top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 653 / Sri Siva Maha Purana - 653


🌹 . శ్రీ శివ మహా పురాణము - 653 / Sri Siva Maha Purana - 653 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 16 🌴


🌻. గణేశ శిరశ్ఛేదము - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -


ఓ నారదా! భక్తులననుగ్రహించు మహేశ్వరుడు ఈ నీ మాటను విని నీ మాటచే ఆ బాలునితో యుద్ధమును చేయుటకు నిశ్చయించెను (1). ముక్కంటి దేవుడు విష్ణవును పిలిచి ఆయనతో సంప్రదించి పెద్ద సైన్యముతో దేవతలతో గూడి గణేశుని ఎదుట నిలబడెను (2). మహాబలము గలవారు, గొప్ప ఉత్సహము గలవారు, శివుని మంచి చూపు ప్రసరించిన వారు అగు దేవతలు శివుని పాదపద్మములను స్మరించి వానితో యుద్ధమును చేసిరి (3). మహాబలపరాక్రమ శాలి, గొప్ప దివ్యమగు ఆయుధములు గలవాడు, వీరుడు, సమర్థుడు, శివస్వరూపుడు అగు విష్ణువు అపుడు అతనితో యుద్ధమును చేసెను (4).


శక్తిచే ఈయబడిన మహాబలము గల ఆ గణాధిపుడు అపుడు కర్రతో దేవ శ్రేష్ఠులను మరియు విష్ణువును వెంటనే కొట్టెను (5). ఓ మునీ! విష్ణువుతో సహా దేవతలందరు ఆ వీరునిచే కర్రతో కొట్ట బడిన వారై మొక్క వోయిన బలము గల వారై వెనుకకు దిరిగిరి (6). ఓ మునీ! శివుడు కూడా సైన్యముతో గూడి చిరకాలము యుద్ధము చేసి, భయమును గొల్పుచున్న ఆ గణేశుని గాంచి మిక్కలి ఆశ్చర్యమును పొందెను (7).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 653🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 16 🌴


🌻 The head of Gaṇeśa is chopped off during the battle - 1 🌻



Brahmā said:—


1. O Nārada, on hearing your words, the great lord who grants benediction to his devotees became desirous of fighting with the boy.


2. He called Viṣṇu and consulted him. Then with a great army and the gods, He, the three-eyed lord, stood face to face with him.


3. After remembering the lotuslike feet of Śiva, the gods possessing great strength, kindly glanced at by Śiva and highly jubilant, fought with him.


4. Viṣṇu of great strength, valour and skill and possessing great divine weapons and Śivā’s form fought with him.


5. Gaṇeśa hit all the chief gods with his staff. He hit Viṣṇu too, all of a sudden. The hero had been conferred great strength by the Śaktis.


6. O sage, all the gods including Viṣṇu were hit by him with the stick. They were turned back with their strength sapped.


7. O sage, after fighting for a long time along with the army and seeing him terrific, even Śiva was greatly surprised.



Continues....


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Comments


Post: Blog2 Post
bottom of page