🌹 . శ్రీ శివ మహా పురాణము - 617 / Sri Siva Maha Purana - 617 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 08 🌴
🌻. దేవాసుర యుద్ధము - 5 🌻
ఓ మునీ! అపుడు అందరు చూచుచుండగా, శరీరమునకు గగుర్పాటును కలిలగించునది, మిక్కిలి భయంకరమైనది అగు మహాయుద్ధము విష్ణుతారకుల మధ్య ప్రవర్తిల్లెను (43). విష్ణువు గదను పైకెత్తి ఆ రాక్షసుని బలముగా కొట్టగా, మహాబలశాలి యగు ఆతడు దానిని త్రిశూలముతో రెండు ముక్కలుగా చేసెను (44).
దేవతలకు అభయమునిచ్చే విష్ణుభగవానుడు అపుడు కోపించి, శార్‌ఙ్గధనస్సు నుండి విడువబడిన వేలాది బాణములతో రాక్షసరాజును కొట్టెను (45). మహావీరుడు, శత్రు వీరులను సంహరించు వాడు అగు ఆ తారకాసురుడు కూడా వెంటనే తనవాడి బాణములతో ఆ బాణమలన్నింటినీ ముక్కలుగా చేసెను (460. అపుడు తారకాసురుడు వెంటనే మురారిని శక్తితో కొట్టెను. విష్ణువు ఆ దెబ్బకు మూర్ఛిల్లి భూమిపై బడెను (47). అచ్యుతుడు క్షణములో లేచి కోపముతో చక్రమును చేతబట్టి పెద్ద సింహనాదమును చేసెను. ఆ చక్రము మండే అగ్ని శిఖిలతో ప్రకాశించెను (48).
అపుడు విష్ణువు రాక్షసేశ్వరుని దానితో కొట్టెను. ఆ పెద్ద దెబ్బచే మిక్కిలి పీడను పొందిన తారకుడు నేలపైబడెను (49). రాక్షస శ్రేష్ఠుడు, రాక్షస నాయకుడు, మహాబలశాలి అగు తారకుడు మరల లేచి వెంటనే తన శక్తితో చక్రమును ముక్కలుగా చేసెను (50). మరియు ఆ మహాశక్తితో దేవతల ప్రభువగు విష్ణువును కొట్టెను. మహావీరుడగు విష్ణువు కూడా నందకఖడ్గముతో వానిని కొట్టెను (51). ఓ మునీ! ఈ తీరున బలవంతులు, తగ్గిపోని బలము గలవారు అగు విష్ణుతారకులిద్దరు రణరంగములో పరస్పరము గొప్ప యుద్ధమును చేసిరి (52).
శ్రీ శివ మహాపురాణములో రుద్రసంహితయుందు కుమారఖండలో దేవాసుర సంగ్రామమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 617🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 08 🌴
🌻 The battle between the gods and Asuras - 5 🌻
43. O sage, a great fight ensued between Viṣṇu and Tāraka. It was very fierce. It caused horripilation to the onlookers.
44. Lifting up his club, Viṣṇu hit the Asura with great force but the powerful Asura split it with his trident.
45. The infuriated lord offering shelter to the gods hit the leader of the Asuras by arrows discharged from his bow.
46. The heroic Asura Tāraka, the slayer of enemies, immediately split the arrows of the gods by his own sharp arrows.
47. The Asura Tāraka then quickly hit Viṣṇu[2] with his spear. On being hit thus, Viṣṇu fell unconscious on the ground.
48. In a trice, Viṣṇu got up and in rage seized his discus that was blazing with flames and he roared like a lion.
49. Viṣṇu hit the king of Asuras with it. Overwhelmed by the forceful hit he fell on the ground.
50. Getting up again, the foremost among Asuras and their leader, Tāraka using all his strength immediately split the discus with his spear.
51. Again he struck Viṣṇu the favourite of the gods with that great spear. The heroic Viṣṇu hit him back with Nandaka.
52. O sage, both Viṣṇu and the Asura, equally powerful, hit each other in the battle with unabated strength.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments