top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 638 / Sri Siva Maha Purana - 638


🌹 . శ్రీ శివ మహా పురాణము - 638 / Sri Siva Maha Purana - 638 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 13 🌴


🌻. గణశుని పుట్టుక - 3 🌻


ఇట్లు జరుగగా ఒకప్పుడు శివపత్నియగు పార్వతీ దేవి మనస్సులో ఆలోచించెను. సర్వోత్కృష్టురాలగు ఆ పరమేశ్వరి మనస్సులో ఇట్లు తలపోసెను (18). సమర్థుడగు నా వ్యక్తి ఒకడు సేవకుడుగా నున్నచో చాల బాగుండును. అట్టి వ్యక్తి నా ఆజ్ఞను ఇసుమంతైననూ జవదాటకుండగా పాలించగలడు (19). ఆ దేవి ఇట్లు విచారించి తన శరీరమునుండి రాలిన నలుగుడు పిండితో లక్షణములన్నింటితో కూడిన పురుషుని నిర్మించెను (20). ఆతని అవయవములలో దోషమేమియూ లేకుండెను. అవయవములన్నయూ సుందరముగా నుండెను. సమర్థుడు, సర్వశోభలతో నిండియున్నవాడు అగు ఆ పురుషుడు మహాబలమును. పరాక్రమమును కలిగియుండెను (21).


ఆమె అపుడు ఆ పురుషునకు అనేక వస్త్రములు, అలంకారములను ఇచ్చి సర్వోత్తమమగు అనేక ఆశీర్వచనములను పలికెను (22). నీవు నా పుత్రుడవు. నీవు తక్క నావాడు మరియొకడిచట లేడు. పార్వతీదేవి ఇట్లు పలుకగా ఆ పురుషుడు నమస్కరించి ఇట్లు పలికెను (23).


గణశుడిట్లు పలికెను -


ఇపుడు నీకు చేయదగిన పనియేమి? నీ మాటను నేను నెరవేర్చెదను. ఆ పురుషుని ఈ మాటను విని పార్వతి తన ఆ పుత్రునికి ఇట్లు బదులిడెను (24).


పార్వతి ఇట్లు పలికెను -


ఓ పుత్రా! నా మాటను వినుము. ఇపుడు నీవు నా ద్వారమును రక్షించుము. నీవు నా పుత్రుడవు గనుక నా వాడవు. నీవు తక్క మరియొకడు నా వాడు లేడు (25). పుత్రా! ఎవ్వరైననూ ఎప్పుడైననూ నా ఆజ్ఞ లేనిదే హఠాత్తుగా నా గృహములోపలికి రారాదు. నేను నీకు సత్యమును చెప్పు చున్నాను (26).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 638🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 13 🌴


🌻 The birth of Gaṇeśa - 3 🌻


18. At the time when the incident occurred, Pārvatī, the great Māyā, the great goddess, thought as follows.


19. “There must be a servant of my own who will be expert in his duties. He must not stray from my behest even a speck.”


20. Thinking thus the goddess created a person with all the characteristics, out of the dirt[3] from her body.


21. He was spotless and handsome in every part of his body. He was huge in size and had all brilliance, strength and valour.


22-23. She gave him various clothes and ornaments. She blessed him with benediction and said—“You are my son. You are my own. I have none else to call my own”. Thus addressed the person bowed to her and said:—



Gaṇeśa said:—


24. “What is your order? I shall accomplish what you command.” Thus addressed, Pārvatī replied to her son.

Pārvatī said:— 25. “O dear, listen to my words. Work as my gatekeeper from today. You are my son. You are my own. It is not otherwise. There is none-else who belongs to me. 26. O good son, without my permission, no one, by any means, shall intrude my apartment. I tell you the fact.” Continues.... 🌹🌹🌹🌹🌹

2 views0 comments

Comments


Post: Blog2 Post
bottom of page