🌹 . శ్రీ శివ మహా పురాణము - 650 / Sri Siva Maha Purana - 650 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 15 🌴
🌻. గణేశ యుద్ధము - 5 🌻
ఇంతలో ప్రకాశస్వరూపురాలు, జ్ఞానస్వరూపురాలు అగు జగన్మాత ఆ వృత్తాంతమునంతనూ ఎరింగి అంతులేని కోపమును పొందెను (44). ఓ మహర్షీ! అపుడామెతన గణమునకు అన్ని విధములుగా సహాయతను చేకూర్చుటకై అచట రెండు శక్తులను నిర్మించెను (45). ఓ మహర్షీ! నల్లని పర్వతమువలెనున్న ఒక శక్తి గుహవంటి నోటిని విస్తరింపజేసి భయంకరమగు ఆకారమును ధరించి నిలబడెను (46). రెండవ శక్తి విద్యు ద్రూపములో నుండెను. ఆమె అనేక హస్తములను కలిగియుండెను. దుష్టులను శిక్షించు ఆ మహాదేవి భయమును గొల్పు చుండెను (47).
దేవతలు, గణములు ప్రయోగించిన ఆయుధములనన్నిటినీ తమ నోటితో గ్రహించి ఆ శక్తులు మరల వాటిని వెంటనే వారిపై విసిరినవి (48). వజ్రాయుధమునకు ఆ గతి పట్టగా పరిఘ వంటి ఆయుధమును గురించి చెప్పునదేమున్నది? ఈ తీరున వారచట అత్యద్భుతమగు క్రియల నాచరించిరి (49). పూర్వము గొప్ప కొండ సముద్రమును అడ్డగించిన తీరున, ఒకే ఒక బాలుడు జయింప శక్యము కాని సైన్యమునంతనూ అడ్డుకొనినాడు (50). ఒకే ఒక బాలుడు ఇంద్రాది దేవతలనందరినీ ఓడించి, శంకరుని గణములను చీకాకు పరిచినాడు (51). అపుడు అతని ప్రహారములచే కలత చెందిన వారందరు అనేక పర్యాయములు నిట్టూర్చి ఒకరితో నొకరు ఇట్లు పలికిరి (52).
దేవతలు, గణములు ఇట్లు పలికిరి -
ఏమి చేయవలెను? ఎచటకు పోవలెను? దిక్కులు పది తెలియకున్నవి. ఈతడు కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి పరిఘను త్రిప్పుచున్నాడు (53).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 650🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 15 🌴
🌻 Gaṇeśa’s battle - 5 🌻
44. In the meantime, goddess, the mother of the universe, of special knowledge, came to know of the entire incident and was very furious.
45. O great sage, the goddess created two Śaktis[1] then and there for the assistance of her own Gaṇa.
46. O great sage, one Śakti assumed a very fierce form and stood there opening her mouth as wide as the cavern of a dark mountain.
47. The other assumed the form of lightning. She wore many arms. She was a huge and terrible goddess ready to punish the wicked.
48. The weapons hurled by the gods and the Gaṇas were caught in the mouth and hurled back at them.
49. None of the weapons of the gods was seen anywhere around the iron club of Gaṇeśa. This wonderful feat was performed by them.
50. A single boy stirred and churned the vast impassable army in the same manner as great mountain[2] churned the ocean of milk formerly.
51. Indra and other gods were struck by him, singlehanded. The Gaṇas of Śiva became agitated and distressed then.
52. Gasping frequently for their breath, being utterly shaken by his blows they gathered together and spoke to one another.
The gods and Gaṇas said'.—
53. “What shall be done? Where should we go? The ten directions have become visible. He is whirling the iron club right and left.”
Continues....
🌹🌹🌹🌹🌹
Comments