🌹 . శ్రీ శివ మహా పురాణము - 622 / Sri Siva Maha Purana - 622 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 09 🌴
🌻. దేవాసురసంగ్రామ వర్ణన - 5 🌻
ప్రతాపశాలి, బలవంతుడు అగు వీరభద్రుడు త్రిశూలమునెత్తి రాక్షసరాజగు తారకుని గట్టిగా కొట్టెను (47). అపుడాతడు ఆ త్రిశూలపు దెబ్బచే నేలపై బడెను. మహాతేజశ్శాలియగు తారకుడు క్రింద బడిననూ మరల లేచి నిలబడెను (48). మహావీరుడు, సమస్త రాక్షసులకు నాయకుడు అగు తారకుడు కోపించి అపుడు గొప్ప శక్తితో వీరభద్రుని వక్షస్థ్సలముపై గొట్టెను (49). ఆ గొప్ప శక్తిచే క్రోధముతో వక్షస్థ్సలము నందు బలముగా కొట్టబడిన వీరభద్రుడు క్షణకాలము మూర్ఛిల్లి నేలపై బడెను (50).
గణములు, దేవతలు, గంధర్వులు, నాగులు, రాక్షసులు కూడా పెద్ద హాహాకారములను చేసి అనేక పర్యాయములు ఆక్రోశించిరి(51). గొప్ప బలశాలి, శత్రునాశకుడు అగు ఆ వీరభద్రుడు క్షణకాలములో లేచి మెరుపు వలె ప్రకాశిస్తూ నిప్పులను వెదజల్లే త్రిశూలమును చేత బట్టి విరాజిల్లెను (52).
ఆ త్రిశూలము తన కాంతులచే దిక్కులన్నిటినీ ప్రకాశింప జేయుచూ సూర్యచంద్ర బింబములవలె, అగ్ని మండలమువలె గొప్ప ప్రభలు గలదై, ప్రళయ కాలాగ్ని వలె మహో జ్వలముగా నున్నదై వీరులకు గొప్ప భయమును కలిగించెను (53). మహాబలుడగు వీరభద్రుడు త్రిశూలముతో ఆ రాక్షసుని చంపుటకు ఉద్యుక్తుడగుచుండగా కుమారస్వామి నివారించెను (54).
శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలో దేవాసురసంగ్రామ వర్ణన మనే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 622🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 09 🌴
🌻 Boasting of Tāraka and fight between him and Indra, Viṣṇu, Vīrabhadra - 5 🌻
47. The powerful Vīrabhadra hit him with all his force.
48. Hit by the trident he fell on the ground. Though he fell down, Tāraka of mighty splendour got up again.
49. The great hero, the leader of the entire host of Asuras hit Vīrabhadra in his chest with his great spear.
50. Vīrabhadra, hit by the spear furiously in his chest, fell unconscious on the ground.
51. The gods, the Gaṇas, Gandharvas, Serpents and Rākṣasas lamented frequently with cries of “Alas” “Alas.”
52. Within a moment, the powerful Vīrabhadra, the slayer of enemies, got up lifting his trident aloft, that had the lustre of lightning and was blazing forth.
53. The trident had a halo around, like that of the sun, the moon and the fire. It illuminated the quarters by means of its brilliance; caused terror even in the hearts of the brave. It had a deadly splendour and blazed well.
54. When the powerful Vīrabhadra was about to hit the Asura with his trident, he was prevented by Kumāra.
Continues....
🌹🌹🌹🌹🌹
Comentários