top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 636 / Sri Siva Maha Purana - 636


🌹 . శ్రీ శివ మహా పురాణము - 636 / Sri Siva Maha Purana - 636 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 13 🌴


🌻. గణశుని పుట్టుక - 1 🌻


సూతుడిట్లు పలికెను -


తారకుని సంహరించిన కుమారుని ఈ అద్భుత, ఉత్తమ వృత్తాంతమును విని నారదుడు మిక్కిలి ప్రసన్నుడై బ్రహ్మాను ప్రేమతో ఇట్లు ప్రశ్నించెను (1).


నారదుడిట్లు పలికెను -


దేవదేవా! ప్రజానాతా! నీవు శివజ్ఞానమునకు నిధివి. అమృతము కంటె గొప్పది, పవిత్రము అగు కార్తికేయ చరిత్రను నేను వింటిని (2). ఇపుడు గణేశుని ఉత్తమ చరిత్రను, దివ్యము మంగలములలోకెల్లా అతిమంగళమునగు ఆయన జన్మ వృత్తాంతమును వినగోరు చున్నాను (3).


సూతుడిట్లు పలికెను -


మహాముని యగు ఆ నారదుని ఈ మాటను విని బ్రహ్మ ప్రసన్నమగు మనస్సు గలవాడై శివుని స్మరించి ఇట్లు బదులిడెను (4).


బ్రహ్మ ఇట్లు పలికెను -


గణశుని వృత్తాంతమును పూర్వము నేను యథావిధిగా చెప్పయుంటిని. గణశుడు పుట్టుట, శని చూచుటచే ఆతని శిరస్సు భగ్నమగుట, ఏనుగు తలను అతికించుట అను గాథను చెప్పితిని. ఆ గాథ మరియొక కల్పమునకు సంబంధించినది (5). ఇపుడు శ్వేత వరాహకల్పమునకు సంబంధించిన గణశుని పుట్టుక చెప్పబడు చున్నది. ఈ గాథలో దయాళువు అగు శివుడు ఆతని శిరస్సును నరుకును (6).


ఓ మునీ! ఈ విషయములో నీవు సందేహమును పొందకుము. శంకరుడు గొప్ప లీలలను చేయును ఆ శంభుడు సర్వేశ్వరుడు. నిర్గుణుడే అయిననూ సగుణుడు కూడా (7). ఓ మహర్షీ! ఆయన లీలచేతనే జగత్తు సృజించబడి, పాలించబడి, సంహరింపబడు చున్నది. ప్రస్తుత గాథాను శ్రద్ధగా వినుము (8).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 636🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 13 🌴


🌻 The birth of Gaṇeśa - 1 🌻



Sūta said:—


1. On hearing the marvellously excellent story of the slayer of Tāraka thus, Nārada was highly delighted and he lovingly asked Brahmā.


2. O lord of gods and people, O storehouse of Śiva’s cult, the excellent story of Kārttikeya, far better than nectar, has been heard by me.


3. Now I wish to hear the excellent story of Gaṇeśa, the details of his divine nativity, auspicious of the auspicious.



Sūta said:—


4. On hearing the words of Nārada the great sage, Brahmā became delighted and replied to him remembering Śiva.



Brahmā said:—


5. Due to the difference of Kalpas, the story of the birth of Gaṇeśa is told in different ways. According to one account he is born of the great lord. His head looked at by Śani[1] was cut off and an elephant’s head was put on him.


6. Now we narrate the story of the birth of Gaṇeśa in Śvetakalpa[2] when his head was cut off by the merciful Śiva.


7. No suspicion need be entertained, O sage. Śiva is certainly the cause of enjoyment and protection. He is the lord of all. Śiva is possessed as well as devoid of attributes.


8. It is by His divine sport that the entire universe is created, sustained and annihilated. O excellent sage, listen to what is relevant to the context, with attention.



Continues....


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Comments


Post: Blog2 Post
bottom of page