top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 645 / Sri Siva Maha Purana - 645


🌹 . శ్రీ శివ మహా పురాణము - 645 / Sri Siva Maha Purana - 645 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 14 🌴


🌻. గణ వివాదము - 6 🌻


శంకరుడిట్లు పలికెను -


గణములారా! మీరందరు వినుడు. యుద్ధము సముచితము కాదు. మీరు నాకు సంబంధించిన వారు. ఆ గణశుడు గౌరికి సంబంధించిన వాడు (56). ఓ నా గణములారా! నేనీ సమయములో వెనుకకు తగ్గినచో, శివుడు సర్వదా భార్యకు విధేయుడు అనే అపకీర్తి లోకములో నిశ్చయముగా స్థిరపడును (57).


ఎదుటి వాని శక్తిని గమనించి ప్రతీకారమును చేయవలెననే గొప్ప నీతి గలదు. ఏకాకి, బాలుడు అగు ఈ గణశుడు ఏమి పరాక్రమమును చూపగల్గును? (58). గణములారా! మీరు యుద్ధములో గొప్ప నిపుణులని లోకములో పేరు గాంచినారు. నా గణములై యుండియూ మీరు యుద్ధమును విడనాడి లోకములో తేలికయగుట ఎట్లు సంభవము? (59)


స్త్రీ మొండిపట్టు పట్టరాదు. భర్త యెదుట మొండిపట్టు అసలే పనికి రాదు. గిరిజా దేవి అట్లు చేసినచో దాని ఫలమును నిశ్చయముగా అనుభవించగలదు (60). కావున నా వీరులైన మీరందరు నా మాటను శ్రద్ధతో వినుడు. మీరు యుద్ధమును నిశ్చయముగా చేయవలెను. ఏది జరిగిననూ జరుగనిండు (61).



బ్రహ్మ ఇట్లు పలికెను -


ఓ నారదా! మునీశ్వరా! అనేక లీలలలో నిపుణుడగు శంకరుడు లోక గతిని ప్రదర్శిస్తూ ఇట్లు పలికి విరమించెను (62).


శ్రీ శివమహా పురాణాములోని రుద్ర సంహితయందు కుమార ఖండలో గణవివాదమనే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 645🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 14 🌴


🌻 The Gaṇas argue and wrangle - 6 🌻



Śiva said:—


57. O Gaṇas, hear you all. A battle may not be a proper course. You are all my own. He is Pārvatī’s Gaṇa.


58. But if we are going to be humble, there is likely to be a rumour: “Śiva is subservient to his wife.” O Gaṇas, this is certainly derogatory to me.


59. The policy of meeting an action with another (Tit for tat) is a weighty one. That single-handed Gaṇa is a mere boy. What valour can be expected of him?


60. O Gaṇas, you are all experts in warfare and reputed to be so in the world. You are my own men. How can you forsake war and demean yourselves?


61. How can a woman be obdurate especially with her husband? Pārvatī will certainly derive the fruit of what she has done.


62. Hence, my heroic men, listen to my words with attention. This war has to be fought by all means. Let what is in store happen.”



Brahmā said:—


63. O excellent sage, O brahmin, after saying thus, Śiva an adept in various divine sports became silent observing the ways of the world.



Continues....


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
Post: Blog2 Post
bottom of page