🌹 . శ్రీ శివ మహా పురాణము - 657 / Sri Siva Maha Purana - 657 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 17 🌴
🌻. గణేశుడు మరల జీవించుట - 1 🌻
నారదుడిట్లు పలికెను -
ఓ బ్రహ్మా! నీవు మహాజ్ఞానివి. చెప్పుము. ఇంతవరకు వృత్తాంతము నంతనూ వింటిని. ఆ మహాదేవి ఏమి చేసినది? ఈ వృత్తాంతమును యథా తథముగా వినగోరు చున్నాను (1).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! వినుము. జగదంబ యొక్క చరితమును, తరువాత జరిగిన వృత్తాంతమును నీకు నిశ్చితముగా చెప్పెదను (2). ఆ గణశుడు సంహరింపబడగానే, గణములు మద్దెళ్లను, పటహములను మ్రోగించి గొప్ప ఉత్పవమును చేసిరి (3). శివుడు గణశుని శిరస్సును ఛేదించి దుఃఖమును పొందెను. ఓ మహర్షీ! పార్వతీ దేవి ఆ వార్తను విని మిక్కిలి కోపించెను (4). నేనేమి చేయెదెను? ఎచటకు వెళ్లెదను? అయ్యో! ఆపద వచ్చినది. ఇపుడు నా ఈ మహాదుఃఖము తొలగిపోవు ఉపాయమేది గలదు? (5)
దేవతలు, గణములు అందరు కూడి నా కుమారుని ఈనాడు నాశనము చేసినారు. నేను వారినందరినీ నశింపజేసెదను. లేదా ప్రలయమును కలిగించెను (6). ఇట్లు దుఃఖించినదై సర్వలోకములకు అధీశ్వరియగు ఆమె కోపించి వెనువెంటనే లక్షల సంఖ్యలో శక్తులను నిర్మించెను (7). అట్లు నిర్మించ బడిన ఆ శక్తులు అగ్నిశిఖలవలె మండిపడుతూ జగన్మాత యగు ఆ పార్వతికి నమస్కరించి, 'తల్లీ! ఆదేశించుము' అని పలికెను (8). ఓ మహర్షీ! శంభుని శక్తి, ప్రకృతి, మహామాయ అగు ఆమె ఆ మాటను విని మిక్కిలి కోపించి వారందరితో ఇట్లు బదులిడెను (9).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 657🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 17 🌴
🌻 The Resuscitation of Gaṇeśa - 1 🌻
Nārada said:—
1. O Brahmā, of great intellect, please narrate. When the entire news was heard what did the great goddess Pārvatī do? I wish to hear all in fact.
Brahmā said:—
2. O foremost among sages, listen. I shall mention the story of the mother of the universe in the manner that it happened afterwards.
3. When Gaṇeśa was killed, the Gaṇas were very jubilant. They played on Mṛdaṅgas and Paṭahas.
4. After cutting off the head of Gaṇeśa even as Śiva became sorry, goddess Pārvatī became furious, O great sage.
5. “O what shall I do? Where shall I go? Alas, great misery has befallen me. How can this misery, this great misery be dispelled now?
6. “My son has been killed by all the gods and the Gaṇas. I shall destroy them all or create a deluge.”
7. Lamenting thus, the great goddess of all the worlds angrily created in a moment hundreds and thousands of Śaktis.
8. Śaktis who were thus created, bowed to Pārvatī, the mother of the universe and blazing brilliantly spoke—“O mother, be pleased to command.”
9. O great sage, on hearing that, Pārvatī, the Śakti of Śiva, the Prakṛti, the great Māyā, spoke to them all in great fury.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments