తులను రక్షించి సుఖముల నిచ్చుచున్నావు (11).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 606🌹


✍️ J.L. SHASTRI


📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 06 🌴


🌻 The miraculous feat of Kārttikeya - 1 🌻



Brahmā said:—


1. There Kumāra showed a miraculous feat. O Nārada, listen to it that bestows devotion.


2. Then a certain brahmin Nārada came there, seeking refuge in Kumāra. He was glorious and had been performing a sacrifice.


3. Approaching Kumāra, bowing to and eulogising him with auspicious hymns the delighted brahmin related his tale.


The brahmin said:—


4. O lord, listen to my words. Relieve my distress. You are the lord of the universe. I seek refuge in you.


5. I began a goat sacrifice. The goat got loosened and strayed away from my house.


6. I do not know where it has gone. I have searched for it here and there but have not found it. Hence this will cause a serious default in my sacrifice.


7. While you are the lord, how can there be an obstacle to my sacrifice? O lord, after pondering over this matter please fulfil my task.


8. O lord, O son of Śiva, who else can I approach except you, who are worthy of being resorted to, who are the lord of the entire universe and are served by all the gods.


9-10. You are the kinsman of the distressed. You are worthy of being served well. You are favourably disposed to your devotees. You are the great lord eulogised by Viṣṇu, Brahmā and other gods. You are Skanda the delighter of Pārvatī, the sole destroyer of enemies, the great soul, the lord who bestows his own self upon the good seeking refuge in him.


11. O lord of the distressed, O great lord, O son of Śiva, O lord of the three worlds, O master of magical art, I have to seek refuge in you. O favourite of the brahmins, save me. You are the lord of all. You are eulogised by Brahmā and other gods who bow to you. You have assumed forms through magical art. You are the bestower of happiness to your devotees. You are eager to protect. You wield power of deluding others.



Continues....


🌹🌹🌹🌹🌹


0 views0 comments

Comments


Post: Blog2 Post
bottom of page