top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 649 / Sri Siva Maha Purana - 649


🌹 . శ్రీ శివ మహా పురాణము - 649 / Sri Siva Maha Purana - 649 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 15 🌴


🌻. గణేశ యుద్ధము - 4 🌻


మహాబలుడగు గణేశుడు పరిఘను చేతబట్టుట గాంచి నేను వెంటనే పలాయనము చిత్తగించితిని (34), 'పొండు పొండు' అని పలుకతూ ఆతడు వారిని పరిఘతో మోదెను. కొందరు వారంతట వారే క్రిందబడిరి. మరికొందరిని ఆతడు పడవైచెను (35). మరికొందరు క్షణములో శివుని దరిజేరి ఆ వృత్తాంతమును సర్వమును శివునకు విన్నవించుకొనిరి (36). లీలాపండితుడగు శివుడు వారి ఆ దురవస్థను గాంచి ఆ వృత్తాంతమును విని పట్టజాలని కోపమును పొందెను (37).


అపుడాయన ఇంద్రుడు మొదలగు దేవగణములను, షణ్ముఖుడు, మొదలగా గల గణములను, భూతప్రేత పిశాచములను అందరినీ ఆదేశించెను (38). శివునిచే ఆజ్ఞాపించబడిన ఆ వీరులందరు ఆ గణశుని సంహరించు కోరికతో ఆయుధములనెత్తి పట్టుకొని ఎవరి వీలును బట్టి వారు అన్నివైపులనుండియు ముట్టడించిరి (39). ఎవరెవరి వద్ద ఏయే ఆయుధములు గలవో వారు వారు ఆయా ఆయుధములను ఆ గణేశునిపై బలముగా ప్రయోగించిరి (40). స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో పెద్ద హాహాకారము చెలరేగెను. ముల్లోకములలోని జనులందరు సందేహమును పొందిరి (41).


బ్రహ్మ గారి ఆయుర్ధాయము పూర్తికాలేదు గదా! శివుని ఇచ్ఛచే బ్రహ్మాండము కాలము కాని కాలమందు తనంత తానుగా వినాశనమును పొందుచున్నది (42). అచటకు విచ్చేసిన షణ్ముఖుడు మొదలగు గణములు మరియు దేవతలు, తమ ఆయుధములు వ్యర్థము కాగా పరమాశ్చర్యమును పొందిరి (43).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 649🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 15 🌴


🌻 Gaṇeśa’s battle - 4 🌻


34. On seeing the powerful Gaṇeśa seizing the iron club I began to run away immediately.


35. The others too who were shouting “Go, Go” were struck down with the iron club. Some fell themselves and some were felled by him.


36. Some of them fled to Śiva in a trice and intimated to him the details of the incident.


37. On seeing them in that plight and on hearing the news, Śiva, an adept in sports became very angry.


38. He issued directives to Indra and other gods, to the Gaṇas led by the six-faced Kumāra and to goblins, ghosts and spirits.


39. At the bidding of Śiva they all desired to kill Gaṇeśa. Lifting up their weapons in a suitable manner they came there from all directions.


40. Whatever weapon they had was hurled on Gaṇeśa with force.


41. There was a great hue and cry in all the three worlds consisting of the mobile and immobile. The inhabitants of the worlds were in a great fix and uncertainty.


42. “Brahma’s life span is not over, but the whole universe is undergoing untimely destruction. Certainly it is due to Śiva’s wish.


43. The sixfaced deity and the other gods who came there failed to use their weapons effectively. They were very much surprised.



Continues....


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Комментарии


Post: Blog2 Post
bottom of page