🌹 . శ్రీ శివ మహా పురాణము - 655 / Sri Siva Maha Purana - 655 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 16 🌴
🌻. గణేశ శిరశ్ఛేదము - 3 🌻
విష్ణువు తనకు ప్రభువు, భక్తవత్సలుడు, మహేశ్వరుడు అగు శివుని స్మరించి చాల కష్టపడి ప్రయత్నించి ఆ పరిఘ యొక్క మార్గము నుండి తప్పించు కొనెను (16). శంకరుడుర విష్ణువు యొక్క ముఖమును చూచి కోపించి తన త్రిశూలమును చేత బట్టి యుద్దమును చేయుకోరికతో ఒకవైపునుండి ముందునకు వచ్చెను (17). మహేశ్వరుడగు శంభుడు శూలమును చేతబట్టి తనను సంహరించగోరి మీదకు వచ్చుచుండుటను మహాబలుడు, వీరుడు అగు పార్వతీ తనయుడు గాంచెను (18). శివుని శక్తిచే వర్థిల్లినవాడు, మహావీరుడు అగు ఆ గణేశుడు తల్లి పాదపద్మములను స్మరించి శక్తితో శివుని చూతిపై గొట్టెను (19).
మంచి లీలలను ప్రదర్శించే శివపరమాత్మ త్రిశూలము చేతి నుండి క్రిందపడుటకు గాంచి పినాక ధనస్సును తీసుకొనెను (20). గణేశుడు పరిఘతో దానిని కూడ నేలపై పడవేసెను. మరియు శివుని అయిదు చేతులను పరిఘతో కొట్టెను. అపుడు శివుడు ఇంకో అయిదు చేతులతో శూలము బట్టెను (21). లోకాచారము ననుసరించి శివుడు ఇట్లు పలికెను: అహో! ఈనాడు నాకు పెద్ద దుఃఖము సంప్రాప్తమైనది. ఇది నిశ్చయము. ఇపుడు గణముల గతియేమగును? (22) ఇంతలో శక్తి మాతలిచ్చిన బలముతో కూడియున్న వీరుడగు ఆ గణేశుడు పరిఘతో గణములను, దేవతలను మోదెను (23).
పరిఘచే పీడింపబడిన దేవతలు, గణములు పదిదిక్కులకు పరుగెత్తిరి. అద్భుతమగు ప్రహారమునిచ్చే ఆ గణేశుని ఎదుట యుద్దములో ఎవ్వరైననూ నిలువలేకపోయిరి (24). ఆ గణేశుని చూచి విష్ణువు ఇట్లనెను : ఈతడు ధన్యుడు, మహాబలుడు, మహావీరుడు, మహాశూరుడు. ఈతనికి యుద్దమునందు ప్రీతి మెండు (25). నేను దేవతలను దానవులను, రాక్షసులను, యక్షులను, గంధర్వులను, దితిపుత్రులను అనేక మందిని చూచితిని (26). తేజస్సు, రూపము, శౌర్యము, గణములు మొదలగు వాటిలో ఈ గణేశునితో సరిదూగ గలవారు ముల్లోకములలో ఒక్కరైననూ లేరు (27).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 655🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 16 🌴
🌻 The head of Gaṇeśa is chopped off during the battle - 3 🌻
16. Viṣṇu strenuously dodged the same after remembering Śiva, the great lord, favourably disposed towards His devotees.
17. Seeing his face on a side, the infuriated Śiva took up his trident with a desire to fight and came there.
18. Pārvatī’s son of great strength and heroism, saw Śiva arrived there with desire to fight him to a finish, the great lord with the trident in his hand.
19. Gaṇeśa, the great hero, who had been rendered more powerful by Pārvatī and the Śaktis remembered the lotuslike feet of his mother and struck him in his hand with his Śakti.
20. Thereupon the trident fell from the hand of Śiva of supreme soul. Seeing this, Śiva the source of great enjoyment and protection took up his bow Pināka.
21. Gaṇeśa felled that to the ground by means of his iron club. Five of his hands too were struck. He took up the trident with the other five hands.
22. “Alas, this has been more distressing even to me. What may not happen to the Gaṇas? Śiva who followed the worldly conventions cried out like this.
23. In the meantime the heroic Gaṇeśa endowed with the surplus power bestowed by the Śaktis struck the gods and the Gaṇas with his iron club.
24. The gods and the Gaṇas smothered by that wonderful striker with the iron club went away to the ten directions. None of them remained in the battlefield.
25-27. On seeing Gaṇeśa, Viṣṇu said—“He is blessed. He is a great hero of great strength. He is valorous and fond of battle. Many gods, Danavas, Daityas, Yakṣas, Gandharvas, and Rakṣasas I have seen. In the entire extent of the three worlds, none of them can equal Gaṇeśa in regard to brilliance, form, features, valour and other qualities.”
Continues....
🌹🌹🌹🌹🌹
Comments