top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 607 / Sri Siva Maha Purana - 607


🌹 . శ్రీ శివ మహా పురాణము - 607 / Sri Siva Maha Purana - 607 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 06 🌴


🌻. కుమారుని లీల - 2 🌻


భక్తుల ప్రాణప్రియులైన వాడా! సద్గుణ నిలయుడవగు నీవు త్రిగుణాతీతుడవు. శంభునకు ప్రియచసుతుడవగు నీవు శంభు స్వరూపడవు. సచ్చిదానందరూపుడవగు నీవు ప్రసన్నుడవై సుఖములనిచ్చెదవు. త్రిపురారి యగు శంకరుని కుమారుడవగు నీవు సర్వము తెలిసిన వాడవు. పవిత్ర ప్రేమకు నీవు సర్వదా వశుడవై యుందువు. ఆరు మోయులు గల నీకు సాధువులు, భక్తులు ప్రీతి పాత్రులు.


సర్వేశ్వరుడవగు నీవు సుఖముల నిచ్చెదవు. సాధవులకు ద్రోహము చేయువారిని నీవు సంహరించెదవు. శంకరుడు నీ తండ్రి. నీవు బ్రహ్మాండములను పాలించు ప్రభుడవు. దేవతలు మొదలగు వారందరు నీ పాదములను సేవించెదరు. నీకు సేవ ప్రియమైనది. నన్ను రక్షించుము (12). శత్రువులకు భయమును కలిగించువాడా! శంకర స్వరూపా! జనులకు శరణునొసగి సుఖములనిచ్చే నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను. ఓ స్కందా! నా విన్నపమును నీ చెవిలో వేసుకొనుము. జనుల మనస్సులో నీ భక్తి సర్వదా ఉండునట్లు చేయుము (13).


సర్వసమర్ధుడవగు నీవు ఎవనికి రక్షకుడవో, వానిని బలవంతుడు, సమర్ధుడు, రెండు పార్శ్యములయందు దృఢమగు రక్షణ నేర్పరుచుకున్నవాడు అగు శత్రువైననూ, తక్షకుడే అయిననూ, రాక్షసుడైననూ ఏమి చేయగలడు? (14) అనేక గురువులను శుశ్రూష చేసినవాడైననూ నిన్ను స్తుతింప సమర్ధుడు గాడు. మంద బుద్ది అగు నేను ఎట్లు స్తుతించగలను? గొప్ప వారిచే పూజింపబడే ఓ స్కందా! నేను శుచియైననూ, కాక పోయిననూ, ఎట్లున్ననూ, నీ పాదపద్మముల పరాగమును ప్రార్థించుచున్నాను (15).


ఓ సర్వేశ్వరా! భక్తవత్సలా! కరుణా సముద్రా! నేను నీ వాడను. సేవకుడను. ఓ మహాప్రభూ! నీ సేవకుని వంద తప్పులనైననూ నీవు లెక్కించవు. ఓ విభూ! భక్తుని అల్పమగు భక్తిని కూడా నీవు గుర్తించెదవు. నీవు భృత్యుల దుఃఖములను పోగొట్టెదవు. ఓ భగవాన్‌! నీ కంటె వేరుగా రక్షకుడు లేడు. నా కంటె ఎక్కువ మూర్ఖుడగు మానవుడు లేడు (16) .



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 607🌹


✍️ J.L. SHASTRI


📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 06 🌴


🌻 The miraculous feat of Kārttikeya - 2 🌻


12. You love devotees as your own vital air. You are the receptacle of all attributes. You are beyond three attributes. You are the beloved of Śiva. You are Śiva Himself. You confer welfare. You are the bestower of happiness with delight. You are the great Existent and cosmic consciousness. You are the son of Śiva, the omniscient who ḍestroyed the three cities of Asuras. You are always subservient to great and pious love. You have six faces. You love the saintly persons who kneel to you. You are the lord of all people and their benefactor. You destroy those, who harass the good. You are the preceptor of even Śiva. You are the lord of the entire universe. Your feet are served by all the gods. O lover of service, save me.


13. O Skanda, terrible to the enemies, the benefactor of the devotees, I bow to your lotus-like feet. You are the refuge of people and source of their happiness. Please hear my submission through your ears. Please instil into the heart of everyone the feelings of devotion to you.


14. If you are the protector with efficient honour what harm can an opponent do even if he be strong and efficient and protected on either side? What harm can even Takṣaka[1] or even a carnivorous animal do unto him.


15. Even the preceptor of the gods cannot eulogise you adequately. Then tell me, how can I a foolish and wretched creature? O Skanda, pure or impure, noble or ignoble, of whatever nature I be, I pray unto the dust of your lotus-like feet.


16. O lord of all, ocean of mercy, favourably disposed to devotees, I am your own servant. May even a hundred sins of your own servant or a leader of the Gaṇas be forgiven. O lord, you know even the slightest act of devotion done anywhere. You are the destroyer of the distress of your servants. O lord, there is no other protector save you and no other wretched vulgar person than I.



Continues....


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


Post: Blog2 Post
bottom of page