🌹 . శ్రీ శివ మహా పురాణము - 621 / Sri Siva Maha Purana - 621 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 09 🌴
🌻. దేవాసురసంగ్రామ వర్ణన - 4 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆతడిట్లు పలికి వారిని నిందించుట వలన తన పుణ్యమును పోగొట్టు కొనెను. యుద్దవీరులలో శ్రేష్ఠుడగు ఆ తారకుడు అత్యద్భుతమగు శక్తిని చేతబట్టెను (36). ఇంద్రుడు గుహుని ముందిడుకొని ఆ బాలుని సమీపమునకు వచ్చుచున్న తారకాసురుని బలముగా వజ్రముతో కొట్టెను (37). నిందచే నష్టమైన బలము గల ఆ తారకుడు ఆ వజ్రపు దెబ్బచే శిథిలమైన అవయవములు గలవాడై వెంటనే క్షణకాలము నేలపై బడెను(38).
ఆతడు క్రిందపడిననూ మరల పైకి లేచి ఏనుగుపై నున్న ఆ ఇంద్రుని కోపముతో శక్తితో కొట్టి నేలపై బడవేసెను (39). ఇంద్రుడు పడుటను గాంచిన దేవసేనలో పెద్ద హాహాకారము బయల్వెడలెను. దేవతలను దుఃఖము ఆవేశించెను (40). తారకుడా సమయములో దుఃకము నిచ్చునది, తన నాశమునకు హేతవు అయినది, ధర్మమునకు విరుద్ధమైనది అగు కర్మను ఆచరించినాడు. దానిని నేను చెప్పెదను. తెలుసుకొనుము(41). పడియున్న ఇంద్రుని ఆతడు కాలితో తన్ని వజ్రమును చేతినుండి లాగుకొని దానితో మిక్కుటముగా ఆతనిని కొట్టెను (42).
ఈ విధముగా ఇంద్రుడు అవమానింపబడుటను గాంచి ప్రతాపశీలుడగు విష్ణు భగవానుడు చక్రమును పైకెత్తి తారకుని కొట్టెను(43). చక్రముతో గొట్టిన దెబ్బకు అతడు నేలపై బడెను. కాని ఆ రాక్షసరాజు మరల లేచి శక్తితో విష్ణువును కొట్టెను (44). ఆ శక్తి యొక్క దెబ్బకు అచ్యుతుడు నేలపై బడెను. అపుడు దేవతలు పెద్ద హాహాకారముతో అధికముగా ఆక్రోశించిరి (45). కాని ఒక నిమేషకాలములో విష్ణువు స్వయముగా లేచి నిలబడెను. ఇంతలో వీరభద్రుడు తత్‌క్షణమే రాక్షసుని పైకి వెళ్లెను (46).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 621🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 09 🌴
🌻 Boasting of Tāraka and fight between him and Indra, Viṣṇu, Vīrabhadra - 4 🌻
Brahmā said:—
36. Saying this and dispossessing himself of his own merit by that act of censure, Tāraka the foremost among war-mongers seized his wonderful spear.
37. Indra who was going ahead of Kumāra hit the demon Tāraka forcibly with his thunderbolt as he was approaching the boy.
38. Tāraka was shattered and split by that blow of the thunderbolt, his power being sapped up already by the act of censure. He fell on the ground.
39. Though he fell down, he got up immediately and furiously hit Indra who was seated on an elephant, with his spear and felled him to the ground.
40. When Indra fell down there was a great hue and cry. On seeing it a great pain entered the army of the gods.
41. Know from me the vile action that Tāraka has committed against virtue which is sure to bring about his own ruin.
42. He stamped on Indra with his foot after he fell down and seized his thunderbolt with which he hit him with great force.
43. Seeing Indra thus insulted, the powerful lord Viṣṇu lifted his discus and hit Tāraka.
44. Hit by the discus he fell on the ground. Getting up again, the lord of the Asuras hit Viṣṇu with his spear.
45. On being hit by the spear Viṣṇu fell on the ground. There was a great uproar. The gods lamented much.
46-47. Within a moment Viṣṇu got up but by that time Vīrabhadra came near the demon and dexterously raised his trident.
Continues....
🌹🌹🌹🌹🌹
Comentarios